iDreamPost

బయోపిక్ వెనుక బోలెడు కారణాలు

బయోపిక్ వెనుక బోలెడు కారణాలు

బాలీవుడ్ లో బయోపిక్కుల పరంపర కొనసాగుతూనే ఉంది. నిన్న బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన జీవిత కథ సినిమాగా తెరకెక్కబోతోందని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడెందుకనే అనుమానం రాకపోలేదు. గతంలో ఎంఎస్ ధోని, సచిన్, అజహారుద్దీన్ చిత్రాలు రాగా లేనిది తనది ఎందుకు ఉండకూడదు అనుకున్నాడేమో మొత్తానికి ఆ కోరిక కూడా తీర్చుకోబోతున్నాడు. ఇందులో రన్బీర్ కపూర్ గంగూలీగా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ముంబై టాక్. అఫీషియల్ అనౌన్స్ మెంట్ టైంలో అన్ని వివరాలు క్యాస్టింగ్ తో సహా ప్రకటించబోతున్నారు. దీని వెనుక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.

బిసిసిఐ టర్మ్ ముగిశాక గంగూలీ రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఓ ప్రచారం జరుగుతోంది. దానికి అనుగుణంగా తన గొప్పదనం ఇప్పటి తరానికి తెలియాలంటే సినిమా కంటే బెస్ట్ ఆప్షన్ లేదని తలచి తన స్టోరీకి కావాల్సినంత డ్రామా జోడించే దర్శకుడిని రచయితను వెతికి మరీ అంతా సెట్ చేసుకున్నాడట. నిజానికి గంగూలీ లైఫ్ లో హెవీ ఎమోషన్ లేదు. ధోని లాగా కింది స్థాయి నుంచి వచ్చినవాడు కాదు. ఇతను పుట్టకముందే వీళ్లది ఉన్నత కుటుంబం. అయితే కెప్టెన్ గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన గంగూలీ అంటే అందరికీ గుర్తొచ్చేది మ్యాచ్ గెలిచాక లార్డ్ మైదానంలో చొక్కా విప్పడమే.

సరే ఎవరి అజెండా వాళ్ళది మొత్తానికి మరో బయోపిక్ తెరపైకి రాబోతోంది. గత కొన్నేళ్లుగా ఈ జీవిత కథలు ఒక ఫార్ములాగా మారి రొటీన్ అవుతున్నాయన్న కామెంట్స్ లేకపోలేదు. అయినా కూడా ఈ గంగూలీ రావడం సాహసమే. వీలైనంత ఎక్కువ డ్రామా ఉంటేనే ఇలాంటివి పండుతాయి. అన్నట్టు గంగూలీ అప్పట్లో నడిపిన హీరోయిన్ నగ్మా లవ్ స్టోరీ ఇందులో చూపిస్తారా లేదా అనే ప్రశ్నలు అప్పుడే కొన్ని మీడియా వర్గాల్లో తలెత్తుతున్నాయి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ బయోపిక్ ని సుమారు నూటా యాభై కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తారట. అంతేసి ఖర్చు పెట్టేంత ఏముంటుందో మరి. వచ్చే దాకా ఆగాల్సిందే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి