SRH vs KKR Shah Rukh Khan Insulted Orange Army: SRHను దారుణంగా అవమానించిన షారుక్.. దీన్ని తట్టుకోవడం ఫ్యాన్స్​కు కష్టమే!

SRHను దారుణంగా అవమానించిన షారుక్.. దీన్ని తట్టుకోవడం ఫ్యాన్స్​కు కష్టమే!

ఐపీఎల్-2024లో నయా ఛాంపియన్​గా అవతరించింది కేకేఆర్. సీజన్ ఆరంభం నుంచి అదరగొడుతూ వచ్చిన అయ్యర్ సేన.. ప్లేఆఫ్స్​తో పాటు ఫైనల్స్​లోనూ అదే డామినేషన్​ను కంటిన్యూ చేసింది. అయితే రన్నరప్​గా నిలిచిన సన్​రైజర్స్​ను కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ అవమానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఐపీఎల్-2024లో నయా ఛాంపియన్​గా అవతరించింది కేకేఆర్. సీజన్ ఆరంభం నుంచి అదరగొడుతూ వచ్చిన అయ్యర్ సేన.. ప్లేఆఫ్స్​తో పాటు ఫైనల్స్​లోనూ అదే డామినేషన్​ను కంటిన్యూ చేసింది. అయితే రన్నరప్​గా నిలిచిన సన్​రైజర్స్​ను కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ అవమానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గత కొన్ని సీజన్లుగా నిరాశపరుస్తూ వచ్చాయి కోల్​కతా నైట్ రైడర్స్, సన్​రైజర్స్ హైదరాబాద్. చెత్త పెర్ఫార్మెన్స్​తో ఫ్యాన్స్​ను పూర్తిగా డిజప్పాయింట్ చేశాయి. అయితే సీజన్ గ్యాప్​లో పూర్తిగా మారిపోయిన ఈ టీమ్స్.. ఈసారి ఏకంగా ఫైనల్స్​కు చేరుకున్నాయి. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులను భయపెడుతూ వచ్చిన ఈ జట్ల మధ్య టైటిల్ ఫైట్ నెక్స్ట్ లెవల్​లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అంతా రివర్స్ అయింది. ఐపీఎల్-2024లో నయా ఛాంపియన్​గా అవతరించింది కేకేఆర్. సీజన్ ఆరంభం నుంచి అదరగొడుతూ వచ్చిన అయ్యర్ సేన.. ఫైనల్స్​లోనూ అదే డామినేషన్​ను కంటిన్యూ చేసింది. మ్యాచ్​ను వన్ సైడ్ చేసేసి కప్పును ఎగరేసుకుపోయింది. అయితే రన్నరప్​గా నిలిచిన సన్​రైజర్స్​ను కోల్​కతా ఓనర్ షారుక్ ఖాన్ అవమానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ సొంత జట్టుతో పాటు అపోజిషన్ టీమ్ ప్లేయర్స్​తోనూ మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడు. మ్యాచ్ ముగిశాక ఎవరు గెలిచినా సరే ఇరు జట్ల ఆటగాళ్లను కలుస్తాడు. ఆటగాళ్ల బాగోగుల గురించి ఆరా తీయడం, వారితో ఫొటోలు దిగడం, వారిని అభినందించడం కింగ్ ఖాన్​కు అలవాటు. దీంతో షారుక్​పై క్రికెట్ లవర్స్​కు మరింత రెస్పెక్ట్ పెరిగింది. అయితే ఐపీఎల్-2024 ఫైనల్స్​లో మాత్రం ఆయన ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ ముగిశాక ట్రోఫీతో కోల్​కతా టీమ్ మొత్తం గ్రూప్ ఫొటో దిగింది. ఈ టైమ్​లో తాను ఇవ్వడమే గాక.. జట్టు సభ్యులందర్నీ ఫ్లయింగ్ కిస్ ఇవ్వమన్నాడు షారుక్. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణాకు ఎస్​ఆర్​హెచ్​కు మధ్య రివేంజ్ స్టోరీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ మొదట్లో ఇరు జట్లకు మధ్య జరిగిన మ్యాచ్​లో మయాంక్ అగర్వాల్​ను ఔట్ చేశాక సన్​రైజర్స్ డగౌట్ వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అవమానించాడు హర్షిత్. అప్పటి నుంచి అతడిపై ఆరెంజ్ ఆర్మీ పగతో రగిలిపోతోంది. ఇలా ఫ్లయింగ్ కిస్ ఇచ్చినందుకు అతడి మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు ఇంకోసారి రిపీట్ చేసినందుకు బ్యాన్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో పుండు మీద కారం చల్లినట్లు.. హర్షిత్ సెలబ్రేషన్​ను ఫైనల్ మ్యాచ్ ముగిశాక రిపీట్ చేశాడు షారుక్. టీమ్ అందరితో కలసి ఫ్లయింగ్ కిస్​ ఇస్తూ ఎస్​ఆర్​హెచ్​ను దారుణంగా అవమానించాడు. అసలే ఓటమి బాధలో ఉన్న సన్​రైజర్స్ అభిమానులకు ఇది మింగుడు పడటం లేదు. మరి.. షారుక్​ చేసిన పనిపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments