Sandeep Kishan On Regina Casandra And Love: నా లవ్ సీక్రెట్‌గా ఉంచా! రెజీనా విషయంలో సందీప్ కిషన్ క్లారిటీ!

Sandeep Kishan: నా లవ్ సీక్రెట్‌గా ఉంచా! రెజీనా విషయంలో సందీప్ కిషన్ క్లారిటీ!

యంగ్ హీరోల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్నవారిలో సందీప్ కిషన్ ఒకరు. ఫీమేల్ ఆడియెన్స్​లోనూ ఆయనకు ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఈ హ్యాండ్సమ్ హంక్.. తన లవ్ లైఫ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు.

యంగ్ హీరోల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్నవారిలో సందీప్ కిషన్ ఒకరు. ఫీమేల్ ఆడియెన్స్​లోనూ ఆయనకు ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఈ హ్యాండ్సమ్ హంక్.. తన లవ్ లైఫ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు.

టాలీవుడ్​లో ఉన్న యంగ్ ప్రామిసింగ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. సినిమాలో తన పాత్ర కంటే స్టోరీ, స్క్రీన్​ ప్లే ఎలా ఉన్నాయి? లాంటి విషయాలకు ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే సందీప్ కిషన్ నటించే సినిమాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అలాంటి ఆయన మరో కొత్త చిత్రంతో ఆడియెన్స్​ను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. అదే ‘ఊరి పేరు భైరవకోన’. ఫిల్మ్ ప్రమోషన్స్​ చేయడంలో ఆరితేరిన సందీప్.. కొత్త చిత్రాన్ని కూడా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పాపులరైన కుమారి ఆంటీని కూడా కలిశారు. అలాగే పలు ఛానల్స్​కు, వెబ్​సైట్స్​కు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్​లో జోరు పెంచారు. అయితే ఓ ఇంటర్వ్యూలో ఆయన తన బ్రేకప్ బాధను పంచుకున్నారు. అలాగే హీరోయిన్ రెజీనా కాసాండ్రా విషయం మీదా క్లారిటీ ఇచ్చారు.

జీవితంలో ఇప్పటిదాకా ముగ్గురు అమ్మాయిలను సిన్సియర్​గా ప్రేమించానని చెప్పారు సందీప్ కిషన్. కానీ ఏ ఒక్క రిలేషన్ కూడా వర్కవుట్ కాలేదన్నారు. ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తే అవి అంత ప్రాముఖ్యం కావనిపిస్తోందని తెలిపారు. ‘నా లైఫ్​లో ఇప్పటివరకు ముగ్గురు అమ్మాయిలను లవ్ చేశా. ఎంతో సీరియస్​గా వాళ్లను ప్రేమించా. వారిలో ఒకరితో నాలుగేళ్ల పాటు రిలేషన్​లో ఉన్నా. కానీ ఏది కూడా వర్కవుట్ కాలేదు. ఈ రోజు నేను ఉన్న పొజిషన్​లో ఒక్కసారి వాటి గురించి ఆలోచిస్తే.. అవేవీ నా జీవితంలో అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తోంది. అయితే నేను లవ్ చేసిన ముగ్గురూ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినవారే. ఏళ్ల తరబడి ప్రేమించినా వారెవరు అనేది నేను బయటకు రానివ్వలేదు. మా ప్రేమ వ్యవహారాన్ని అంత రహస్యంగా ఉంచా’ అని సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు.

హీరోయిన్ రెజీనాతో సందీప్ కిషన్ లవ్​లో ఉన్నట్లు చాన్నాళ్లుగా పుకార్లు వస్తున్నాయి. ఈ విషయం మీదా యంగ్ హీరో రియాక్ట్ అయ్యారు. తనకూ ఆమెకు మధ్య అలాంటిదేదీ లేదన్నారు. ‘నేను రెజీనాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తుంటాయి. కానీ తనకు, నాకు మధ్య ఎలాంటి లవ్ ట్రాక్ లేదు. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. కాలేజీలో చదువుకునే రోజుల నుంచి తను నాకు బెస్ట్ ఫ్రెండ్. నా బ్రేకప్స్, ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు, గెలుపోటములు.. ఇలా అన్నీ రెజీనా చూసింది. తనకు నాకు మధ్య ఏమీ లేదు’ అని సందీప్ స్పష్టం చేశారు. పెళ్లి విషయం మీదా ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ మధ్యే వివాహ బంధాన్ని నమ్మడం ప్రారంభించానన్నారు. అదే టైమ్​లో బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. ఒక వ్యక్తితో లైఫ్ షేర్ చేసుకోవడం అంటే చాలా ఆలోచించాలని.. ఇంట్లో ఎవరూ పెళ్లి చేసుకోమని పోరు పెట్టడం లేదని సందీప్ పేర్కొన్నారు. మ్యారేజ్​కు ఇంకా టైమ్ ఉందన్నారు. మరి.. సందీప్ కిషన్ బ్రేకప్ స్టోరీస్ విన్నాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: తెలుగులో రజినీకాంత్‌ కు అవమానం! పరువు తీసిన కూతురు!

Show comments