iDreamPost

సరిలేరులో ‘అతడు’ ట్విస్ట్ ?

సరిలేరులో ‘అతడు’ ట్విస్ట్ ?

రేపు భారీ ఓపెనింగ్స్ కోసం సరిలేరు నీకెవ్వరు రంగం సిద్ధం చేసుకుంది. మిడ్ నైట్ షోలు వేసేందుకు చాలా చోట్ల ప్లానింగ్ జరుగుతోంది.

ఒకవేళ అనుమతి రాకపోతే ఖచ్చితంగా తెల్లవారుజామున 4 నుంచి 5 మధ్యలో షోలు పడే అవకాశం ఉంది. మొదటి రోజు 40 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని యూనిట్ ధీమాగా ఉందట. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన లీక్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

Read Also: జనవరి 10 – మాకొద్దంటున్న టాలీవుడ్

దాని ప్రకారం మిలిటరీ ఆఫీసర్ గా ఉన్న అజయ్ కృష్ణ(మహేష్ బాబు)టీంలో సత్యదేవ్ ఉంటాడు. దేశం కోసం జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు. అతని తరఫున ఒక క్లిష్టమైన బాధ్యతను తీసుకున్న అజయ్ అది నెరవేర్చడం కోసం సత్యదేవ్ పుట్టి పెరిగిన కర్నూల్ కు వస్తాడు. అక్కడే సత్య దేవ్ కుటుంబ పెద్ద అయిన విజయశాంతితో పరిచయం ఏర్పడుతుంది. మరి మధ్యలో ఫ్యాక్షన్ లీడర్ ప్రకాష్ రాజ్ ఎందుకోచ్చాడో తెలియాలంటే సినిమా చూడాలి

Read Also: ఎమోషనల్ ఫీలింగ్ తో తెలుగు “96 “

నిజంగా కథ ఈ కోణంలోనే వెళ్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. కాని ట్రైలర్ ను తీక్షణంగా డీ కోడింగ్ చేసిన కొందరు ఇదే మెయిన్ పాయింట్ గా ఇండస్ట్రీ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. కాని ఇలాంటి పాయింట్ తోనే గతంలో మహేష్ అతడు చేశాడు. రాజీవ్ కనకాల కోసం అతని స్వంత ఊరికి వచ్చిన మహేష్ అక్కడ సమస్యలను చక్కదిద్దడమే కాకుండా అందరికి చేరువవుతాడు. ఈ లెక్కన అతడులో సరిలేరు నీకెవ్వరులో ఈ పోలిక ఖచ్చితంగా వస్తుంది. ఇది వాస్తవమా కాదా అనేది రేపటికి తెలిసిపోతుంది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి