iDreamPost

సంక్రాంతి “సినీ” పుంజుల్లో ప్లస్సులు మైనస్సులు

సంక్రాంతి “సినీ” పుంజుల్లో ప్లస్సులు మైనస్సులు

ఇవాళ నుంచి సంక్రాంతి పోరు స్టార్ట్ అయిపోయింది. రజనీకాంత్ దర్బార్ కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి . అయితే టాక్ చాలా డివైడ్ గా ఉండటంతో రేస్ లో వెనుకబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . పేట తరహా ఫలితాన్ని ట్రేడ్ ఆశిస్తోంది. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి టాక్ పాజిటివ్ గా మారితే వసూళ్లు పెరుగుతాయి . దీని సంగతి అలా ఉంచితే తెలుగు స్ట్రెయిట్ సినిమాల యుద్ధం ఎల్లుండి నుంచి మొదలుకాబోతోంది. ఫ్యాన్స్ అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. టికెట్ రేట్ పెంపుకు పర్మిషన్లు రావడం, అదనపు షోలకు ఏర్పాట్లు పూర్తయిపోవడం చూస్తే రికార్డులు మామూలుగా బద్దలయ్యేలా లేవు. ఇక వీటిలో ఉన్న ప్లస్సులు మైనస్సులు మీద ఓ లుక్ వేద్దాం

సరిలేరు నీకెవ్వరు

దీనికున్న ప్రధాన ఆకర్షణ సూపర్ స్టార్ మహేష్ బాబే . వరుస సక్సెస్ లతో జోష్ మీద ఉన్న ప్రిన్స్ భరత్ అనే నేను , మహర్షి తర్వాత దీంతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. 13 ఏళ్ళ తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం నిన్నటి తరం ప్రేక్షకులు థ్రిల్లింగ్ గా ఫీలవుతున్నారు. ఆవిడ పాత్ర పవర్ ఫుల్ గా ఉన్నట్టు ట్రైలర్ లో కనిపించింది. కర్నూల్ కొండారెడ్డి బురుజు బ్యాక్ డ్రాప్, ప్రకాష్ రాజ్ విలనీ ఇవన్నీ అనుకూలాంశాలే. కామెడిని డీల్ చేయడంలో పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇందులో వినోదానికి లోటు లేదని ఇప్పటికే హామీ ఇచ్చాడు

ఇక మైనస్ లపై ఓ లుక్ వేస్తే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అంచనాలు అందుకోలేకపోయింది. ఆడియో వీక్ అనే టాక్ సోషల్ మీడియాలో విపరీతంగా ఉంది. మైండ్ బ్లాకు అనే ట్యూన్ తప్ప ఇంకేవి పెద్దగా క్యాచీగా లేవు . హీరోయిన్ రష్మిక మందన్న గ్లామర్ బ్యూటీ కాకపోవడం కొంత ప్రభావం చూపించే ఛాన్స్ లేకపోలేదు. ట్రైన్ ఎపిసోడ్ 45 నిమిషాల దాకా ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. ఇది ఏ మాత్రం బాలన్స్ తప్పినా బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. స్టొరీ సైతం రెగ్యులర్ ఫార్ములాలో ఉన్నా రిస్కే

అల వైకుంఠపురములో

ఏడాదిన్నర గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ ఎంచుకున్న కథ కావడంతో అభిమానులు చాలా ధీమాగా ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా కాబట్టి అంచనాలు దానికి తగ్గట్టే ఉన్నాయి. ఇప్పటికే తమన్ మ్యుజిక్ బ్లాక్ బస్టర్ కొట్టేసి ఎక్కడ చూసిన సామజవరగమనా అని పాడుకునేలా చేసింది. బుట్టబొమ్మ సాంగ్ లో పూజా హెగ్డే గ్లామర్ చూసి రసిక ప్రియులు ఫిదా ఐపోతున్నారు. నవదీప్, సుశాంత్, టబు, జయరాం, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ ఇలా క్యాస్టింగ్ కూడా చాలా రిచ్ గా ఉంది. త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ డైలాగ్స్ చాలా ఉన్నాయట

ఇక మైనస్ సంగతులు చూస్తే కథ పరంగా ఇందులో కొన్ని పాత సినిమాల పోలికలు ఉన్నాయన్న కామెంట్ అయితే ఉంది. దానికి తోడు ఆఫీస్ కామెడీతో అజ్ఞాతవాసిలో నిరాశ పరిచిన త్రివిక్రమ్ మరోసారి అలాంటి ట్రాక్ ఇందులో బన్నీ కోసం రాశాడు. ఇది రౌడీ అల్లుడు రేంజ్ లో ఉంటుందని యూనిట్ టాక్ కానీ ఆ యాంగిల్ లో పోలిక వస్తే మాత్రం కొంచెం రిస్క్. అరవ విలన్ సముతిరఖని ఎంత వరకు మెప్పించాడో చూడాలి

ఎంత మంచివాడవురా

పందెంలో ఆఖరున దిగుతున్న పుంజు ఇది. ఫామిలీ సినిమాల దర్శకుడు సతీష్ వేగ్నేశ దర్శకుడు కావడంతో ఆ కోణంలో అందరికి మెప్పించేలా ఉంటుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ట్రైలర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఆడియోలో రెండు పాటలు హిట్ అయ్యాయి. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాగా వస్తున్న ఈ మూవీ సర్ప్రైజ్ హిట్ అవుతుందని యూనిట్ నమ్మకం. జూనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి ప్రమోట్ చేయడం కలిసి వచ్చింది

దీని మైనస్సులు చూస్తే అంచనాలు పెద్దగా లేకపోవడం అందులో మొదటిది. కళ్యాణ్ రామ్ కు భారీ మార్కెట్ లేదు. హీరోయిన్ మెహ్రీన్ కోసం అదేపనిగా వచ్చే వాళ్ళు తక్కువే. ఇప్పటికే పై రెండు సినిమాలకు భారీగా థియేటర్లు లాక్ అయ్యుంటాయి కాబట్టి మంచివాడు ఎంతో కొంత సర్దుకోకతప్పదు. రీమేక్ మూవీ కాబట్టి రిజల్ట్ మీద అంత ఈజీగా ఒక కంక్లూజన్ కు రాలేం. శ్రీనివాస కళ్యాణం ఫలితం రిపీట్ కాకూడదని కోరుతున్నారు ఫ్యాన్స్.

మొత్తానికి బలాబలాల విషయంలో అన్ని సినిమాలు ఒకే స్థాయి కాకపోయినా సంక్రాంతి బరిలో ఉన్నాయి కాబట్టి మంచి వసూళ్లు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దర్బార్ ఫైనల్ స్టేటస్ ఇంకో రెండు రోజుల్లో తెలిసిపోతుంది, ఆపై తెలుగు హీరోల ట్రయాంగిల్ వార్ లో ఎవరు ఏ ప్లేస్ ని దక్కించుకుంటారో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి