Shobha Shetty Remuneration: 14 వారాలకు శోభాశెట్టికి భారీ పారితోషకం! విన్నర్ కి ఏమాత్రం తీసిపోకుండా..

Shobha Shetty: 14 వారాలకు శోభాశెట్టికి భారీ పారితోషకం! విన్నర్ కి ఏమాత్రం తీసిపోకుండా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట సంగతి పక్కన పెడితే గొడవలు మాత్రం గట్టిగానే అవుతున్నాయి. అందరూ టైటిల్ కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట సంగతి పక్కన పెడితే గొడవలు మాత్రం గట్టిగానే అవుతున్నాయి. అందరూ టైటిల్ కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఆసక్తిగా సాగుతోంది. దాదాపు ముగింపు దశకు చేరుకున్న తర్వాత మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈ సీజన్ ఎవరు విన్నర్ అవుతారంటూ ఇప్పటి నుంచి అందరూ బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. మరోవైపు ఈ వీక్ ఎలిమినేషన్ గురించి కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యింది అంటూ లీకులు రానే వచ్చాయి. వాటిని బట్టి అందరూ శోభా హౌస్ నుంచి అవుట్ అయ్యిందని ఫిక్స్ కూడా అయ్యారు. అయితే ఈ వార్త కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం అంటూ చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శోభా రెమ్యూనరేషన్ కూడా హాట్ టాపిక్ గా మారింది.

శోభాశెట్టి హౌస్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. అలాగే గ్రూప్ ప్లేయర్, ఫేవరెటిజమ్, మోనిత అంటూ చాలానే పేర్లను కూడా సొంతం చేసుకుంది. అయితే టాస్కుల్లో మాత్రం తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అయితే అమర్, ప్రియాంకలతో క్లోజ్ గా ఉండటం, వారితోనే ఎక్కువ సమయం గడపడం, మిగిలిన వారిని కొంచం దూరం పెట్టడం అనేది ఈ సీజన్ లో శోభాకి కాస్త నెగిటివిటీని మూట గట్టిపెట్టాయి. అంతేకాకుండా కొన్నిసార్లు అర్థం లేకుండా చేసిన ఆర్గ్యూమెంట్లు కూడా ఆమెపై బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేశాయి. కానీ, శోభాశెట్టి స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టే ఇన్ని వారాలు హౌస్ లో నెగ్గుగు రాగలిగింది. మధ్యలో కొన్ని వారాలు చాలా కూల్ గా ఉంది. అదే యాటిట్యూడ్ ని కంటిన్యూ చేసుంటే ఆమె తప్పకుండా ఫినాలే వీక్ కి చేరుకునేది.

తన ఎలిమినేషన్ ని ముందే ఊహించిన శోభాశెట్టి.. శివాజీతో లెక్క సెటిల్ చేసుకోవాలిని ఫిక్స్ అయ్యింది. అన్నట్లుగానే సెటిల్ చేసుకుంది కూడా. అతని అసలు రంగుని బయటపెడతా అంటూ శపథం చేసింది. అయితే శోభా దెబ్బకు శివాజీ పలుసార్లు నోరుజారడం మనం చూశాం. అలా నోరు జారినందుకు హోస్ట్ నాగార్జున క్లాస్ కూడా పీకారు. తప్పు మాట్లాడాను అంటూ శివాజీ క్షమాపణ కూడా చెప్పాడు. అయితే శోభాకి కొన్ని నెగిటివ్ అయిన అంశాలు.. ప్రియాంకను బ్యాడ్ చేయాలని చూడటం, అమర్ తో గొడవకు దిగడం. అమర్ నామినేషన్స్ లో లేని వీక్ లో.. పని కట్టుకుని ప్రియాంకని బ్యాడ్ చేయాలని చూసినట్లు అనిపించింది. అమర్ ఫ్యాన్స్ ఓట్ల కోసం ప్రియాంక, అమర్ మధ్య పుల్లు పెట్టింది అంటూ చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. అలాగే తాజాగా కూడా అమర్ తో గొడవకు దిగడంపై చాలామంది నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. శోభాశెట్టి ప్రవర్తన అస్సలు నచ్చలేదు అంటూ కామెంట్స్ చేశారు.

ఇంక శోభా రెమ్యూనరేషన్ గురించి మాత్రం బాగానే చర్చ జరుగుతోంది. అయితే శోభా ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయింది అంటున్నారు కాబట్టి.. ఒకవేళ నిజంగానే 14వ వారం హౌస్ నుంచి గనుక శోభా శెట్టి బయటకు వచ్చేస్తే ఆమెకు గట్టిగానే పారితోషకం ముడుతుందని టాక్ నడుస్తోంది. ఈ సీజన్ లో శోభాకి వారానికి రూ.2.5 లక్షల చొప్పు పారితోషకం అందిస్తున్నారని టాక్ ఉంది. అంటే ఈ వీక్ బయటకు వచ్చేస్తే.. మొత్తం 14 వారాలకు గాను.. ఆమెకు రూ.35 లక్షల వరకు అందుతుంది. అంటే ప్రైజ్ మనీకి చాలా దగ్గరగా ఉన్నట్లు అనమాట. ఎలిమినేట్ అయి బయటకు వచ్చినా కూడా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం చింతించాల్సిన అవసరం లేదు. మరి.. శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యిందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments