iDreamPost

తెలంగాణలో మరో బాలిక మిస్సింగ్.. గాలిస్తున్న పోలీసులు!

గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో వరుసగా బాలికలు అదృశ్యమవుతున్నారు. అయితే ఈ ఘటనలు మరువకముందే తాజాగా మరో బాలిక మిస్సైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో వరుసగా బాలికలు అదృశ్యమవుతున్నారు. అయితే ఈ ఘటనలు మరువకముందే తాజాగా మరో బాలిక మిస్సైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తెలంగాణలో మరో బాలిక మిస్సింగ్.. గాలిస్తున్న పోలీసులు!

హైదరాబాద్ లో గత ఐదు రోజుల కిందట ఓ బాలిక అదశ్యం అయింది. ఆమె కుటుంబ సభ్యులు అప్రమత్తమై అంతటా వెతికారు. ఇక ఆచూకి దొరకకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు బాలిక ఆచూకిని కనిపెట్టారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఆమె తండ్రికి అప్పగించారు. దీంతో ఆ బాలిక తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ఘటన మరువక ముందే తాజాగా తెలంగాణలో మరో బాలిక అదృశ్యం అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ బాలిక ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన అల్లిగొండ సంజన (9) అనే బాలిక బాల సదనగరంలో ఉంటుంది. ఈ బాలిక ఈ నెల 17న ఉన్నట్టుండి కనిపించకుండాపోయింది. బాల సదనగరం నిర్వహకులు అప్రమత్తమై స్థానిక ప్రాంతాల్లో గాలించారు. కానీ, ఆ అమ్మాయి ఆచూకి మాత్రం కనిపించలేదు. ఇక చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ అమ్మాయి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇకపోతే, మరో విషయం ఏంటంటే? ఇటీవల కాలంలో ఆ బాలిక అదృశ్యం అయింది. దీంతో సిబ్బంది వెతికి మళ్లీ బాల సదానగరంకు తీసుకొచ్చారు. కాగా, మరోసారి ఆ బాలిక ఉన్నట్టుండి కనిపించకుండాపోవడంతో నిర్వాహకులు షాక్ కు గురయ్యారు. ఉన్నట్టుండి ఆ బాలిక మరోసారి కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే, ఎవరికైన ఈ బాలిక ఆచూకి దొరికితే.. 08455-276333, 8712656718 అనే నెంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని పట్టణ సీఐ కోరారు.