Rajinikanth: ఆ హిట్ ఫార్ములా ఫాలో అవుతున్న రజినీకాంత్! అందులో తగ్గేదేలేదట..

ఆ హిట్ ఫార్ములా ఫాలో అవుతున్న రజినీకాంత్! అందులో తగ్గేదేలేదట..

జైలర్ సక్సెస్ తర్వాత ఆ సినిమాకు ఫాలో అయిన హిట్ ఫార్ములానే ప్రస్తుతం చేస్తున్న మూవీలకు ఫాలో అవుతున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వొద్దని డిసైడ్ అయ్యాడట. మరి ఇంతకీ ఆ ఫార్ములా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

జైలర్ సక్సెస్ తర్వాత ఆ సినిమాకు ఫాలో అయిన హిట్ ఫార్ములానే ప్రస్తుతం చేస్తున్న మూవీలకు ఫాలో అవుతున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వొద్దని డిసైడ్ అయ్యాడట. మరి ఇంతకీ ఆ ఫార్ములా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

సూపర్ స్టార్ రజినీకాంత్.. జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. అయితే జైలర్ సక్సెస్ తర్వాత ఆ సినిమాకు ఫాలో అయిన హిట్ ఫార్ములానే ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు కూడా అన్వయిస్తూ వస్తున్నాడు సూపర్ స్టార్. డైరెక్టర్, కథ కంటే ఎక్కువగా ఆ విషయాన్నే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఆ ఫార్ములా విషయంలో మాత్రం ఎక్కడా తగ్గేదే లేదు అంటున్నాడట సూపర్ స్టార్ రజినీ. మరి ఆ ఫార్ములా ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జైలర్ మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో రజినీలో జోష్ రెట్టింపు అయ్యింది. ఆ జోష్ లో వరుసగా సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోలను డామినేట్ చేస్తున్నాడు. తనలో పస తగ్గిందని, తన సినిమాలు హిట్ కావట్లేదన్న వారికి జైలర్ తోనే సమాధానం ఇచ్చాడు. ఈ మూవీ దాదాపు రూ. 700 కోట్లను కొల్లగొట్టింది. ఇక ఈ మూవీకి రజినీ ఫాలో అయిన ఫార్ములానే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ల్లో కూడా ఫాలో అవుతున్నాడు. ఇంతకీ ఆ ఫార్ములా ఏంటనే కదా మీ ఆసక్తి. అక్కడికే వస్తున్నా..

జైలర్ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ తో అతిథి పాత్రలు చేయించారు. ఇక ట్రెండ్ ను తన మిగతా మూవీల్లో కూడా ఉండే విధంగా చూసుకుంటున్నాడు సూపర్ స్టార్. అందుకే తన నెక్ట్స్ మూవీలు అయిన వెట్టాయన్ లో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా ఉండేలా చూసుకున్నాడు. అలాగే లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న మూవీలో సైతం స్టార్ క్యాస్టింగ్ నే ఎంపిక చేశారు. ఇందులో శివకార్తికేయన్, ఫహద్ ఫాజిల్ లు నటిస్తున్నారు. జైలర్ మూవీ నుంచి సూపర్ స్టార్ క్యాస్టింగ్ పై ఫుల్ ఫోకస్ పెంచినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరి సూపర్ స్టార్ ఫాలో అవుతున్న ఫార్ములా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments