Jadeja, Rivaba: వీడియో: మీడియాపై కోపంతో ఊగిపోయిన రవీంద్ర జడేజా భార్య!

వీడియో: మీడియాపై కోపంతో ఊగిపోయిన రవీంద్ర జడేజా భార్య!

రవీంద్ర జడేజా భార్య మీడియాపై కోపంతో ఊగిపోయారు. ఒక ఎమ్యెల్యేగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ.. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు రిపోర్టర్‌ నుంచి ఎదురైన ప్రశ్న ఆమెకు కోపం తెప్పించింది. ఆ ప్రశ్న ఏంటో ఇప్పుడు చూద్దాం..

రవీంద్ర జడేజా భార్య మీడియాపై కోపంతో ఊగిపోయారు. ఒక ఎమ్యెల్యేగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ.. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు రిపోర్టర్‌ నుంచి ఎదురైన ప్రశ్న ఆమెకు కోపం తెప్పించింది. ఆ ప్రశ్న ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రవీంద్ర జడేజా కుటుంబంలో వివాదాలు ఇప్పట్లో చల్లారేలా లేవు. కోడలి కారణంగా తమ కొడుకు తమకు దూరం అయ్యాడని, కుటుంబంలో ఆమె చిచ్చు పెట్టిందని జడేజా తండ్రి దివ్య భాస్కర్‌ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జడేజాకి వివాహం అయిన రెండు మూడు నెలలకే తమ ఇంట్లో గొడవలు మొదలయ్యాయని, పండగొచ్చినా, పబ్బమొచ్చినా.. జడేజా తమను పిలవడని, అలాగే తాము కూడా అతన్ని అతని భార్యను పిలవమంటూ జడేజా తండ్రి వెల్లడించాడు. ఈ విషయంపై జడేజా సైతం స్పందించిన విషయం తెలిసిందే. తన తండ్రి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని భార్యకు మద్దుతుగా నిలబడ్డాడు.

ఈ వివాదం తాలుకు ప్రకంపనలు తాజాగా జడేజా భార్య రివాబాను తాకాయి. ఆమె జామ్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జామ్‌నగర్‌ ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే హోదాలో ఆమె ఒక ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఒక రిపోర్ట్‌ ఆమెను జడేజా తండ్రి దివ్య భాస్కర్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించాడు. ఈ ప్రశ్నపై రివాబా కోపంతో ఊగిపోయారు. ఇక్కడికి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, కానీ, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేందుకు కాదని చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు.

ఆమె స్పందన చూసిన తర్వాత కుటుంబంలో వివాదాలు గట్టిగానే జరుగుతున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే.. ప్రెస్‌మీట్‌లో ఆమె వ్యక్తిగత విషయాలపై ప్రశ్నించాల్సిన అవసరం లేదని కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం జడేజా తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడన్న విషయం స్పష్టమైంది. తన తండ్రి చేసిన ఆరోపణలు నిజం కాదని, ఆ విషయంలో తాను కూడా చెప్పుకోవాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు జడేజా భార్య కూడా ఆ విషయం అడగ్గానే అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు. మరి వీరి వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments