Rajinikanth: రజనీకాంత్ చేతివేళ్లు అలా ఎందుకు పెడతారో తెలుసా? హెల్త్ సీక్రెట్!

రజనీకాంత్ చేతివేళ్లు అలా ఎందుకు పెడతారో తెలుసా? హెల్త్ సీక్రెట్!

Rajinikanth.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలతోనే కాదు స్పీచులతోనూ అదరగొడుతుంటారు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

Rajinikanth.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలతోనే కాదు స్పీచులతోనూ అదరగొడుతుంటారు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆ నాటి తరం నుండి ఈ నాటి తరం వరకు తెలిసిన నటుడాయన. బెంగళూరులో పుట్టిన ఈ శివాజీ రావ్ గైక్వాడ్.. తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రజనీకాంత్ అయ్యాడు. అనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. అసలైన తొలి పాన్ ఇండియన్ హీరో అతడే. అతడి స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు ఆడియన్స్. 50 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న ఆయన.. ఇప్పటికి 170 చిత్రాలను పూర్తి చేశాడు. 70 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోలతో పోటీగా నటిస్తూ.. జోష్ కొనసాగిస్తున్నాడు. గత ఏడాది జైలర్ మూవీతో హిట్ అందుకున్న రజనీ.. తాజాగా లాల్ సలామ్ మూవీతో పలకరించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు వెట్టియాన్ మూవీతో ముందుకు రాబోతున్నాడు ఈ సీనియర్ స్టార్ హీరో.

ఇక రజనీకాంత్ యాక్టింగ్‌కే కాదు.. స్పీచులతో కూడా అదరగొడుతుంటాడు. అలాగే తలైవాలో ఆధ్యాత్మిక కూడా చాలా ఎక్కువే అన్న సంగతి విదితమే. అప్పుడుప్పుడు ఆయన హిమాలయాలకు వెళ్లి వస్తారన్న సంగతి విదితమే. అక్కడకు వెళ్లి కొన్ని రోజులు ప్రశాంతమైన జీవితాన్ని గడిపి వస్తారు. కాగా, రజనీకాంత్ ఎక్కడైనా బయట కనిపిస్తే.. ఓ ముద్రలో కనిపిస్తుంటారు. బొటనవేలు, చూపులువేలును కలుపుతూ ఆ ముద్ర ఉంటుంది. ఇంతకు ఆ ముద్ర అర్థమేమిటంటే.. దానిని యోగాలో చిన్ ముద్ర అంటారు. ఈ ముద్ర వేయడం వల్ల నరాలు మెరుగ్గా పనిచేస్తాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది తద్వారా మెదడు స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే ఈ ముద్ర వేసినప్పుడు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కోపం, నిద్రలేమీ, తలనొప్పి వంటి సమస్యలు రావట.

అయితే ఈ ముద్ర వేయడం ఇప్పట్లో అలవాటు చేసుకోలేదు రజనీకాంత్. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలోనే ఈ ముద్ర గురించి తెలిసి ఫాలో అవుతున్నారు. అలాగే తలైవా సినిమాల విషయానికి వస్తే.. వెట్టయాన్ మూవీని పూర్తి చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ పై టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, దుషార విజయన్, రితికా సింగ్, మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ బాణీలు సమకుర్చారు. అక్టోబర్ 10న విడుదల ఈ మూవీ కానుంది. కాగా, ఇప్పటికే డిజిటిల్, శాటిలైట్ హక్కులను భారీ రేటుకు తమిళ నెట్ వర్క్ ఛానెల్ సొంతం చేసుకుంది. దీని తర్వాత లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ మూవీ ఉండనున్నట్లు తెలుస్తుంది.

Show comments