SRH vs KKR Captain Shreyas Iyer Target BCCI: ఫైనల్​కు ముందు BCCIని టార్గెట్ చేసిన అయ్యర్.. అంత మాట అనేశాడేంటి?

ఫైనల్​కు ముందు BCCIని టార్గెట్ చేసిన అయ్యర్.. అంత మాట అనేశాడేంటి?

ఐపీఎల్-2024 ఫైనల్​కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో తుదిపోరు మొదలవనుంది. ఈ తరుణంలో బీసీసీఐని టార్గెట్ చేశాడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఇది చూసిన నెటిజన్స్ అంత మాట అనేశాడేంటని అంటున్నారు.

ఐపీఎల్-2024 ఫైనల్​కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో తుదిపోరు మొదలవనుంది. ఈ తరుణంలో బీసీసీఐని టార్గెట్ చేశాడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఇది చూసిన నెటిజన్స్ అంత మాట అనేశాడేంటని అంటున్నారు.

ఐపీఎల్-2024 ఇప్పుడు లాస్ట్ స్టేజ్​కు చేరుకుంది. సీజన్​లో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కోల్​కతా నైట్ రైడర్స్, సన్​రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్​తో ఈ సీజన్ పూర్తవనుంది. ఇన్నాళ్లూ హైవోల్టేజ్ మ్యాచ్​లు, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్​తో ఫుల్ ఎంజాయ్ చేసిన క్రికెట్ లవర్స్.. టైటిల్ ఫైట్ వాటన్నింటికీ మించిన రేంజ్​లో ఉండాలని ఆశిస్తున్నారు. ఎవరు విజేతగా నిలిచినా ఇబ్బందేం లేదని, రెండు జట్లు కూడా ఎంతో అద్భుతంగా ఆడుతూ ఈ స్థాయికి వచ్చాయని అంటున్నారు. అటు కేకేఆర్, ఇటు ఎస్​ఆర్​హెచ్ ఇప్పుడు తమ వ్యూహాలకు పదునుపెట్టే పనిలో ఉన్నాయి. ఈ తరుణంలో కోల్​కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత క్రికెట్ బోర్డును టార్గెట్ చేసుకొని అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్-2023 తర్వాత తనకు వెన్ను నొప్పి తిరగబెట్టిందని అన్నాడు అయ్యర్. ఆ ఇంజ్యురీ కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డానని చెప్పాడు. అయితే తనకు గాయమైందని చెప్పినా, నొప్పిని తట్టుకోలేకపోతున్నానని మొత్తుకున్నా ఎవరూ వినలేదంటూ బోర్డు మీద పరోక్షంగా విరుచుకుపడ్డాడు అయ్యర్. ఐపీఎల్ గురించి మాట్లాడుతూ.. రెడ్ బాల్ క్రికెట్ నుంచి వైట్ బాల్​కు మారడం అంత ఈజీ కాదన్నాడు. టీ20లకు అలవాటు పడటం కొంచెం కష్టమేనని, అయితే ఈ సవాల్​ను స్వీకరించానని, ఇప్పుడు పూర్తిగా అలవాటు పడ్డానని చెప్పాడు. అయ్యర్ కామెంట్స్ ఇప్పుడు వైరల్​గా మారాయి. వీటిని చూసిన నెటిజన్స్ బోర్డును లక్ష్యంగా చేసుకొనే అతడు ఇలా మాట్లాడాడని అంటున్నారు.

ఆర్నెళ్ల కింద వరకు అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టులో రెగ్యులర్ ప్లేయర్​గా ఉన్నాడు అయ్యర్. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్​లో స్టార్ బ్యాటర్​గా అవతరించాడు. అలాంటోడు వన్డే వరల్డ్ కప్-2023కి ముందు గాయంతో ఇబ్బంది పడ్డాడు. అయినా మెగా టోర్నీలో ఆడాలనే ఉద్దేశంతో ఐపీఎల్-2023కి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రపంచ కప్​లో అదరగొట్టాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్, ఇంగ్లండ్ సిరీస్​ల్లోనూ ఆడాడు. అయితే వెన్ను నొప్పి తిరగబెట్టడంతో ఇంగ్లండ్​తో టెస్టు సిరీస్​ మధ్యలో నుంచి ఎన్​ఏసీకు వెళ్లిపోయాడు. అయితే రీహాబిలిటేషన్​లో ఉన్న అయ్యర్​ క్రమంగా కోలుకున్నాడు. ఆ తరుణంలో రంజీల్లో ఆడమని బీసీసీఐ ఆదేశించింది. గాయం తిరగబెడుతుందనే భయంతో అతడు అందుకు నిరాకరించాడు. దీంతో తమ మాట వినలేదని బోర్డు అతడి కాంట్రాక్ట్​ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా అతడు పైవ్యాఖ్యలు చేశాడు. గాయమైందని చెప్పినా ఎవరూ తన మాట వినలేదంటూ ఇన్​డైరెక్ట్​గా బోర్డుపై ఫైర్ అయ్యాడు.

Show comments