Rajinikanth Golden Visa: Video: సౌత్ ఇండియా స్టార్ రజనీకాంత్ కి మరో అరుదైన గౌరవం!

Video: సౌత్ ఇండియా స్టార్ రజనీకాంత్ కి మరో అరుదైన గౌరవం!

Rajinikanth Golden Visa: సూపర్ స్టార్, తమిళ తలైవా రజనీకాంత్‌కు మరో గౌరవం దక్కింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆయనకు వివిధ అవార్డులు ప్రధానం చేసి సత్కరించాయి. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని తలైవా అందుకున్నారు.

Rajinikanth Golden Visa: సూపర్ స్టార్, తమిళ తలైవా రజనీకాంత్‌కు మరో గౌరవం దక్కింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆయనకు వివిధ అవార్డులు ప్రధానం చేసి సత్కరించాయి. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని తలైవా అందుకున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. సినిమాల్లోకి రావాలనుకునే ఎంతో మందికి ఆయన స్ఫూర్తి. ఓ ఆర్టీసీ కండక్టర్ గా జీవిత ప్రయాణం సాగించిన ఆయన నేడు ఇండియన్ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతేకాక ఆయన సినీ రంగానికి చేసిన కృషికి అనేక అవార్డులు కూడా వరించాయి. అంతేకాక పలు దేశాలు ఆయనను వివిధ అవార్డులు ప్రధానం చేసి సత్కరించాయి. తాజాగా ఈ తలైవాకు మరో అరుదైన గౌరవం దక్కింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

సూపర్ స్టార్, తమిళ తలైవా రజనీకాంత్‌కు మరో గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం ఆయనకు గోల్డెన్ వీసాను ప్రధానం చేసింది. యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలను అందిస్తూ ఉంటుంది. వివిధ రంగాల్లో పేరు పొందిన ప్రముఖులను సత్కరించేందుకు గోల్డెన్ వీసాను అందిస్తోంది యూఏఈ ప్రభుత్వం. ఇప్పటికే భారత్ నుంచి పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి రజనీకాంత్‌ చేరారు. ఇక యూఏఈ ప్రభుత్వం ప్రధానంచ సే ఈ గోల్డెన్ వీసాకు కాలపరిమితి కూడా ఉంటుంది. లాంగ్‌టర్మ్ వీసా..ఈ గోల్డెన్ వీసాకు 10 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది.

ఇక గోల్డెన్ వీసాను అందుకున్న సందర్భంగా రజనీకాంత్ తన స్పందనను తెలియజేశారు. తనకు గోల్డెన్ వీసా మంజూరు చేసినందుకు యూఏఈ ప్రభుత్వానికి రజనీ కృతజ్ఞతలు తెలిపారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. ఈ వీసాను అందించిన యూఏఈ ప్రభుత్వంతో పాటు తన స్నేహితుడు లులూ గ్రూప్‌ అధినేత‌ యూసఫ్‌ అలీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వల్లే ఇది సాధ్యమైనట్లు రజనీ చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం వేట్టైయాన్ సినిమాలో నటిస్తున్న రజనీకాంత్ వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లారు. ఈ సందర్భంగా అబుదాబిలో జరిగిన ఓ కార్యక్రమంలో యూఏఈ ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆయనకు ఈ గోల్డెన్ వీసాను ప్రధానం చేసింది.

2019లో యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ వీసాను చాలామంది ఇండియన్ సెలబ్రిటీలకు యూఏఈ అందించి సత్కరించింది. తాజాగా రజనీకాంత్‌ను కూడా ఆ ప్రభుత్వం గోల్డెన్‌ వీసాతో గౌరవించింది. ఇక ఈ వీసా పొందిని వారందరూ  పూర్తి ఓనర్‌షిప్‌తో యూఏఈలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. భారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్న జాబితా ఇదే..  షారుక్‌ ఖాన్‌, అల్లు అర్జున్‌, సంజయ్ దత్, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, విజయ్ సేతుపతి,కమల్ హాసన్‌, విక్రమ్, సునీల్ షెట్టి, బోనీ కపూర్ వంటి మరికొందరు ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.

Show comments