వీడియో: రింకూ సింగ్‌కు సారీ చెప్పిన రోహిత్‌ శర్మ! నీలో ఉన్న గొప్పతనం ఇదే అంటూ..!

వీడియో: రింకూ సింగ్‌కు సారీ చెప్పిన రోహిత్‌ శర్మ! నీలో ఉన్న గొప్పతనం ఇదే అంటూ..!

Rohit Sharma, Rinku Singh: ఐపీఎల్‌తో పాటు టీమిండియాలో మంచి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్‌కు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారీ చెప్పాడు. రోహిత్‌ అతనికి ఎందుకు సారీ చెప్పాడో ఇప్పుడు క్లియర్‌గా తెలుసకుందాం..

Rohit Sharma, Rinku Singh: ఐపీఎల్‌తో పాటు టీమిండియాలో మంచి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్‌కు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారీ చెప్పాడు. రోహిత్‌ అతనికి ఎందుకు సారీ చెప్పాడో ఇప్పుడు క్లియర్‌గా తెలుసకుందాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత.. మీడియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. అనంతరం నేరుగా ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియానికి వెళ్లిన రోహిత్‌.. అక్కడ నెక్ట్స్‌ మ్యాచ్‌ ఆడేందుకు ప్రాక్టీస్‌ చేస్తున్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లను పలకరించి మాట్లాడాడు. ఈ క్రమంలోనే రింకూ సింగ్‌ను కాస్త పర్సనల్‌గా కలిసి, అతన్ని ఓదార్చినట్లు సమాచారం. రింకూ సింగ్‌కు ఏమైంది? అతని ఓదార్చాల్సిన అవసరం ఏముందని? మీరు కంగారు పడకండి. తాజాగా ప్రకటించిన టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో రింకూ సింగ్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. అతన్ని కేవలం స్టాండ్‌ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపిక చేశారు.

అయితే.. గత కొంత కాలంగా ఫినిషర్‌గా అద్భుతంగా రాణిస్తున్న రింకూ సింగ్‌ కచ్చితంగా టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉంటాడని అంతా భావించారు. కానీ, భారత సెలెక్టర్లు అతనికి మొండిచేయి చూపించారు. కేవలం స్టాండ్‌ బై ప్లేయర్లుగా ఎంపిక నలుగురిలో మాత్రమే చోటిచ్చారు. ఈ విషయంపై క్రికెట్‌ అభిమానులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రికెట్‌ అభిమానులకే అంత బాధ ఉంటే.. ఇక చోటు దక్కని రింకూ సింగ్‌ ఎంత బాధపడి ఉంటాడో కదా? అందుకే ఆ బాధలో ఉన్న రింకూ సింగ్‌ను టీమిండియా కెప్టెన్‌గా, ఒక సీనియర్‌ ప్లేయర్‌గా రోహిత్‌ శర్మ.. అతనితో మాట్లాడి, నీకు చాలా ఫ్యూచర్‌ ఉంది, ఈ చిన్న విషయానికే బాధపడితే ఎలాగా? నువ్వు భవిష్యత్తులో ఎంతో సాధిస్తావ్‌? అంటూ అతన్ని కాస్త మోటివేట్‌ చేసినట్లు తెలుస్తుంది. అలాగే టీమ్‌లోకి తీసుకోలేకపోయినట్లు సారీ కూడా చెప్పి ఉంటాడనే టాక్‌ వినిపిస్తోంది.

సాధారణంగా రోహిత్‌ శర్మ యువ క్రికెటర్లకు ఎక్కువ అవకాశం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటాడు. కానీ, వరల్డ్‌ కప్‌ టీమ్‌లో అన్ని ప్లేస్‌లు ఫిల్‌ అయిపోవడం, ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉండటంతో.. ఫినిషర్‌గా ఉన్న రింకూ సింగ్‌కు వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు లేకుండా పోయింది. అయితే.. ఎంపిక కానీ రింకూ సింగ్‌తో రోహిత్‌ మాట్లాడిన తీరుపై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందుకే రోహిత్‌ శర్మను అందరూ గొప్ప వ్యక్తి అంటారు అంటూ క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. మరి రింకూ సింగ్‌ను, పర్సనల్‌గా కలిసి రోహిత్‌ శర్మ ఓదార్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments