SRH vs KKR Shreyas Iyer In New Avatar Finals: కొత్త అవతారం ఎత్తిన అయ్యర్.. SRHను ఆపేందుకు ఇది సరిపోద్దా?

కొత్త అవతారం ఎత్తిన అయ్యర్.. SRHను ఆపేందుకు ఇది సరిపోద్దా?

ఐపీఎల్-2024లో కేకేఆర్​ను సక్సెస్​ఫుల్​గా నడిపిస్తూ వచ్చాడు శ్రేయస్ అయ్యర్. బ్యాటర్​గా కంటే కెప్టెన్​గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాంటోడు ఎస్​ఆర్​హెచ్​తో ఫైనల్ ఫైట్​కు ముందు కొత్త అవతారం ఎత్తాడు. దీన్ని చూసిన ఫ్యాన్స్.. ఆరెంజ్ ఆర్మీని ఆపేందుకు ఇది సరిపోద్దా అని ప్రశ్నిస్తున్నారు.

ఐపీఎల్-2024లో కేకేఆర్​ను సక్సెస్​ఫుల్​గా నడిపిస్తూ వచ్చాడు శ్రేయస్ అయ్యర్. బ్యాటర్​గా కంటే కెప్టెన్​గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాంటోడు ఎస్​ఆర్​హెచ్​తో ఫైనల్ ఫైట్​కు ముందు కొత్త అవతారం ఎత్తాడు. దీన్ని చూసిన ఫ్యాన్స్.. ఆరెంజ్ ఆర్మీని ఆపేందుకు ఇది సరిపోద్దా అని ప్రశ్నిస్తున్నారు.

నెలన్నర నుంచి క్రికెట్ లవర్స్​ను ఎంతగానో అలరిస్తూ వస్తోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. నిండు వేసవిలో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్​తో మరింత హీట్ పుట్టించింది క్యాష్ రిచ్ లీగ్. ఈ సీజన్​లో చాలా మటుకు మ్యాచ్​లు ఆఖరి ఓవర్ వరకు వెళ్తూ ఆడియెన్స్​కు మస్తు వినోదాన్ని పంచాయి. ఇప్పుడు మెగా లీగ్ చివరి దశకు చేరుకుంది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్​తో ఈ సీజన్​కు తెరపడనుంది. గ్రూప్​ దశలో వరుస విజయాలతో టాప్​లో నిలిచిన కోల్​కతా నైట్ రైడర్స్, సన్​రైజర్స్ హైదరాబాద్ తుదిపోరుకు అర్హత సాధించాయి. ఈ హేమాహేమీల మధ్య ఫైనల్ ఫైట్ చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ టీమ్స్ ఫైనల్ చేరతాయని టోర్నీ ఆరంభానికి ముందు ఎవరూ ఊహించలేదు.

గత కొన్ని సీజన్లుగా సన్​రైజర్స్, కేకేఆర్ చెత్త ప్రదర్శనతో ఫ్యాన్స్​ను నిరుత్సాహపరిచాయి. దీంతో ఈ సీజన్ ముందు వీటిపై ఎవరికీ ఎక్స్​పెక్టేషన్స్ లేవు. అయితే ఎవరి అంచనాలకు అందుకుండా దూకుడైన ఆటతీరుతో ఫైనల్​కు చేరుకున్నాయీ జట్లు. తుదిపోరులో గెలిచి కప్పును సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నాయి. ఎవరి వ్యూహాల్లో వాళ్లు బిజీబిజీగా మారారు. ఈ తరుణంలో కోల్​కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కొత్త అవతారం ఎత్తాడు. ఎప్పుడూ బ్యాట్​తో మెరిసే అయ్యర్.. ఈసారి బంతిని చేతపట్టి రంగంలోకి దిగాడు. ప్రాక్టీస్ సెషన్స్​లో భాగంగా బౌలర్​గా దర్శనమిచ్చాడు అయ్యర్. జట్టు సీనియర్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్​ను అతడు ఇమిటేడ్ చేశాడు. అచ్చం అతడిలాగే బౌలింగ్​ చేశాడు.

నరైన్​ను దింపేశాడు అయ్యర్. అతడి లాంటి బౌలింగ్ స్టైల్, సేమ్ ఫేషియల్ ఎక్స్​ప్రెషన్స్​తో నవ్వులు పూయించాడు. ఇది చూసిన నెటిజన్స్ నరైన్​ను పర్ఫెక్ట్​గా ఇమిటేట్ చేశాడని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇది సరదాగా అనిపించడం లేదని, ఇందులో గట్టి ప్లానే దాగి ఉందని అంటున్నారు. అయ్యర్ స్పిన్ ప్రాక్టీస్ చేస్తున్నాడని.. ఫైనల్​లో ఎస్​ఆర్​హెచ్​ను ఆపేందుకు కొత్త ఎత్తుగడ అని అనుమానిస్తున్నారు. అయితే వరుణ్ చక్రవర్తి, నరైన్ లాంటి వాళ్లు ఉండగా అయ్యర్ ఎందుకు బౌలింగ్ చేస్తాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదైమైనా ఒక్క వీడియోతో వైరల్ అయిపోయాడు అయ్యర్. ఇక, ఈ సీజన్​లో కెప్టెన్​గా ఆకట్టుకున్న నరైన్.. బ్యాటర్​గా ఫర్వాలేదనిపించాడు. 14 మ్యాచుల్లో 146 స్ట్రైక్ రేట్​తో 345 పరుగులు చేశాడు. మరి.. అయ్యర్ ఇమిటేషన్ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments