Rare Rs 10 Notes: లండన్‌లో వేలానికి అరుదైన రూ.10 నోట్లు! లక్షల్లో లాభం! ఎందుకు అంత స్పెషల్?

లండన్‌లో వేలానికి అరుదైన రూ.10 నోట్లు! లక్షల్లో లాభం! ఎందుకు అంత స్పెషల్?

Rare Rs 10 Notes: ప్రపంచలో అపురూపమైనవి.. గొప్ప గొప్ప వారు ఉపయోగించిన వస్తువులు, నోట్లు వేలం పాట పాడతారు. వేలం లేదా వేలం పాట అనేది ఒక రకమైన అమ్మకం. సదరు వస్తువుకు ఒక ధర నిర్ణయించి ఎవకు ఎక్కువ ధర చెల్లిస్తారో వారు ఆ వస్తువును సొంతం చేసుకుంటారు.

Rare Rs 10 Notes: ప్రపంచలో అపురూపమైనవి.. గొప్ప గొప్ప వారు ఉపయోగించిన వస్తువులు, నోట్లు వేలం పాట పాడతారు. వేలం లేదా వేలం పాట అనేది ఒక రకమైన అమ్మకం. సదరు వస్తువుకు ఒక ధర నిర్ణయించి ఎవకు ఎక్కువ ధర చెల్లిస్తారో వారు ఆ వస్తువును సొంతం చేసుకుంటారు.

సాధారణంగా ప్రపంచంలో అపురూపమైన.. అరుదైన వస్తువులకు వేలం వేస్తుంటారు. వాటిని అత్యధిక ధర చెల్లించి తమ సొంతం చేసుకునేందుకు ఎంతోమంది పోటీ పడుతుంటారు. వేలం పాటలో ఆ వస్తువు దక్కించుకోవడం ఎంతో ప్రెస్టేజియస్ గా భావిస్తుంటారు. ఇప్పటి వరకు అరుదైన వస్తువులు, నోట్లు, పేయింటింగ్స్, నాణాలు, డైమండ్స్ వేలం పాటలో కనీ వినీ ఎరుగని రీతిలో అమ్ముడు పోయాయి. భారత దేశానికి చెందిన అరుదైన 10 రూపాయల నోటుల వేలం వేయబోతున్నారు. 1918 జులై 2 న ఓ పడవ ప్రమాదం జరిగింది.. ఆ సమయంలో ఈ నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఇలాంటి అరుదైన నోట్లు దక్కించుకునేందుకు ఎంతోమంది పోటీ పడుతున్నారు.. ఈ నోట్లు ఎక్కడ వేలం వేస్తున్నారన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

1918 జులై 2 న మద్యం, మందుగుండు సామాగ్రి,ఇతర పదార్ధాలతో ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఓ పెద్ద ఓడ.. జర్మన్ యూ- బోటు నుంచి వచ్చిన మిస్సైల్ తో ఢీకొట్టడంతో సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో రెండు భారతీయ కరెన్సీ నోట్లు ఆ ఓడలో భద్రంగా ఉన్నాయి. 1918 నాటి ఐరిష్ తీర సముద్రంలో మునిగిపోయిన ఓడలో లభించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూ.10 నోట్లు నూనన్స్ మేఫేర్ వేలం సంస్థ లండన్ లో వచ్చే బుధవారం వేలం వేయనుంది. ఇవి వేలంలో 2,000 నుంచి 2,600 (భారతీయ కరెన్సీలో రూ.2.11 లక్షల నుంచి 2.74 లక్షలు) పౌండ్ల ధ పలికే అవకాశం ఉందని అంటున్నారు. 1918, మే 25న జారీ చేసి ఈ రూ.10 నోట్లు జులై లో సంబవించిన ప్రమాదంలో ఎస్ ఎస్ షిలారా అనే ఓడలో లభించాయి.

అప్పట్లో జరిగిన ప్రమాదంలో సంతకం లేని 5,10 రూపాయ సహా అనేక నోట్లు ఒడ్డుకు చేరాయి. సంతకం చేసిన రూ.1 నోటు కూడా ఈ వేలంలో ప్రదర్శించబడింది. కొన్ని నోట్లను అధికారులు నాశనం చేశారు. కొన్ని నోట్లను పునర్ముద్రించారు. మరికొన్ని నోట్లు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దక్కించుకున్నారు.  వేలంలో ఉన్న 10 నోట్లు కండీషన్ లో ఉన్నాయని.. పైగా ఈ రెండు నోట్లు వరుస సంఖ్యలను కలిగి ఉండటం మరో విశేషం అని వేలం నిర్వాహకులు.. న్యూమిస్మాటిక్స్ హెడ్ థామస్సినా స్మిత్ చెప్పారు. ఇవి కాకుండా మరో రూ.100 నోటు కూడా ఈ వేలంలో ఉందని.. బ్రిటీష్ వలస కాలానికి చెందినదని అధికారులు తెలిపారు. ఈ నోటు కలకత్తాలో సంతకం, స్టాంప్ వేయబడిందని 1917 నుంచి 1930 మద్యలో వాడి ఉండవొచ్చని అంటున్నారు.

 

Show comments