Ram Charan: త్వరలో తండ్రిగా ప్రమోషన్.. పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చరణ్ కీలక నిర్ణయం!

Ram Charan: త్వరలో తండ్రిగా ప్రమోషన్.. పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చరణ్ కీలక నిర్ణయం!

  • Author Soma Sekhar Published - 01:47 PM, Mon - 19 June 23
  • Author Soma Sekhar Published - 01:47 PM, Mon - 19 June 23
Ram Charan: త్వరలో తండ్రిగా ప్రమోషన్.. పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చరణ్ కీలక నిర్ణయం!

రామ్ చరణ్-ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న విషయం తెలిసిందే. దాంతో పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటి నుంచే తగు జగ్రత్తలు తీసుకుంటున్నారు రామ్ చరణ్-ఉపాసన దంపతులు. ఇటీవలే ఉపాసన పుట్టబోయే బిడ్డ బొడ్డు తాడును జాగ్రత్తగా దాచి ఉంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ సైతం రాబోయే బిడ్డ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ గా వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు రామ్ చరణ్. దానికి ప్రధాన కారణం.. ఉపాసన డెలివరీ త్వరలోనే ఉంటుందని తెలిపారట డాక్టర్లు. దాంతో తను పుట్టబోయే బిడ్డకు అలాగే ఉపాసనకు తన పూర్తి సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అగష్టు నెల వరకు గేమ్ ఛేంజర్ మూవీకి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దాంతో శంకర్ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మిగతా షూటింగ్ ను రామ్ చరణ్ అందుబాటులోకి వచ్చాక తిరిగి ప్రారంభం అవుతుందని సమాచారం. ఇక పుట్టబోయే బిడ్డ కోసం తన సమయాన్ని కేటాయించడం పట్ల రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

Show comments