భర్తకు మరో స్త్రీతో సంబంధం.. బిడ్డల కోసం పీఎస్‌ ఎదుట సీఐ భార్య నిరసన

భర్తకు మరో స్త్రీతో సంబంధం.. బిడ్డల కోసం పీఎస్‌ ఎదుట సీఐ భార్య నిరసన

పోలీసు అనగానే చేతులెత్తి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. అంతటి ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్న కొంత మంది పోలీసులు.. ఖాకీ దుస్తుల మాటున తప్పుడు పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా

పోలీసు అనగానే చేతులెత్తి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. అంతటి ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్న కొంత మంది పోలీసులు.. ఖాకీ దుస్తుల మాటున తప్పుడు పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా

శాంతి భద్రతలను పరిరక్షిస్తూ.. అహర్నిశలు సేవలందిస్తోంది పోలీస్ వ్యవస్థ. రాత్రుళ్లు ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే..అది పోలీసుల చలువే. తమ కుటుంబాన్ని కూడా వదిలేసి.. జనాల కోసం పనిచేస్తుంటారు. కానీ అందులో ఉన్న కొంత మంది అవినీతిపరులు, అహంకారులు, మోసగాళ్ల కారణంగా మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. నలుగురికి నీతి చెప్పాల్సిన పోలీసు ఉద్యోగంలో ఉండి.. తప్పుడు పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. న్యాయం చేయాల్సిన పోలీసే.. వక్రమార్గంలో నడుస్తూ అభాసుపాలు అవుతున్నాడు. తాజాగా ఓ ఎస్ఐపై ఆయన భార్య తీవ్ర ఆరోపణలు చేసింది. సిద్దిపేట జిల్లా కొముర వెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ఐ నాగరాజుపై భార్య తీవ్రమైన విమర్శలు చేస్తూ రోడ్డెక్కింది.

తన భర్త ఎస్ఐ నాగరాజు.. మరో మహిళతో కొన్నాళ్ల పాటు వివాహేతర సంబంధం నెరుపుతూ.. ఆమెను మనువాడి తనకు అన్యాయం చేశాడని వాపోతుంది. అంతేకాకుండా తన బిడ్డల్ని తన నుండి వేరుచేసి, బలవంతంగా తీసుకెళ్లిపోయాడని చెబుతుంది. తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపడుతుంది. బాధితురాలు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి..ఎస్ఐ నాగరాజుతో మానసకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. తొలుత వీరి సంసారం హాయిగానే సాగిపోయింది. అయితే ఇటీవల నాగరాజు.. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కరీంనగర్ తీసుకెళ్లి.. రెండేళ్ల నుండి తనకు విడాకులు ఇవ్వాలంటూ ఇబ్బందులకు గురి చేశాడంటూ పేర్కొంది.

ఇప్పుడు అక్రమ సంబంధం నెరుపుతున్న మహిళను వివాహం చేసుకుని, తన ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోయి తనకు కాకుండా చేశాడని వాపోతుంది. ఈ విషయంపై సిద్ది పేట సీపీ, చేర్యాల సీఐ, కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని, అతడిపై చర్యలేమీ తీసుకోలేదని చెబుతుంది. తన భర్త నాగరాజుకు ఫోన్ చేస్తే నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టాడని, బంధువులతో కలిసి కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌కు రాగా ఎస్ఐ ఆరు రోజులుగా సెలవులో ఉన్నాడని చెప్పినట్లు తెలిపింది. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తుంది. తనకు న్యాయం చేయాలని కోరుతుంది. కాగా, సీఐ శ్రీనివాస్ దీనిపై స్పందిస్తూ.. ఈ విషయాన్ని మానస తన దృష్టికి తెచ్చిందని, కౌన్సిలింగ్ ఇచ్చామని, ఉన్నత అధికారులు ఆదేశాలతో నాగరాజుపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు శ్రీనివాస్.

Show comments