పూజాపై సమంతా ఫ్యాన్స్ ఆన్లైన్ వార్

పూజాపై సమంతా ఫ్యాన్స్ ఆన్లైన్ వార్

ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలయ్యారు తరహాలో హీరొయిన్ పూజా హెగ్డే ఇన్స్ టా అకౌంట్ నుంచి వచ్చిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెను దుమారమే రేపుతోంది. ఇవాళ పూజా ఉన్నట్టుండి రాత్రి తన ఇన్స్ టా హ్యాండిల్ ని ఎవరో హ్యాక్ చేశారని అందుకే తప్పుడు మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్లిపోయిందని అందులో పేర్కొంది. అధిక శాతం ఫాలోయర్స్ కి అసలేం జరిగిందో అర్థం కాలేదు. ఆరా తీస్తే పూజా హెగ్డే అకౌంట్ లో మజిలీ సినిమాలో సమంతా ఉన్న స్క్రీన్ షాట్ ఒకటి పెట్టి దానికి క్యాప్షన్ గా నాకు తను ఏ మాత్రం అందంగా కనిపించడం లేదు అని ఉంది.

ఇంకేముంది దాన్ని చూసి సాం ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. పూజా క్షమాపణ చెప్పాలంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఈలోగా అలెర్ట్ అయిన పూజా తన టీంతో దాన్ని తీయించేసి హ్యాకింగ్ కి పాల్పడింది ఎవరనే కోణంలో విచారణ చేయమని తన వాళ్ళకు చెప్పిందట. అయితే అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. సామ్ అభిమానులు హ్యాకింగ్ లాంటిది ఏమి జరగలేదని, పూజా సారీ చెప్పే తీరాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఇది కాస్తా చిలికి చిలికి గాలి వానగా మారి ఫ్యాన్స్ అందరికి స్ప్రెడ్ అయ్యింది.

పూజా మెసేజ్ ని డిలీట్ చేయించింది కాని అప్పటికే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్న వాళ్ళు ఆ పిక్ ని వైరల్ చేసేశారు. దాంతో అడ్డుకట్ట వేసే ఛాన్స్ లేకపోయింది. నిజానికి పూజా హెగ్డే, సమంతాలకు గొప్ప స్నేహం ఏమి లేదు. అలా అని పోటీ అని కూడా చెప్పలేం. పూజా హెగ్డే ఇప్పుడు పీక్స్ లో ఉండగా సమంతా అందరు అగ్ర హీరోలతో ఎప్పుడో నటించేసింది. అందుకే సమకాలీనులుగా పరిగణించలేం. ఇది ఎక్కడ ఆగుతుందో తెలియదు కాని మొత్తానికి టాపిక్ అయితే ఇంకా హాట్ హాట్ గానే ఉంది. మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ కం సింగర్ టీమ్ సమంతా అని ప్రత్యేకంగా ట్వీట్ చేయడం ఆసక్తి రేపింది. ఇక సమంతా విక్టరీ సింబల్ ని చూపిస్తూ అసలే క్యాప్షన్ లేకుండా ఫోటోని పోస్ట్ చేయడం కొసమెరుపు. ఇక వీటిలో ఎవరికి కావాల్సిన అర్థాలు వాళ్ళు తీసుకోవడమే బాలన్స్

Show comments