టీ20 వరల్డ్‌ కప్‌ ఆడుతున్నట్లు లేదు! తన ఆవేదన బయటపెట్టిన దూబే!

టీ20 వరల్డ్‌ కప్‌ ఆడుతున్నట్లు లేదు! తన ఆవేదన బయటపెట్టిన దూబే!

Shivam Dube, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ ఆడుతుంటే.. తనకు రంజీ ట్రోఫీ ఆడిన ఫీలింగ్‌ వస్తుందంటూ.. శివమ్‌ దూబే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి అతను అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..

Shivam Dube, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ ఆడుతుంటే.. తనకు రంజీ ట్రోఫీ ఆడిన ఫీలింగ్‌ వస్తుందంటూ.. శివమ్‌ దూబే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి అతను అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున దుమ్ములేపిన శివమ్‌ దూబే.. టీ20 వరల్డ్‌ కప్‌లో మాత్రం అంచనాలకు తగ్గట్లు ఆడలేకపోతున్నాడు. అతనిపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌, భారత క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. కానీ, వాటిని అందుకోవడంలో మనోడు విఫలం అవుతున్నాడు. ఐర్లాండ్‌, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో దారుణంగా ఫెయిల్‌ అయిన దూబే.. యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం 31 పరుగులు చేసి పర్వాలేదనిపంచాడు. అగ్రెసివ్‌ బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిన దూబే.. టీ20 వరల్డ్‌ కప్‌లో మాత్రం అంతగా ప్రభావం చూపడం లేదు.

దీంతో అతన్ని టీమ్ నుంచి తప్పించి, సంజు శాంసన్‌ లేదా యశస్వి జైస్వాల్‌ను తీసుకోవాలనే డిమాండ్ కూడా వ్యక్తం అయింది. పైగా తొలి రెండు మ్యాచ్‌ల్లో అతనికి బౌలింగ్‌ కూడా ఇవ్వలేదు. బౌలింగ్‌ చేయకుండా ఆల్‌రౌండర్‌గా అతను టీమ్‌లో ఎందుకంటూ.. క్రికెట్‌ అభిమానులు కూడా విమర్శించారు. ఇన్ని విమర్శలు, బ్యాడ్‌ ఫామ్‌ మధ్య దూబే తన ఆవేదనను వెల్లగక్కాడు. టీ20 వరల్డ్‌ కప్‌ ఆడుతున్నట్లు లేదని, రంజీ ట్రోఫీ ఆడుతున్న ఫీలింగ్‌ వస్తుందంటూ దూబే పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడినట్లు ఇక్కడ ఆడేందుకు అవకాశం లేదని పరోక్షంగా పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా లేవని చెప్పకనే చెప్పాడు.

దూబే ఫామ్‌ సంగతి ఎలా ఉన్నా.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో మాత్రం టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో గెలిచి.. ఇప్పటికే సూపర్‌ 8కు క్వాలిఫై అయిపోయింది. ఇక కెనడా నామమాత్రపు మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది. సూపర్‌ 8లో మూడు మ్యాచ్‌లు ఆడనుంది రోహిత్‌ సేన. సూపర్‌ 8లో ఆస్ట్రేలియాతో ఇప్పటికే మ్యాచ్‌ డిసైడ్‌ అయిపోయింది. అలాగే ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో టీమిండియా మ్యాచ్‌లు ఆడనుంది. జూన్‌ 20, 22, 24న సూపర్‌ 8 మ్యాచ్‌లు ఉన్నాయి. మరి టీ20 వరల్డ్‌ కప్ ఆడుతుంటే.. రంజీ ఆడినట్లు ఉందని దూబే చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments