Rishabh On Rohit Sharma And David Warner: రోహిత్- వార్నర్ గురించి పంత్ షాకింగ్ కామెంట్స్.. అలా అనేశాడు ఏంటి?

రోహిత్- వార్నర్ గురించి పంత్ షాకింగ్ కామెంట్స్.. అలా అనేశాడు ఏంటి?

Rishabh Pant Crazy Commetns On Star Cricketers: టీమిండియా యంగ్ స్టర్ రిషబ్ పంత్ ఆటతోనే కాదు.. మాటతో కూడా అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్టార్ ప్లేయర్స్ పై పంత్ చేసిన కామెంట్స్ చూడండి.

Rishabh Pant Crazy Commetns On Star Cricketers: టీమిండియా యంగ్ స్టర్ రిషబ్ పంత్ ఆటతోనే కాదు.. మాటతో కూడా అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్టార్ ప్లేయర్స్ పై పంత్ చేసిన కామెంట్స్ చూడండి.

రిషబ్ పంత్.. వరల్డ్ కప్ ముందు నుంచి ఈ యంగ్ క్రికెటర్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే చావు అంచుల దాకా వెళ్లిన పంత్.. తిరిగి టీమిండియాలోకి వస్తాడు అని ఎవరూ అనుకోలేదు. కానీ, అది సుసాధ్యం చేసి చూపించాడు. మన లక్ష్యం సరైంది అయితే.. విజయం వరిస్తుంది అనేందుకు పంత్ ఒక మంచి ఉదాహరణ. కోలుకోవడం మాత్రమే కాకుండా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో మెరుపులు మెరిపించాడు. టీమ్ ప్రదర్శన పక్కన పెడితే.. వ్యక్తిగతంగా పర్వాలేదనిపించాడు. అంతేకాకుండా పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ లో కూడా చోటు సంపాదించుకున్నాడు. ఈ యంగ్ ప్లేయర్ స్టార్ ప్లేయర్ల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రిషబ్ పంత్ తన జర్నీతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాడు. తిరిగి మైదానంలోకి రావడమే కాకుండా.. మంచి ఫామ్ తో వరల్డ్ కప్ లో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వరల్డ్ కప్ లో పంత్ ప్రదర్శనను దిగ్గజాలు కూడా మెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇండియా ఆడిన మూడు మ్యాచుల్లో పంత్ జట్టులో ఎంత కీలకమో నిరూపించుకున్నాడు. తొలి మ్యాచ్ లో (36*), రెండో మ్యాచ్ లో (42), మూడో మ్యాచ్ లో (18) పరుగులు చేశాడు. జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పుడు రిషబ్ పంత్ తన ప్రదర్శనతోనే కాకుండా.. మరో విషయంలో బాగా వైరల్ అవుతున్నాడు. అది కూడా స్టార్ ప్లేయర్ల మీద కొన్ని కామెంట్స్ చేసి వైరల్ అవుతున్నాడు.

ఆ స్టార్ ప్లేయర్స్ మరెవరో కాదు.. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పంత్ ఆ సందర్భంలో పలు కామంట్స్ చేశాడు. కొందరు ప్లేయర్స్ పేర్లు చెప్పి వారి గురించి సింగిల్ వర్డ్ లో చెప్పాలి అని హోస్ట్ అడగ్గా పంత్ క్రేజీ ఆన్సర్స్ చెప్పేశాడు. ముందుగా కోహ్లీ గురించి సింగిల్ వర్డ్ లో చెప్పాలి అని అడగ్గా.. ‘ఎనర్జీ’ అంటూ సమాధానం చెప్పాడు. మైదానంలో కోహ్లీ ఆటతీరు చూసిన ఎవరైనా అదే పేరు పెడతారు. కాబట్టి పంత్ కూడా అలా అనడంలో కొత్తగా ఏమీ లేదు. ఇంక ఎంఎస్ ధోనీ గురించి చెప్పమంటే.. ‘కామ్ నెస్’ అని ఆన్సర్ ఇచ్చాడు. ధోనీకి ఉన్న బిరుదు కూడా కెప్టెన్ కూల్ కాబట్టి పంత్ కూడా అభిమానిగా చెప్పాడు అనిపిచింది.

అయితే పంత్ రోహిత్ శర్మ.. డేవిడ్ వార్నర్ గురించి మాత్రం క్రేజీ ఆన్సర్స్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మా గురించి చెప్పమంటే.. ‘చీకీ’ అంటూ సమాధానం చెప్పాడు. రోహిత్ విషయంలో మాత్రం పంత్ కాస్త ఫన్నీ కామెంట్ చేసినట్లు అనిపించింది. ఇంక డేవిడ్ వార్నర్ గురించి అయితే నెక్ట్స్ లెవల్ కామెంట్ చేశాడు. డేవిడ్ వార్నర్ గురించి వన్ వర్డ్ అంటే.. ఇండియన్ అంటూ సమాధానం చెప్పాడు. ఇది మాత్రం నిజంగా నిజమైన ట్యాగ్ అని చెప్పాలి. ఎందుకంటే డేవిడ్ వార్నర్ ని చూస్తే అంతా అదే మాట అంటారు. ఆస్ట్రేలియన్ కంటే కూడా ఎక్కువగా ఇండియన్ లాగానే అనిపిస్తూ ఉంటాడు. ఈ నలుగురు గురించి పంత్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Show comments