Sarkaru Naukri Movie Review: సర్కారు నౌకరి సినిమా రివ్యూ!

Sarkaru Naukri Review in Telugu: సర్కారు నౌకరి సినిమా రివ్యూ!

Sarkaru Naukri Movie Review & Rating in Telugu: ప్రముఖ సింగర్‌ సునీత కుమారుడు ఆకాష్‌ గోపరాజు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు నౌకరి’ మూవీ జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Sarkaru Naukri Movie Review & Rating in Telugu: ప్రముఖ సింగర్‌ సునీత కుమారుడు ఆకాష్‌ గోపరాజు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు నౌకరి’ మూవీ జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సర్కారు నౌకరి మూవీ రివ్యూ!

20240101, U/A
ఫ్యామిలీ డ్రామా
  • నటినటులు:ఆకాశ్‌ గోపరాజు, భావన, తనికెళ్ల భరణి, మధులత, మహదేవ్‌, సాయి శ్రీనివాస్‌ తదితరులు
  • దర్శకత్వం:గంగనమోని శేఖర్‌
  • నిర్మాత:కే. రాఘవేంద్రరావు
  • సంగీతం:శాండిల్య బొబ్బలి, సురేష్‌ బొబ్బిలి( బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌)
  • సినిమాటోగ్రఫీ:గంగనమోని శేఖర్‌

2.25

సినిమా సెలెబ్రిటీల పిల్లలు పెద్దల వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లోకి రావటం పరిపాటి. సాధారణంగా హీరోలు, హీరోయిన్లు, దర్శకుల పిల్లలు ఇండస్ట్రీలో హీరోలుగా మారుతూ ఉంటారు. సింగర్ల పిల్లలు సినిమాల్లోకి హీరోలుగా ఎంట్రీ ఇవ్వటం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తాజాగా, ప్రముఖ టాలీవుడ్‌ సింగర్‌ సునీత కుమారుడు ఆకాశ్‌ గోపరాజు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు. ‘‘ సర్కారు నౌకరి’’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1990ల నాటి కథను ఎంచుకుని మొదటి సినిమాతోనే ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మరి, సునీత కుమారుడి ప్రయోగం ఫలించిందా? ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? లేదా?

కథ :

గోపాల్‌ ( ఆకాశ్‌ గోపరాజు) కష్టపడి చదివి గవర్నమెంట్‌ ఉద్యోగం సంపాదిస్తాడు. గోపాల్‌ది గవర్నమెంట్‌ ఉద్యోగం కావటంతో సత్య ( భావన) అతడ్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత అతడికి ప్రమోషన్‌ వస్తుంది. ప్రమోషన్‌ మీద మహబూబ్‌ నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ గ్రామానికి వెళ్తాడు. గవర్నమెంట్‌ ఉద్యోగస్తుడు కావటంతో గ్రామస్తులు అతడ్ని గౌవరిస్తూ ఉంటారు. సినిమా మొత్తం 1996 కాలంలో సాగుతుంది. అప్పట్లో ఎయిడ్స్‌ ప్రభలంగా ఉండేది. దీంతో పై అధికారులు గోపాల్‌కు కండోమ్స్‌ పంచే పనిని అప్పగిస్తారు. రోజులు గడిచే కొద్ది జనాలకు గోపాల్‌ మీద ఉన్న గౌరవం పోతుంది. అందరూ అతడ్ని బుగ్గలోడు అని పిలవటం మొదలుపెడతారు.

ఊరినుంచి వెలేయడానికి కూడా చూస్తారు. దీంతో భార్య చాలా బాధపడుతుంది. ఉద్యోగం మానేసి వేరే ఊరికి వెళ్లి పోదామని అంటుంది. గోపాల్‌ మాత్రం ఉద్యోగం మానేయనని తెగేసి చెప్తాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ గొడవ అవుతుంది. ఆమె పుట్టింటికి వెళ్లిపోతుంది. తర్వాత ఊర్లో ఎయిడ్స్‌ బాగా పెరుగుతుంది. జనాలు చనిపోతూ ఉంటారు. ఊర్లో ఎయిడ్స్‌ గురించి అవగాహన కల్పించడానికి గోపాల్‌ ఏం చేశాడు? కొల్లాపూర్‌కు అతడికి ఉన్న సంబంధం ఏంటి అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ :

ప్రస్తుతం మాస్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఈ కథం కొంచెం అన్నిటికి భిన్నంగా అనిపిస్తుంది. కథ మొత్తం 1996 నాటి పరిస్థితులకు అద్దం పడుతుంది. ఎయిడ్స్‌ ప్రభలంగా ఉన్న ఆ రోజుల్లో ప్రజలు ఎంత అవగాహనా లోపంతో ఉన్నారో కళ్లకు కడుతుంది. అయితే, ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పటికి ఇప్పటికి కాలం చాలా మారింది. ప్రజల్లో ఎయిడ్స్‌ గురించి మంచి అవగాహన వచ్చింది. ఎయిడ్స్‌ చాలా వరకు తగ్గిపోయింది. ఈ పాయింట్‌ పెద్దగా కనెక్ట్‌ కాకపోయినా.. కొన్ని విషయాలు మాత్రం 90 కిడ్స్‌కు బాగా నచ్చుతాయి. బాల్యం గుర్తుకు వస్తుంది. కథను ఎంచుకోవటం, ఆ కథను ముందుకు తీసుకెళ్లటంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. ఓ మంచి సందేశాన్ని కామెడీతో పాటు భావోద్వేగాలతో చెప్పడంలో ఆయన ప్రయత్నం ఫలించింది. ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం కామెడీ సాగుతుంది. ఇంటర్‌వెల్‌కు ముందునుంచి ఎమోషనల్‌ పాయింట్స్‌ మొదలవుతాయి. ఎండింగ్‌ వరకు అవే భావోద్వేగాలు కొనసాగుతాయి. ముఖ్యంగా హీరో ప్లాష్‌ బ్యాక్‌ సీన్స్‌ అందర్నీ కంటతడి పెట్టిస్తుంది.

నటీనటుల పనితీరు :

సునీత కుమారుడు ఆకాశ్‌ గోపరాజుకు ఇది మొదటి సినిమానే అయినా.. చాలా చక్కగా నటించాడు. అతడు కూడా 90 కిడ్‌ కాబట్టి.. అప్పటి పరిస్థితులను అర్థం చేసుకుని నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో బాగా నటించాడు. ఇక, హీరోయిన్‌ భావన కూడా చాలా చక్కగా నటించింది. భర్త పరిస్థితితో ఇబ్బంది పడుతున్న భార్యగా.. ఎమోషనల్‌ సీన్స్‌ను బాగా పండించింది. ఇక, మిగిలిన పాత్ర దారులు కూడా తమ పరిధికి తగ్గట్టు నటించారు.

టెక్నీకల్ విభాగం :

కథ చాలా వరకు ఎమోషనల్‌ సీన్స్‌తో సాగుతుంది. కాబట్టి ఇలాంటి కథకు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నేపథ్య సంగీత దర్శకుడు సురేష్‌ బొబ్బిలి మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. శాండిల్య బొబ్బిలి ఇచ్చిన పాటలు కూడా బానే ఉన్నాయి. దర్శకుడు గంగనమోని శేఖరే కెమెరా బాధ్యతలు చేపట్టారు. తాను మెదడులో ఏమనుకున్నాడో దాన్ని తెరమీద చూపించాడు. అప్పటి పరిస్థితిలకు తగ్గట్టు కెమెరా పనితం చూపించాడు. ఎడిటర్‌ రాఘవేంద్ర వర్మ తక్కువ ఎక్కువ కాకుండా తన కత్తెరకు పని చెప్పాడు.

ప్లస్‌లు :

  • కథ
  • ఫస్ట్‌ హాఫ్‌ కామెడీ
  • ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌లు

  • స్క్రీన్‌ ప్లే సరిగా లేదు
  • ముగింపు

చివరిమాట : సర్కారు నౌకరి.. 90 కిడ్స్‌ను మెప్పించే సినిమా..

రేటింగ్‌ : 2.25/5

Show comments