iDreamPost

RRR ముందు తలొంచిన జాన్ సినిమా

RRR ముందు తలొంచిన జాన్ సినిమా

ఆర్ఆర్ఆర్ ప్రభంజనం తీవ్రంగా ఉన్నా సరే కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన జాన్ అబ్రహం కొత్త సినిమా అటాక్ కు పరాభవం తప్పలేదు. తొలిరోజు కేవలం 3 కోట్ల వసూళ్లతో సర్దుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు నిన్న ఈ రోజు వసూళ్లు చాలా కీలకంగా మారబోతున్నాయి. కానీ పెద్దగా ఆశ పెట్టుకోవడానికి లేదు. నార్త్ ఆడియన్స్ ట్రిపులార్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆదివారం కూడా వాళ్ళ ఛాయస్ ఇదే ఉందని అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే అర్థమైపోతోంది. ముంబై ఢిల్లీ లాంటి నగరాల కన్నా అక్కడి బిసి సెంటర్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. బచ్చన్ పాండే డిజాస్టర్, అటాక్ లిమిటెడ్ జానర్ అప్పీల్ ఆర్ఆర్ఆర్ కు కలిసి వస్తోంది.

డిసెంబర్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ దగ్గరలో ఎలాంటి రిలీజులు పెట్టుకోవద్దని బాలీవుడ్ నిర్మాతలకు చేసిన హెచ్చరికలో అర్థం ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసి వస్తోంది. సౌత్ సినిమాల గురించి తేలికగా మాట్లాడిన జాన్ అబ్రహం ఊహించని విధంగా గొప్ప గుణపాఠమే నేర్చుకున్నాడు. ప్రాంతీయ భేదాలు కళకు ఉండవని, ప్యాన్ ఇండియా మూవీస్ పెరిగాక రాష్ట్రాల మధ్య హద్దులు చెరిగిపోయాయని గుర్తించకుండా చేసిన కామెంట్లకు తగిన మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఫైనల్ గా కనీసం ఒక ఇరవై కోట్లు తేవడం కూడా అటాక్ కు స్థాయికి మించిన టార్గెట్ గా కనిపిస్తోంది. రేపటికి క్లారిటీ వస్తుంది.

ఈ నెల 13న రాబోయే విజయ్ బీస్ట్, కెజిఎఫ్ 2 వచ్చేలోగా అటాక్ ఎంత రాబట్టుతుందో కానీ ఫైనల్ గా నష్టాలు మాత్రం తప్పేలా లేవు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ అటాక్ కి సీక్వెల్ ఉంది. పార్ట్ 2ని రెడీ చేస్తున్నారు. ఒకవేళ మొదటి భాగం బ్లాక్ బస్టర్ అయితే దానికి క్రేజ్ వచ్చేది కానీ ఇప్పుడా ఛాన్స్ లేదు. పైగా దానికి హైప్ కూడా ఉండదు. ఇంకో పది రోజులు ఆగినా బాగుండేది కానీ అతిగా అంచనా వేసుకుని బరిలో దిగిన అటాక్ ప్రొడ్యూసర్లు భంగపడ్డారు. హిందీ ఆర్ఆర్ఆర్ హక్కులు కొన్న పెన్ స్టూడియోసే ఇప్పుడీ అటాక్ లో కూడా నిర్మాణ భాగస్వామి కావడం అన్నిటికన్నా పెద్ద ఝలక్. ఎందుకిలా చేశారో మరి.

Promo ఆర్ఆర్ఆర్ కు ఎదురెళ్ళడం ద్వారా అటాక్ తగిన మూల్యమే చెల్లించాల్సి వచ్చింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి