గెలాక్సీ వాచ్ అల్ట్రా.. ఇదొక అద్భుతం.. క్రేజీ ఫీచర్లు

గెలాక్సీ వాచ్ అల్ట్రా.. ఇదొక అద్భుతం.. క్రేజీ ఫీచర్లు

స్మార్ట్ వాచ్ లు ప్రస్తుతం ట్రెండీగా మారాయి. ప్రతి ఒక్కరు స్మార్ట్ వాచ్ లను వాడుతున్నారు. యూజర్ల కోసం మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. అదే గెలాక్సీ వాచ్ అల్ట్రా .

స్మార్ట్ వాచ్ లు ప్రస్తుతం ట్రెండీగా మారాయి. ప్రతి ఒక్కరు స్మార్ట్ వాచ్ లను వాడుతున్నారు. యూజర్ల కోసం మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. అదే గెలాక్సీ వాచ్ అల్ట్రా .

టెక్ దిగ్గజాలలో ఒకటైన సాంసంగ్ తన కొత్త ప్రొడక్ట్స్ ను ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తూనే ఉంటుంది. అదే తరుణంలో ఇప్పుడు సాంసంగ్ యొక్క గెలాక్సీ వాచ్ అల్ట్రా ని అలాగే దాని ఉన్నత తత్వాన్ని రీసెంట్ గా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో సపోర్ట్ పేజీ లోకి డిస్ప్లే చేసింది. ఈ గెలాక్సీ వాచ్ ఎఫ్.ఇ తో పాటు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ పొంది ఉంది అని అంటున్నారు. ఈ లిస్టింగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా యొక్క స్మార్ట్నెస్ ని మాత్రమే కాకుండా, మోడల్ నంబరును కూడా అందిస్తుంది.

సపోర్ట్ పేజీ ద్వారా నిర్ధారణ:

సాంసంగ్ యొక్క లాటిన్ అమెరికన్ వెబ్‌సైట్‌లో సపోర్ట్ పేజీలో SM-L705F మోడల్ నంబర్ కలిగిన ఈ వాచ్ గురించి వెల్లడించారు. 91మొబైల్స్ నివేదిక ప్రకారం, ఈ మోడల్ నంబర్ గెలాక్సీ వాచ్ అల్ట్రాతో రిలేట్ అయ్యి ఉండవచ్చు. BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో పలు గెలాక్సీ వాచ్ 7 సిరీస్ మోడల్స్ చూడబడిన తర్వాత ఈ వాచ్ కనుగొనడం జరిగింది. వాటిలో SM-L300, SM-L305F, SM-L310, SM-L315F, SM-L705F, మరియు SM-R861 మోడల్ నంబర్లు ఉన్నాయి.

వాచ్ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు:

సాంసంగ్ యొక్క గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ వాచ్ అల్ట్రా లాంచ్ కావడానికి ఆశాజనకంగా ఉంది, ఇది జులైలో జరగవచ్చని టెక్ లవర్స్ అనుకుంటున్నారు. ఈ స్మార్ట్‌వాచ్ ఒకే 47mm వేరియంట్ లో Wi-Fi మరియు సెల్యులర్ సామర్థ్యాలతో అందించబడుతుందని అంచనా. ఇది ఒక పెంటా-కోర్ CPU ని 3nm ప్రాసెస్ లో నిర్మించబడిన, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, టైటానియం బాడీ, డ్యూయల్-బ్యాండ్ (L1+L5) GPS సపోర్ట్, అలాగే 100 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని తెలియజేస్తున్నారు.

కొందరు టెక్ లీకర్స్ ప్రకారం, ఈ కొత్త స్మార్ట్‌వాచ్ “అల్ట్రా” పేరుతో కాకుండా ఇది గెలాక్సీ వాచ్ X గా పేరు మార్చి కూడా రిలీజ్ చెయ్యొచ్చు అని అంచానాలు వేస్తున్నారు. ఇది సాంసంగ్ యొక్క స్మార్ట్‌వాచ్ లైనప్ లో మరింత ప్రీమియం ఆఫరింగ్గా ఉంటుంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టాండర్డ్ మరియు ప్రో వేరియంట్‌లకు దగ్గరగా ఉన్నప్పటికీ ఒక ప్రీమియం మోడల్ గా గెలాక్సీ వాచ్ X ని సూచిస్తున్నారు.

డిజైన్ లో మార్పులు:

గెలాక్సీ వాచ్ 7 సిరీస్, ఈ కొత్త ప్రీమియం వేరియంట్ సహా, ఒక ముఖ్యమైన డిజైన్ మార్పునకు గురయ్యే ఉహలు ఉన్నాయి. కొత్త మోడల్స్ స్క్వేర్-షేప్ డయల్ అలాగే ఎక్స్ట్రా గా మూడవ బటన్ కూడా ఉండవచ్చు, అదే సమయంలో ఐకానిక్ రోటేటింగ్ బెజెల్ ని కంటిన్యూ చేస్తుంది.

ఈ సాంసంగ్ తన స్మార్ట్‌వాచ్ లైనప్ ని ఒక ఉన్నత, ఫీచర్-రిచ్ మోడల్ తో స్ప్రెడ్ చెయ్యడానికి సిద్దంగా ఉంది, అలాగే టెక్ మార్కెట్ లో కొత్త ప్రామాణికాలను ఎశ్టాబ్లిష్ సిద్దంగా ఉంది. రాబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో అధికారిక నిర్ధారణ కోసం అలాగే అడిషనల్ డీటెయిల్స్ కోసం వెయిట్ చెయ్యాలి.

Show comments