తనపై విమర్శలు చేసిన సెహ్వాగ్‌కు కౌంటరిచ్చిన షకీబ్‌! అంత మాట అనేశాడేంటి?

తనపై విమర్శలు చేసిన సెహ్వాగ్‌కు కౌంటరిచ్చిన షకీబ్‌! అంత మాట అనేశాడేంటి?

Shakib Al Hasan, Virender Sehwag, T20 World Cup 2024: బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌.. టీమిండియా మాజీ క్రికెటర్‌కు కౌంటర్‌ ఇచ్చాడు. సెహ్వాగ్‌ చేసిన విమర్శలే అందుకు కారణం. ఇంతకీ వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Shakib Al Hasan, Virender Sehwag, T20 World Cup 2024: బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌.. టీమిండియా మాజీ క్రికెటర్‌కు కౌంటర్‌ ఇచ్చాడు. సెహ్వాగ్‌ చేసిన విమర్శలే అందుకు కారణం. ఇంతకీ వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌కు బంగ్లాదేశ్‌ స్టార్‌ ప్లేయర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ కౌంటర్‌ ఇచ్చాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో తొలి రెండు మ్యాచ్‌ల్లో షకీబ్‌ దారుణంగా విఫలం అయ్యాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో 8 పరుగులు, తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. ఈ రెండు ప్రదర్శనల తర్వాత.. సెహ్వాగ్‌, షకీబ్‌పై విమర్శలు చేశాడు. బంగ్లాదేశ్‌ జట్టులో ఒక సీనియర్‌ ప్లేయర్‌గా ఉన్న అతను అలా ఆడటం లేదని, అయినా షకీబ్‌ తనను తాను ఆస్ట్రేలియా క్రికెటర్‌ను అనుకుంటున్నాడా? మ్యాథ్యూ హేడెన్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌లా షార్ట్‌ బాల్‌కు పుల్‌ షాట్‌ ఆడాలని ప్రయత్నిస్తున్నాడు.. అతను ఒక సాధారణ బంగ్లాదేశ్‌ ప్లేయర్‌ అనే విషయం గుర్తుపెట్టుకోవాలంటూ తీవ్రంగా విమర్శించాడు సెహ్వాగ్‌.

ఒక టీవి ఛానెల్‌లో బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా మ్యాచ్‌ విశ్లేషణలో పాల్గొన్న సెహ్వాగ్‌ మాట్లాడుతూ..‘షకీబ్‌ అల్‌ హసన్‌ చాలా సీనియర్‌ ఆటగాడు, ఇంతకు ముందు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కానీ, అతని స్టాట్స్‌ అందుకు తగ్గట్లు లేవు. న్యూయార్క్‌లో సౌతాఫ్రికాపై బంగ్లాదేశ్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విషయంలో షకీబ్‌ సిగ్గుపడాలి. టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాలి. ఒక సీనియర్‌ ప్లేయర్‌గా అతన్ని టీమ్‌లోకి తీసుకుంటే.. అతను తన అనుభవాన్ని చూపించడం లేదు. ట్రిక్కి వికెట్‌పై తన ఎక్స్‌పీరియన్స్‌ను ఉపయోగించి కొంత సమయం గడపాల్సింది. అయినా.. అతనేమైనా మాథ్యూ హేడెన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ అనుకుంటున్నాడా.. షార్ట్‌ బాల్‌ను పుల్‌షాట్‌ ఆడుతున్నాడు. అతను కేవలం బంగ్లాదేశ్ ఆటగాడు. తన స్టాండెడ్స్‌కు తగ్గట్లు ఆడాలి. పుల్‌ షాట్‌ ఆడలేనప్పుడు మీకు తెలిసిన షాట్‌ ఆడాలి’ అని సెహ్వాగ్‌ అన్నాడు.

అయితే.. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లో 9 ఫోర్లతో 64 పరుగులు చేసి.. మ్యాచ్‌ గెలిపించిన తర్వాత షకీబ్‌ అల్‌ హసన్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సమయంలో ఓ జర్నలిస్ట్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ మీ గురించి ఇలా అన్నారు, దీనిపై మీరు ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా.. ఎవరు అన్నారు? అంటూ సెహ్వాగ్‌ ఎవరో తనకు తెలియదన్నట్లు షకీబ్‌ కౌంటర్‌ ఇ‍చ్చాడు. అయినా.. తన ఆట గురించి ఎవరికి, ఏం చెప్పాల్సిన అవసరం లేదంటూ షకీబ్‌ పేర్కొన్నాడు. మరి సెహ్వాగ్‌ వర్సెస్‌ షకీబ్‌ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments