iDreamPost

సాయాజి షిండే హెల్త్ అప్డేట్.. వైద్యులు ఎమన్నారంటే?

  • Published Apr 13, 2024 | 10:11 PMUpdated Apr 13, 2024 | 10:11 PM

Sayaji Shinde Health Update: ప్రముఖ నటుడు సాయాజి షిండే నిన్న తీవ్ర ఛాతినోప్పితో బాధపడుతూ మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.

Sayaji Shinde Health Update: ప్రముఖ నటుడు సాయాజి షిండే నిన్న తీవ్ర ఛాతినోప్పితో బాధపడుతూ మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.

  • Published Apr 13, 2024 | 10:11 PMUpdated Apr 13, 2024 | 10:11 PM
సాయాజి షిండే హెల్త్ అప్డేట్.. వైద్యులు ఎమన్నారంటే?

సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు సాయాజీ షిండే గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎన్నో చిత్రాల్లో తన విలక్షణ నటనతో మెప్పించారు. సాయాజీ షిండే కు ఏప్రిల్ 12న ఛాతి లో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మహారాష్ట్రలోని సతారాలో ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన అస్వస్థతకు గురయ్యారని.. డాక్టర్ సోమనాథ్ తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఆంజియోప్లాస్టీ చేశామని అన్నారు. సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  తాజాగా ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లు అప్ డేట్ ఇచ్చారు.  పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో సాయాజి షిండే  విలన్ , కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  ఇటీవల సాయాజి షిండే గుండెలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించగా ఆంజియోప్లాస్టీ చేయాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఆయన ఏప్రిల్ 12 న ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సతారాలో హాస్పిటల్ లో చేర్పించారు. వైద్యులు ఆయనకు ఆంజియోప్లాస్టీ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు సాయాజి షిండే ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా సాయాజి షిండే ఇన్ స్ట్రాలో ఒక పోస్ట్ చేశారు. ‘అందరికీ నమస్కారం.. నేను బాగున్నాను. నన్ను ప్రేమించే నా శ్రేయోభిలాషులు నాపై చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు. మీ అందరూ నాతోనే ఉన్నారు. ఆ ధైర్యం నాకు ఉంది. చింతించాల్సిన పని లేదు.. త్వరలోనే నేను మీ అందరి ముందుకు వస్తాను.’ అని రాసుకొచ్చారు. సాయాజి షిండే తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, బోజ్ పూరి తో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు లో గుడుంబా శంకర్, ఆంధ్రుడు, అతడు, పోకిరి, ఆట, లక్ష్మీ, దుబాయ్ శీను, దూకుడు, బిజినెస్ మాన్ ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Sayaji Shinde (@sayaji_shinde)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి