టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ నుంచి ఇద్దరు ప్లేయర్లను పంపేస్తున్న టీమ్‌ మేనేజ్‌మెంట్‌!

టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ నుంచి ఇద్దరు ప్లేయర్లను పంపేస్తున్న టీమ్‌ మేనేజ్‌మెంట్‌!

Shubman Gill, Avesh Khan, t20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీ మధ్యలోనే ఇద్దరు భారత ఆటగాళ్లు భారత్‌కు తిరిగి రానున్నారు. వాళ్లిద్దరు ఎవరు? ఎందుకు వస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Shubman Gill, Avesh Khan, t20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీ మధ్యలోనే ఇద్దరు భారత ఆటగాళ్లు భారత్‌కు తిరిగి రానున్నారు. వాళ్లిద్దరు ఎవరు? ఎందుకు వస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా వరుస విజయాలతో సూపర్‌ 8కు క్వాలిఫై అయిపోయింది. గ్రూప్‌ స్టేజ్‌లో శనివారం కెనడాతో నామమాత్రపు మ్యాచ్‌ ఆడనుంది. ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, యూఎస్‌ఏలపై గెలిచి.. సూపర్‌ 8కు అర్హత సాధించిన రోహిత్‌ సేన.. ఇక తమ ఫోకస్‌ సూపర్‌ 8 మ్యాచ్‌లపై పెట్టనుంది. కెనడాతో మ్యాచ్‌ తర్వాత భారత జట్టు సూపర్‌ 8 మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్‌కు వెళ్లనుంది. ఈ టీ20 వరల్డ్‌ కప్‌కు అమెరికాతో పాటు వెస్టిండీస్‌ కూడా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. సూపర్‌ 8 మ్యాచ్‌లన్నీ అక్కడే జరగనున్నాయి.

అయితే.. సూపర్‌ 8 మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు ఇద్దరు భారత ఆటగాళ్లు టీమ్‌ను వీడి ఇండియాకు వచ్చేయనున్నారు. రేపు కెనడాతో మ్యాచ్‌ తర్వాత.. అమెరికా నుంచి వెస్టిండీస్‌కు వెళ్లకుండా భారత్‌కు తిరిగి వచ్చేయనున్నారు. అయితే.. ఆ ఇద్దరు 15 మంది స్క్వౌడ్‌లోని ప్లేయర్లు కాదు. ట్రావెలింగ్‌ స్టాండ్‌బైగా ఉన్న నలుగురు ప్లేయర్ల నుంచి ఇద్దరిని ఇంటికి పంపేందుకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది. 15 మంది తో కూడా స్క్వౌడ్‌ కాకుండా.. రింకూ సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌, శుబ్‌మన్‌ గిల్‌, ఖలీల్‌ అహ్మద్‌లను ట్రావెలింగ్‌ స్టాండ్‌బై ప్లేయర్లుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

తొలి మ్యాచ్‌ నుంచి ఈ నలుగురు ఆటగాళ్లు జట్టుతోనే ట్రావెల్‌ అవుతున్నారు. టీమ్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో కూడా పాల్గొంటున్నారు. కానీ, కెనడాతో మ్యాచ్‌ తర్వాత.. శుబ్‌మన్‌ గిల్‌, ఆవేశ్‌ ఖాన్‌లను భారత్‌కు పంపేయనుంది టీమ్‌ మేనేజ్‌మెంట్‌. ఇక టీమ్‌కు వీరి అవసరం లేదని, అందుకే వెస్టిండీస్‌కు కాకుండా ఇండియాకు పంపేయాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది. దీనికి బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. మరో ఇద్దరు స్టాండ్‌బై ప్లేయర్లు రింకూ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌ మాత్రం టీమ్‌తోనే ఉండనున్నారు. వాళ్లు ఇద్దరు టీమ్‌తో కలిసి వెస్టిండీస్‌కు వెళ్తారు. మరి గిల్‌, ఆవేశ్‌ ఖాన్‌ను ఎందుకు పంపుతున్నారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments