సీత, గీతలు బతికే ఉన్నారు..సినిమాను మించిపోయే ట్విస్టులు..

సీత, గీతలు బతికే ఉన్నారు..సినిమాను మించిపోయే ట్విస్టులు..

ఈ ఫోటోలో కనిపిస్తున్న అక్కా చెల్లెళ్లు 15 నెలల క్రితం కనిపించకుండా పోయారు.. తల్లిదండ్రులు కూడా వీరిపై హోప్స్ వదులుకున్నారు. కానీ సోదరుడు వదల్లేదు. చెల్లెళ్ల కోసం వెతికాడు. చివరకు ..

ఈ ఫోటోలో కనిపిస్తున్న అక్కా చెల్లెళ్లు 15 నెలల క్రితం కనిపించకుండా పోయారు.. తల్లిదండ్రులు కూడా వీరిపై హోప్స్ వదులుకున్నారు. కానీ సోదరుడు వదల్లేదు. చెల్లెళ్ల కోసం వెతికాడు. చివరకు ..

రియల్ లైఫ్ స్టోరీస్ సినిమా కథలుగా మారుతున్నాయో. మూవీలను చూసి జనాలు తెలివి మీరిపోతున్నారో తెలియదు కానీ.. కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆశ్యర్యం వేయక మానదు. అప్పుడెప్పుడో తప్పిపోయిన పిల్లలు, పెద్ద వాళ్లు అయ్యాక కలిసినట్లు..ప్రత్యేకమైన పరిస్థితుల్లో, ప్రత్యేకమైన సాంగ్స్‌తో గుర్తుపట్టినట్లు అనేక చిత్రాల్లో చూశాం. అచ్చు అలాంటి స్టోరీనే ఇప్పుడు మరోటి బయటకు వచ్చింది. ఎప్పుడో తప్పిపోయారు అక్కాచెల్లెళ్లు.. బతికే ఉంటారన్న ఆశలు కూడా కోల్పోయిన సమయంలో అనూహ్యంగా బయటకు వచ్చి మేం బతికే ఉన్నాం అని స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే అక్కా చెల్లెళ్లు ఇద్దరు పెళ్లిళ్లు చేసుకుని సెటిలై కనిపించడంతో కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు. కావాలనే ఇంట్లో నుండి పారిపోయి.. తమకు ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నారు.

సినిమాను మించిపోయిన ట్విస్టులున్న ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అక్కాచెల్లెళ్లైన సీత, గీతలు తమ కుటుంబంతో కలిసి ఢిల్లీలో నివసించేవారు. ఈ ఇద్దరు 2023 జనవరిలో తప్పిపోయారు. తన సోదరీమణులు కనిపించడం లేదని సోదరుడు అజయ్ ప్రజాపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు పెద్దగా పట్టించుకోకపోవడంతో చెల్లెళ్లు జాడ కోసం వెతకడం ప్రారంభించాడు. ఒకానొక క్రమంలో హత్యకు గురైనట్లు భావించారు కూడా కుటుంబ సభ్యులు. చనిపోయి ఉంటారని అనుమానించారు. ఈ క్రమంలోనే తన సోదరిలో ఒకరితో ఫ్రెండ్ షిప్ చేసిన జయనాథ్ మౌర్య అనే వ్యక్తిని సంప్రదించాడు అజయ్. తన చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారో చెప్పాలని అజయ్ జయనాథ్‌ను ప్రశ్నించాడు.

ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ‘నీ చెల్లెళ్లకు పట్టిన గతే నీకు పడుతుంది’ అని మౌర్య బెదిరించాడు. దీంతో జయనాథ్ మౌర్య పై హత్య కేసు నమోదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు అజయ్. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో మౌర్యపై పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. తనకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు అజయ్. కోర్టు ఆదేశాలతో గోరఖ్‌పూర్‌లోని బెల్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నాలుగు నెలల విచారణ తర్వాత.. సీత, గీతలు ఇద్దరు బతికే ఉన్నారని, ఇద్దరూ తమ తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో పారిపోయి పెళ్లి చేసుకున్నారని తేలింది. సీత హర్యానా నివాసి విజేందర్‌ను వివాహం చేసుకుంది.. ఆమెకు ఐదు నెలల కుమార్తె ఉంది. గీత కూడా ఉత్తరాఖండ్ నివాసి సురేష్ రామ్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి కూడా ఆరు నెలల కుమార్తె ఉందని తేలింది. ప్రియుల్ని పెళ్లాడేందుకు ఇంట్లో నుండి పారిపోయారు ఈ ఖతర్నాక్ సిస్టర్స్.

Show comments