వీడియో: జైస్వాల్‌ సెంచరీ పూర్తి కాగానే డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ చేసిన రోహిత్‌!

వీడియో: జైస్వాల్‌ సెంచరీ పూర్తి కాగానే డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ చేసిన రోహిత్‌!

Rohit Sharma Reaction Viral After Yashasvi Jaiswal Century: టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ తాజాగా జరుగుతున్న టెస్ట్ లో సెంచరీతో చెలరేగాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ శర్మ చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rohit Sharma Reaction Viral After Yashasvi Jaiswal Century: టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ తాజాగా జరుగుతున్న టెస్ట్ లో సెంచరీతో చెలరేగాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ శర్మ చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాను సాధించిన రికార్డులకు సంతోష పడితే.. ఆటగాడి లక్షణం. కానీ తన సహచరులు, జూనియర్స్ సాధించించిన రికార్డులకు సైతం ఆనందపడటమే అసలైన నాయకుడి లక్షణం. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేస్తున్న పని ఇదే. భారత యువ క్రికెటర్లు సెంచరీలు చేసినా.. వికెట్లు తీసినా వారికంటే ఎక్కువగా సంతోష పడతాడు హిట్ మ్యాన్ రోహిత్. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ అద్భుత సెంచరీ సాధించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ లో చేసిన రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? తాను ముందుండి జట్టును నడిపించడమే కాకుండా.. కష్టనష్టాలను ఎదుర్కొని, తన తర్వాత వచ్చే వారికి సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకెళ్తూ ఉండాలి. అలాగే కుర్రాళ్ళను ప్రోత్సహిస్తూ.. వారు సాధించిన రికార్డులను తాను సాధించినట్లుగా ఫీల్ అవ్వాలి. అప్పుడే జట్టులో వాతావరణం బాగుంటుంది. దాంతో యంగ్ ప్లేయర్లు సైతం మరింత అద్భుతంగా ఆడేందుకు ఇది సహాయపడుతుంది. ప్రస్తుతం టీమిండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ చేస్తుంది ఇదే. మెుదటి నుంచి రోహిత్ ఇతర ఆటగాళ్లు రికార్డులు బద్దలు కొట్టడమో లేదా సెంచరీలు చేయడమో చేస్తే వారిని ప్రత్యేకంగా అభినందిస్తాడు. ఇక వారికంటే ఎక్కువగా సంతోషపడతాడు.

తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్ట్ లో సైతం ఇదే రిపీట్ చేశాడు. యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ సూపర్ సెంచరీ చేయడంతో.. డ్రెస్సింగ్ రూమ్ లో కెప్టెన్ రోహిత్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. గట్టిగా అరుస్తూ.. చేతులు జైస్వాల్ లా చాచి తన సంతోషాన్ని పంచుకున్నాడు. సెంచరీ చేసినప్పుడే కాదు.. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లకు బజ్ బాల్ క్రికెట్ ను చూపిస్తున్నంత సేపు రోహిత్ ఫుల్ ఎనర్జీగా ఉన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లో రచ్చ చేస్తూ కనిపించాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో(131) చెలరేగిన రోహిత్, రెండో ఇన్నింగ్స్ లో 19 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ప్రస్తుతం టీమిండియా 322 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి 2 వికెట్లకు 196 పరుగులు చేసింది భారత జట్టు. మరి జైస్వాల్ సెంచరీ తర్వాత రోహిత్ చేసిన రచ్చపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Yashasvi Jaiswal: సెహ్వాగ్ సరసన జైస్వాల్.. ఈ సెంచరీ స్పెషల్ ఏంటో తెలుసా?

Show comments