Pic Talk: రజినీ ఎత్తుకున్న ఈ పాప ఎవరో తెలుసా..? పెద్దయ్యాక ఆయన సినిమాలోనే!

రజినీ ఎత్తుకున్న ఈ పాప ఎవరో తెలుసా..? పెద్దయ్యాక ఆయన సినిమాలోనే!

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎత్తుకున్న ఆ పాప ఎవరో తెలుసా..? ఆమె కూడా ఫేమస్ స్టారే. ఇంతకు ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం. ఆమె ఇంచు మించు అన్నీ ఇండస్ట్రీల్లో వర్క్ చేసింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎత్తుకున్న ఆ పాప ఎవరో తెలుసా..? ఆమె కూడా ఫేమస్ స్టారే. ఇంతకు ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం. ఆమె ఇంచు మించు అన్నీ ఇండస్ట్రీల్లో వర్క్ చేసింది.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి తెలియని వారు బహుశా ఉండకపోవచ్చు. రోబో చిత్రంతో బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసేసిన నటుడాయన. ఇక్కడే కాదు..విదేశాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకు. 70 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ హీరోలకు ధీటుగా నటిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు. స్టైలిష్ స్టార్ పదం ఈయన నుండే పుట్టిందేమో అనిపిస్తుంది మ్యానరిజం చూస్తుంటే. గత ఏడాది జైలర్ మూవీతో అలరించిన తలైవా.. ఈ ఏడాది లాల్ సలామ్ చిత్రంతో ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉందో మీకు తెలిసిందే. ఇప్పుడు జై భీం దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టియాన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇక రజినీ చేతిలో ఉన్న ఈ పాప ఎవరో తెలుసా..?రెండు పిలకలతో చక్కని గౌను ధరించి ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడో స్టార్ సింగర్. రజనీకాంత్ చిత్రాల్లో కూడా పాడింది. సంగీత కళామతల్లి ముద్దు బిడ్డ. చిన్నప్పటి నుండే మ్యూజిక్ అంటే ఆసక్తితో సాధన చేసింది. ఆమె కష్టానికి ప్రతి ఫలం దక్కింది. చిన్న వయస్సులోనే ఆమెకు సర్వస్వతి కటాక్షంతో పాటు లక్ష్మి దేవి కూడా వరించింది.నేపథ్య గాయని నుండి స్టార్ సింగర్‌గా ఎదిగింది. తన పాటలతో ఓలలాడించడమే కాకుండా మంత్ర ముగ్దులను చేసేసింది. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ, సింహాల భాషల్లో 4 వేలకు పైగా పాటలు పాడింది. ఇంతకు ఈ సూపర్ సింగర్ ఎవరనుకుంటున్నారా.. అనురాధ శ్రీరామ్.

తమిళనాడుకు చెందిన అనురాధ శ్రీరామ్.. తల్లి ప్లేబ్యాక్ సింగర్. దీంతో కూతురికి సంగీతం నేర్పించింది తల్లి. 1995లో ముంబయి సినిమాతో సింగర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో అదే ఏడాది సొగసు చూడతరమా అనే చిత్రంలో ‘సీత కోక చిలుకలమ్మా’ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది. బొంబాయి ప్రియుడు, పవిత్ర బంధం, అన్నమయ్య మొదలుకుని ఎన్నో చిత్రాలకు గాత్రాన్ని అందించింది. మురారి ‘భామ భామ బంగారం’, డాడీలో ‘పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ’ జెమినీలో టైటిల్ సాంగ్, నాగ మూవీలో‘ఒక కొంటె పిల్లను చూశా’ ఇలాంటివి ఎన్నో పాటలు పాడింది. ఇంచు మించు అందరి మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర వర్క్ చేసిన అనుభవం ఉంది ఆమెకు. అనురాధ వాయిస్‌లో స్పెషల్ బేస్ ఉంటుంది. రాక్ మ్యూజిక్ పాటను అవలీలగా పాడుతున్నట్లు ఉంటుంది. అనేక అవార్డులు కొల్లగొట్టింది. సత్య భామ యూనివర్శిటీ ఆమె డాక్టరేట్ కూడా ఇచ్చింది. ఆమె సింగర్ శ్రీరామ్ పరుశురామ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు.

Show comments