iDreamPost

‘శ్రీకారం’ సైలెన్స్ కి కారణం

‘శ్రీకారం’  సైలెన్స్ కి కారణం

మొన్నటి దాకా ప్రామిసింగ్ హీరోగా ఉన్న శర్వానంద్ మార్కెట్ ఇప్పుడు డౌన్ అయిన మాట వాస్తవం. వరసగా మూడు డిజాస్టర్లు బాగా దెబ్బ తీశాయి. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను ఒకదాన్ని మించి మరొకటి కాస్ట్ ఫెయిల్యూర్ తో పాటు ఆడియన్స్ పరంగానూ నెగటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో దాని ప్రభావం ఎంతలేదన్నా రాబోయే శ్రీకారం మీద పడింది. ఆశించిన స్థాయిలో బిజినెస్ ఆఫర్స్ రావడం లేదని ఇన్ సైడ్ టాక్. బజ్ కోసం శర్వా పాత్రను పరిచయం చేస్తూ ఓ చిన్న వీడియో రిలీజ్ చేశారు కానీ దానికి స్పందన మరీ భారీగా లేదు.

మరోవైపు ముందు అనుకున్న ఏప్రిల్ 24 శ్రీకారం వచ్చే అవకాశం దాదాపు లేనట్టేనని ఫిలిం నగర్ టాక్. శర్వానంద్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని విదేశాలకు వెళ్లడంతో అనుకున్న షెడ్యూల్స్ కొన్ని డిస్టర్బ్ అవుతున్నాయట. అందుకే జాప్యం తప్పదని తెలుస్తోంది. యూనిట్ అయితే అధికారికంగా వాయిదా గురించి ఏ మాటా చెప్పడం లేదు. రైతు సమస్యలను ఆధారంగా చేసుకుని డెబ్యూ డైరెక్టర్ కిషోర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ మూవీ వేసవిలో తప్ప ముందే వచ్చే అవకాశం లేదట. ఉపాధి కోసం గ్రామం నుంచి వలస వెళ్లిపోతున్నా యువతను ఆపి వాళ్లను చైతన్యపరిచే పాత్రలో శర్వానంద్ డిఫరెంట్ రోల్ చేశాడని ఇన్ సైడ్ టాక్.

అసలే ఫార్మర్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు ఈ మధ్య బాగానే వర్క్ అవుట్ అవుతోంది. మహర్షి, భీష్మ రెండూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇదే స్వింగ్ లో శ్రీకారం కూడా వచ్చేస్తే బాగుండేదేమో. 14 రీల్స్ బ్యానర్ పై నిర్మాణమైన శ్రీకారం మీదే శర్వా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఏప్రిల్, మే నెలల్లో క్రేజీ సినిమాలు వరసగా డేట్లు బ్లాక్ చేసుకున్నాయి. ఇంత పోటీలో దించడం కన్నా కాస్త స్లో అయినా మంచి సీజన్ చూసుకుని వద్దామని శ్రీకారం టీమ్ ఆలోచనగా కనిపిస్తోంది. మొత్తానికి శర్వానంద్ కు మూడు డిజాస్టర్ల ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ముఖ్యంగా జాను అందరి ఆశలను నీరుగార్చిన తీరు నిర్మాత దిల్ రాజుకు ఇప్పటికీ అర్థం కావడం లేదట. అంత మోజు పడి తీసుకున్న సినిమా కదా. మరి 14 రీల్స్ కు శ్రీకారం విజయాల బోణీ కొట్టిస్తుందో లేదో వేచి చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి