iDreamPost

RRR collections: ట్రిపులార్ లక్ష్యం ఇంకా ఎంత దూరం ఉంది

నేపాల్ లాంటి దేశంలో సైతం రోజుకు కోటి రూపాయలు వసూలు చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నైజామ్ లో థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న 70 కోట్లను కేవలం ఆరు రోజుల్లోనే అందుకుంది. ఇకపై వచ్చేవన్నీ లాభాలే. సీడెడ్ లోనూ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది.

నేపాల్ లాంటి దేశంలో సైతం రోజుకు కోటి రూపాయలు వసూలు చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నైజామ్ లో థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న 70 కోట్లను కేవలం ఆరు రోజుల్లోనే అందుకుంది. ఇకపై వచ్చేవన్నీ లాభాలే. సీడెడ్ లోనూ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది.

RRR collections: ట్రిపులార్ లక్ష్యం ఇంకా ఎంత దూరం ఉంది

ఇవాళ్టితో ఆర్ఆర్ఆర్ మొదటి వారం పూర్తి చేసుకుంది. కలెక్షన్ల పరంగా రికార్డులు నమోదు కావడం చూస్తూనే ఉన్నాం. నేపాల్ లాంటి దేశంలో సైతం రోజుకు కోటి రూపాయలు వసూలు చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నైజామ్ లో థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న 70 కోట్లను కేవలం ఆరు రోజుల్లోనే అందుకుంది. ఇకపై వచ్చేవన్నీ లాభాలే. సీడెడ్ లోనూ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. నార్త్ లో ఆల్రెడీ 120 కోట్లను దాటేసిన రాజమౌళి మేజిక్ ఈ వారం జాన్ అబ్రహం అటాక్ వస్తున్నా కూడా పెద్దగా నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు. ఆ యాక్షన్ థ్రిల్లర్ కన్నా జక్కన్న డబుల్ మాస్ కే ఎక్కువ ఓట్లు పడతాయి.

ఇదంతా బాగానే ఉంది కానీ టికెట్ రేట్లు ఇంకా పూర్తిగా నార్మల్ కాకపోవడంతో వల్ల బిసి సెంటర్లలో కొంత ఆందోళనకరంగానే డ్రాప్ ఉంటోంది. అయితే ఉగాది పండగ ఉంది దానికి తోడు మరుసటి రోజు సన్ డే కాబట్టి ఇప్పుడు స్లో అయినా ఆ లోటు మొత్తం ఆ రెండు రోజుల్లో తీరిపోతుందన్న ధీమా ట్రేడ్ లో కనిపిస్తోంది. ఏపిలో జిల్లా కేంద్రాల్లోనూ సెకండ్ క్లాస్ 180 రూపాయల దాకా నడుస్తోంది. ఇది అఫీషియలే అయినా మిడిల్ క్లాస్ జనం హాలు దాకా ఈ కారణంగానే రాలేకపోతున్నారు. ఇంకో వారం ఆగకతప్పేలా లేదు. పోటీగా ఇంకే చెప్పుకోదగ్గ సినిమా లేకపోవడమే ఆర్ఆర్ఆర్ కు ఉన్న అతి పెద్ద సానుకూలాంశం. ఏప్రిల్ 13 దాకా ఇంతే.

ఇక ఇప్పటిదాకా వచ్చిన కలెక్షన్లు చూస్తే 371 కోట్ల షేర్, 670 కోట్ల గ్రాస్ తో ట్రిపులార్ స్ట్రాంగ్ గా ఉంది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 130 కోట్లు రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఇంకో 10 కోట్లు వస్తే చాలు బయ్యర్లు సేఫ్. ఇదేమంత కష్టం కాదు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లు సాధ్యమా అంటే మాత్రం ఇప్పుడే చెప్పలేం. సోషల్ మీడియాలో కాంప్లిమెంట్లు గట్టిగా పడుతున్నాయి. విదేశీయులు ప్రత్యేకంగా మెచ్చుకుంటూ ట్వీట్లు పెడుతున్నారు. ఈ రోజు నుంచి ఇంగ్లీష్ పాత్రలకు తెలుగు డబ్బింగ్ జోడించిన ఆడియోని జత చేశారు. త్రిడి స్క్రీన్ల కౌంట్ పెరిగింది. సో లక్ష్యం ఎప్పటిలోగా చేరుకుంటుందనేది వేచి చూడాలి

Also Read : KGF Chapter 2 : రాఖీ భాయ్ టార్గెట్ చాలా పెద్దది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి