iDreamPost

IND vs AFG: రోహిత్‌ తర్వాత.. మెచ్చుకోవాల్సింది ఈ ఇద్దర్నే! వారి వల్లే గెలిచాం

  • Published Jan 18, 2024 | 1:04 PMUpdated Jan 18, 2024 | 1:04 PM

భారత్‌-ఆఫ్ఘాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులకు ఫుల్‌ వినోదాన్ని అందించింది. రెండు సూపర్‌ ఓవర్లతో మ్యాచ్‌ సూపర్‌గా సాగింది. అయితే.. ఈ మ్యాచ్‌ విజయంలో రోహిత్‌ తర్వాత క్రెడిట్‌ పొందాల్సిన ఇద్దరు హీరోలు ఉన్నారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

భారత్‌-ఆఫ్ఘాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులకు ఫుల్‌ వినోదాన్ని అందించింది. రెండు సూపర్‌ ఓవర్లతో మ్యాచ్‌ సూపర్‌గా సాగింది. అయితే.. ఈ మ్యాచ్‌ విజయంలో రోహిత్‌ తర్వాత క్రెడిట్‌ పొందాల్సిన ఇద్దరు హీరోలు ఉన్నారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 18, 2024 | 1:04 PMUpdated Jan 18, 2024 | 1:04 PM
IND vs AFG: రోహిత్‌ తర్వాత.. మెచ్చుకోవాల్సింది ఈ ఇద్దర్నే! వారి వల్లే గెలిచాం

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో బుధవారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ చేసిన భారత్‌.. బౌలింగ్‌లో విఫలం అవ్వడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. తొలి సూపర్‌ ఓవర్‌లో కూడా మ్యాచ్‌ ఫలితం తేలకపోవడంతో.. రెండో సూపర్‌ ఓవర్‌ కూడా నిర్వహించారు. ఎట్టకేలకు.. రెండో సూపర్‌ ఓవర్‌లో మ్యాచ్‌ ఫలితం తేలింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏకంగా సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఆరంభంలోనే టీమిండియా వరుస వికెట్లు కోల్పోయినా.. రోహిత్‌ శర్మ టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. కేవలం 69 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సులతో 121 పరుగులు చేశాడు.

ఈ ఇన్నింగ్సే కాకుండా సూపర్‌ ఓవర్స్‌లోనూ రోహిత్‌ శర్మనే అద్భుతంగా ఆడాడు. తొలి సూపర్‌ ఓవర్‌లో 14 పరుగులు, రెండో సూపర్‌ ఓవర్‌లో 11 పరుగులు రోహిత్‌ ఒక్కడే చేశారు. అందుకే ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మకు ఎక్కువ క్రిడిట్‌ ఇవ్వాలి. ఎందుకంటే.. జైస్వాల్‌, కోహ్లీ, శివమ్‌ దూబే, సంజు శాంసన్‌ వెంటవెంటనే అవుటైనా.. కేవలం 22 పరుగులకే 4 వికెట్లు పడినా.. జట్టు స్కోర్‌ను 212కు చేర్చాడు. అయితే.. ఈ మ్యాచ్‌ విజయంలో రోహిత్‌తో పాటు మరో ఇద్దరికి కూడా క్రెడిట్‌ ఇవ్వాల్సింది. ఆ ఇద్దరు మరెవరో కాదు.. రోహిత్‌కు బ్యాటింగ్‌లో మద్దతుగా నిలిచిన రింకూ సింగ్‌, సూపర్‌ ఓవర్‌లో సూపర్‌గా బౌలింగ్‌ వేసిన రవి బిష్ణోయ్‌. వీరిద్దరూ అద్భుతంగా ఆడటంతోనే టీమిండియాకు విజయం దక్కిందనే చెప్పాలి.

team india winning

22 పరుగులకే 4 వికెట్లు పడిపోయిన దశలో రింకూ సింగ్‌, రోహిత్‌ శర్మకు జతకలిశాడు. ఆరంభంలో కాస్త ఆచీతూచీ ఆడిన రింకూ ఒక్కసారి సెట్‌ అయ్యాకా.. రోహిత్‌ శర్మతో పోటీ పడి మరీ షాట్లు ఆడాడు. కొన్ని సందర్భాల్లో రోహిత్‌ను డామినేట్‌ కూడా చేశాడు. మొత్తం 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 69 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు. ఇక రవి బిష్ణోయ్‌ గురించి మాట్లాడుకోవాలి. తొలి సూపర్‌ ఓవర్‌ కూడా టై అయిన తర్వాత టీమిండియా రెండో సూపర్‌ ఓవర్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసింది. 12 రన్స్‌ చేస్తే ఆఫ్ఘాన్‌ విజయం సాధిస్తుంది. అప్పటి వరకు ఆఫ్ఘాన్‌ బ్యాటింగ్‌ చూసిన వారికి కచ్చితంగా వాళ్లు గెలుస్తారని అనిపించింది. కానీ, అంత ఒత్తిడిలోనూ యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అద్భుతమైన బౌలింగ్‌తో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి టీమిండియాకు 10 పరుగుల తేడాతో విజయం అందించాడు. ఆఫ్ఘాన్‌ బ్యాటర్లను బోల్తా కొట్టించే డెలవరీస్‌తో సూపర్‌ ఓవర్‌లో రెండు వికెట్లు తీసుకున్నాడు. మరి రోహిత్‌ తర్వాత ఈ విజయంలో క్రెడిట్‌ తీసుకున్న రింకూ, రవి బిష్ణోయ్‌ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి