RGUKT IIIT Basara Admissions 2024 Notification: పదో తరగతి పాసయ్యారా.. బాసర IIITలో ఫ్రీగా చదివే ఛాన్స్‌..

పదో తరగతి పాసయ్యారా.. బాసర IIITలో ఫ్రీగా చదివే ఛాన్స్‌..

పదో తరగతి పాస్‌ అయ్యారా.. ఇంటర్లో చేరాలని భావిస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. ఆరేళ్ల పాటు ఉచితంగా.. అది కూడా ట్రిపుల్‌ ఐటీలో చదివే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

పదో తరగతి పాస్‌ అయ్యారా.. ఇంటర్లో చేరాలని భావిస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. ఆరేళ్ల పాటు ఉచితంగా.. అది కూడా ట్రిపుల్‌ ఐటీలో చదివే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

పదో తరగతి అయ్యాక ఇంటర్‌లో చేరాలి. కామన్‌గా జరిగేది ఇదే. మన దగ్గర అయితే ఎక్కువగా ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఎక్కువ. పదో తరగతి తర్వాత.. ఏ కోర్సు చేయాలి.. దేనిలో చేరితో.. త్వరగా లైఫ్‌లో సెటిల్‌ అవ్వొచ్చు.. ఏ కోర్సులకు డిమాండ్‌ బాగా ఉంది విషయాల గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన ఉంటే.. చాలా మంచిది. లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పదో తరగతి పూర్తి కాగానే ఇంటర్‌తో పాటు ఇంజనీరింగ్‌ కూడా చేసే అవకాశం ఉంది. అది కూడా ఐఐఐటల్లో. వీటిల్లో చేరితో.. ఆరేళ్ల పాటు ఒకే చోట హాస్టల్‌, చదువుతో పాటు.. లైఫ్‌లో త్వరగా సెటిల్‌ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో బాసర ట్రిపుల్‌ ఐటీలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆవివరాలు..

బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో ప్రవేశాల కోసం జూన్ 1వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ విద్యార్ధులకు మెరుగైన అవకాశాలు కల్పించే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. ఈ ఐఐఐటీలను ఏర్పాటు చేశారు. నూజివీడు, ఇడుపులపాయ, బాసరలో ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో విడివిడిగా ప్రవేశాలను నిర్వహిస్తున్నారు. అయితే.. తాజాగా బాసర రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

గతంలో మాదిరిగానే ఈసారి కూడా బాసర క్యాంపస్‌లో వివిధ బ్రాంచ్‌లలో కలిపి మొత్తం 1,500 సీట్లు అందుబాటులో ఉంటాయని వీసీ వివరించారు. బాసర క్యాంపస్‌లో ఉన్న మొత్తం సీట్లలో నాన్‌లోకల్‌ కోటాలో 15 శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ఇక ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లో విద్యార్థులకు సీట్లను కేటాయిస్తామని తెలిపారు. తొలి ఏడాదికి ఫీజు రూ.37 వేలు ఉండగా.. రీయింబర్స్‌మెంట్‌ అర్హత ఉన్న వారు ఆ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇది కాక.. విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.1000, కాషన్‌ డిపాజిట్‌ కోసం రూ.2 వేలు, ఆరోగ్య బీమా కింద రూ.700… మొత్తం రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

బాసర ట్రిపుల్‌ ఐటీ 2024 అడ్మిషన్‌ షెడ్యూల్‌ పూర్తి వివరాలు..

  • దరఖాస్తుల స్వీకరణ : జూన్‌ 1 నుంచి 26 సాయంత్రం 5 గంటల వరకు
  • సీట్ల కేటాయింపు : జులై 3, 2024
  • పత్రాల పరిశీలన : జులై 8 నుంచి 10 వరకు

ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2024 మార్చిలో తొలి ప్రయత్నంలోనే పదో తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులుగా ప్రకటించారు. దరఖాస్తుదారుల వయసు జూన్ 1వ తేదీ నాటికి 18ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు 21ఏళ్ల వరకు మినహాయింపు ఉంటుంది. గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 5 శాతం సీట్లు సూపర్‌న్యూమరీ కింద కేటాయిస్తారు. అడ్మిషన్ విధివిధానాలు ఇతర నిబంధనలకు సంబంధించిన సమాచారం కోసం https://www.rgukt.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Show comments