ఈ కుర్రాడు ఇప్పుడు టీమిండియాలో నయా సంచలనం! ఎవరో గుర్తుపట్టారా?

ఈ కుర్రాడు ఇప్పుడు టీమిండియాలో నయా సంచలనం! ఎవరో గుర్తుపట్టారా?

  • Author Soma Sekhar Published - 03:21 PM, Sat - 24 June 23
  • Author Soma Sekhar Published - 03:21 PM, Sat - 24 June 23
ఈ కుర్రాడు ఇప్పుడు టీమిండియాలో నయా సంచలనం! ఎవరో గుర్తుపట్టారా?

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో సెలబ్రిటీలకు సంబంధించిన చైల్డ్ హుడ్ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అభిమానులు తమ అభిమాన హీరో, హీరోయిన్స్, క్రికెటర్స్ ల చిన్ననాటి ఫోటోలను సందర్భాలను బట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓ కుర్ర బ్యాటర్ పిక్ ను ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ కుర్రాడు సాధిస్తాడా? సాధించాడు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక ఈ కుర్రాడు గత ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపాడు. మరి టీమిండియాలోకి దూసుకొచ్చిన ఈ నయా సంచలనం ఎవరో చూద్దాం.

పై ఫొటోలో కనిపిస్తున్న చిచ్చర పిడుగు స్కూల్ నుంచే రికార్డులు బద్దలు కొట్టేవాడు. 2015లో ఓ మ్యాచ్ లో 319 పరుగులు చేసి పసితనంలోనే రికార్డు క్రియేట్ చేశాడు. చిన్నతనం నుంచే క్రికెట్ అంటే పిచ్చితో.. కసిగా ఆడాడు. తక్కువ కాలంలో అండర్-19 జట్టులోకి ఎంపిక అయ్యాడు. ఇక 2020 అండర్-19 వరల్డ్ కప్ లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు ఈ బుడతడు.లిస్ట్-ఏ క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా ఈ బుడతడు ఘనతకెక్కాడు.

కాగా 2023 ఐపీఎల్ సీజన్ లో తన ఆటతో దుమ్మురేపాడు. కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో కేవలం 13 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంతటి అద్భుతమైన ఆటను కనబరుస్తున్నాడు కాబట్టే బీసీసీఐ టీమిండియాకు ఎంపిక చేసింది. అవును విండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు అతడిని ఎంపిక చేసింది. ఈపాటికే మీకు అర్దం అయ్యింది అనుకుంటా.. ఈ బుడతడు ఎవరో? అవును టీమిండియా నయా సంచలనం యశస్వీ జైస్వాలే పై ఫొటోలో కనిపించే చిచ్చర పిడుగు.

ఈ క్రమంలోనే జైస్వాల్  చిన్నప్పటి ఫొటోను ఇప్పటి ఫొటోను రాజస్తాన్ రాయల్స్ జట్టు తన ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తాజాగా టీమిండియాలో టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడంతో.. అతడు సాధిస్తాడా? అతడు సాధించాడు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఐపీఎల్ లో జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తో అతడు అద్భుతమైన ప్రతిభను కనబర్చాడు. దాంతో అతడికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది.

Show comments