iDreamPost

Sankranthi 1987 Releases : ఆసక్తి రేపే పండగ సీజన్ సినిమాల కబుర్లు – Nostalgia

Sankranthi 1987 Releases : ఆసక్తి రేపే పండగ సీజన్ సినిమాల కబుర్లు – Nostalgia

మాములుగా సంక్రాంతి పండగ సందడి జనవరి 10 తర్వాత మొదలనుకుంటాం కానీ న్యూ ఇయర్ డే నుంచి సినిమాలు క్యూ కట్టడం ఎప్పటి నుంచో చూస్తున్నదే. కానీ కొన్ని సీజన్ల ఫలితాలు ఆసక్తికరంగా ఉంటాయి. అందులో ఒకటి 1987. ఆ విశేషాలు చూద్దాం. ఆ సంవత్సరం జనవరిలో 1 నుంచి 14 లోపు మొత్తం పదకొండు సినిమాలు వచ్చాయి. అందులో సగానికి పైగా స్టార్ హీరోలవి ఉన్నాయి. రిజల్ట్స్ మాత్రం ట్విస్ట్ ఇచ్చేలా ఉంటాయి. అవేంటో చూద్దాం. ఒకటో తేదీన వచ్చిన నాగార్జున ‘అరణ్య కాండ’0 కనీస అంచనాలు అందుకోలేక ఫెయిల్ అయ్యింది. అదే రోజు రిలీజైన ‘డబ్బెవరికి చేదు’ ప్రశంసలు దక్కించుకోగా ‘మొనగాడు’ పెద్దగా ఆడలేదు. 8న వచ్చిన ‘పెళ్లి కానీ ఇల్లాలు’ ఫ్లాప్. 9న విడుదలైన చిరంజీవి ‘దొంగమొగుడు’ సూపర్ హిట్టు కొట్టి వసూళ్ల వర్షం కురిపించుకుంది.

అదే రోజు వచ్చిన ‘ఉదయం’కు విమర్శకుల మెప్పు దక్కింది. కొంత గ్యాప్ తర్వాత 14న బాలకృష్ణ ‘భార్గవరాముడు’ కమర్షియల్ గా సేఫ్ అవ్వగా నాగార్జున ‘మజ్ను’ టార్గెట్ మిస్ కాకుండా సక్సెస్ అయ్యింది. రికార్డులు రాలేదు కానీ నిర్మాత కం దర్శకులు దాసరి నారాయణరావు లాభ పడ్డారు. శోభన్ బాబు ‘పున్నమి చంద్రుడు’ మిశ్రమ స్పందన దక్కించుకుంది. అనూహ్యంగా అసలే అంచనాలు లేకుండా స్టార్ క్యాస్టింగ్ కనిపించకుండా ఏవిఎం సంస్థ నిర్మించిన ‘సంసారం ఒక చదరంగం’ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. దొంగ మొగుడు ఉధృతిలోనూ ఈ సినిమా శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. అదే రోజు రిలీజైన కృష్ణ ‘తండ్రి కొడుకుల ఛాలెంజ్’కు ఓపెనింగ్స్ ఘనంగా వచ్చాయి కానీ ఎక్కువ కాలం లాంగ్ రన్ లో నిలవలేక యావరేజ్ గా మిగిలింది.

పైన చెప్పినవాటిలో దొంగమొగుడు విజేతగా నిలవగా రెండో స్థానంలో సంసారం ఒక చదరంగం సూపర్ హిట్ అయ్యింది. కేవలం రెండు వారాల గ్యాప్ లో నాగార్జునకు ఒక డిజాస్టర్ ఒక సూపర్ హిట్ దక్కడం కెరీర్ లో మళ్ళీ రిపీట్ అవ్వలేదు. ఈ పోటీలో ఊహించని విధంగా కృష్ణ, శోభన్ బాబు, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు తర్వాతి స్థానాల్లో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. సీజన్ ఎప్పుడైనా కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. సంక్రాంతి పండగకు ఎన్ని సినిమాలు వచ్చినా ఇంత స్పేస్ ఉండటం అనేది కొత్తగా వచ్చింది కాదు. అందుకే ఒకరిమీద ఒకరు ఎంత పోటీ ఉన్నా బరిలో దిగేందుకే ఇష్టపడతారు

Also Read : Vajram : అక్కడ మెరిసిన వజ్రం ఇక్కడ కరిగింది – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి