IPLలో ఒకలా.. వరల్డ్‌ కప్‌లో ఒకలా.. ఎందుకీ డిఫరెన్స్‌! అక్కడ జీరోలు.. ఇక్కడ హీరోలు!

IPLలో ఒకలా.. వరల్డ్‌ కప్‌లో ఒకలా.. ఎందుకీ డిఫరెన్స్‌! అక్కడ జీరోలు.. ఇక్కడ హీరోలు!

IPL 2024లో ఒకలా.. టీ20 వరల్డ్ కప్ లో ఒకలా రాణిస్తున్నారు కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాలు. అక్కడ జీరోలుగా రాణించి.. ఇక్కడ హీరోలుగా మారడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2024లో ఒకలా.. టీ20 వరల్డ్ కప్ లో ఒకలా రాణిస్తున్నారు కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాలు. అక్కడ జీరోలుగా రాణించి.. ఇక్కడ హీరోలుగా మారడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 వరల్డ్ కప్ 2024లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది టీమిండియా. అందుకు తగ్గట్లుగానే తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది టీమిండియా.  ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫిఫ్టీతో రాణించగా.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీసి రాణించాడు. దాంతో ఈ ఐపీఎల్ సీజన్ లో విఫలం అయిన ఈ ఇద్దరు.. పొట్టి ప్రపంచ కప్ లో రాణించడానికి కారణాలు ఏంటి? అక్కడ జీరోలుగా ఉండి.. ఇక్కడ హీరోలుగా మారడానికి రీజన్స్ ఏంటి? అని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు.

ఐపీఎల్ 2024 సీజన్ లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలం అయ్యారు. వీళ్లిద్దరు ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహించిన వారే కావడం విశేషం. అయితే రోహిత్ ను కాదని కెప్టెన్సీ పగ్గాలను హార్దిక్ ఇవ్వడంతో.. ఒక విధంగా  ముంబై ఇండియన్స్ పతనం స్టార్ట్ అయ్యిందనే చెప్పవచ్చు. ఇక ఈ సీజన్ లో ఇటు రోహిత్, అటు హార్దిక్ ఇద్దరూ దారుణంగా విఫలం అయ్యారు. దాంతో ఇద్దరూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే వీరు విఫలం కావడానికి కారణాలు లేకపోలేదు.

ముంబై కెప్టెన్ గా తొలగించినందుకు రోహిత్.. తీవ్ర అసంతృప్తికి గురైయ్యాడు. దాంతో మానసికంగా కుంగిపోయాడు. ఈ బాధతోనే అతడు ఈ ఐపీఎల్ సీజన్ మెుత్తం ఆడాడు. కానీ రాణించలేకపోయాడు. ఈ సీజన్ లో 14 మ్యాచ్ ల్లో 417 రన్స్ చేశాడు. అతడు స్థాయికి ఈ పరుగులు చాలా తక్కువనే చెప్పాలి. ఇక ఈ ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా ఫర్పామెన్స్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కెప్టెన్ గా, బ్యాటర్ గా, బౌలర్ గా పూర్తిగా విఫలం అయ్యాడు. అయితే ఐపీఎల్ లో విఫలం అయిన ఈ ఇద్దరు.. టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ద్వారా ఫామ్ లోకి వచ్చారు.

టీ20 వరల్డ్ కప్ కి ముందు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు ఫామ్ లో లేరు. కానీ ఐసీసీ టోర్నీ అనేసరికి టీమిండియా కీలక బ్యాటర్లకు రెచ్చిపోతారు. ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారు రోహిత్, హార్దిక్ లు. ఐపీఎల్ లో పెద్దగా రాణించలేకపోయిన ఈ ఇద్దరు మెగాటోర్నీ తొలి మ్యాచ్ తోనే ఫామ్ లోకి రావడం టీమిండియాకు శుభసూచకం. ఎలాగైనా ఐసీసీ ట్రోఫీని సాధించడం, టీమిండియా గౌరవాన్ని నిలబెట్టడం కోసమే ఆటగాళ్ల ఆరాటమంత. కప్ గెలవాలనే కసితోనే ఈ ఇద్దరు రాణించడానికి ప్రధాన కారణంగా నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇక ఐపీఎల్ లో మానసిక ఒత్తిడి కారణంగా ప్రదర్శన చేయలేకపోయారు. కానీ ఇక్కడ ఆ  పరిస్థితులు లేవు. స్వేచ్ఛగా వారు ఆడుకోవచ్చు. దేశం కోసం ఆడుతున్న ఫీలింగ్ వారిని మరింత ఉత్తేజకరంగా రాణించేలా చేస్తున్నాయి. మరి ఐపీఎల్ లో ఒకలా.. వరల్డ్ కప్ లో మరోలా రాణిస్తున్న ఈ ఇద్దరిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments