iDreamPost

జపాన్ లోనూ ప్రభంజనం – RRR ఇక నెంబర్ వన్..

జపాన్ లోనూ ప్రభంజనం – RRR ఇక నెంబర్ వన్..

రిలీజై ఎనిమిది నెలలు అవుతున్నా ఆర్ఆర్ఆర్ తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆస్కార్ రేస్ లో నిలిపాక రాజమౌళి దీనికోసమే ప్రత్యేకంగా దేశదేశాలు తిరుగుతూ ప్రమోషన్ చేసే పనిలో ఉన్నారు. తాజాగా జపాన్ లో విడుదలైనప్పుడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో జక్కన్న అక్కడ చేసిన హడావిడి వీడియో రూపంలో చూశాం. ఇండియన్ కరెన్సీ ప్రకారం ట్రిపులార్ అక్కడ 10 కోట్ల వసూళ్లను దాటేసింది. దీనికన్నా ముందు ఉన్నవి బాహుబలి 2, ముత్తులు మాత్రమే. ఫస్ట్ ప్లేస్ కష్టమే కానీ రెండో స్థానానికి ఎగబాకడం మాత్రం సులభంగానే ఉంది. సాధారణంగా హిట్టయిన ఏ విదేశీ సినిమాకైనా జపాన్ లో థియేట్రికల్ రన్ ఎక్కువ రోజులు ఉంటుంది.

RRR Release in Japan: జపాన్ లోకి ఆర్ఆర్ఆర్.. రాజమౌళి ప్లాన్ అదిరింది..  రంగంలోకి ఎన్టీఆర్ - చరణ్ - OK Telugu

ఇక కలెక్షన్ల పరంగా ప్యాన్ ఇండియా సినిమాల్లో ఇప్పటిదాకా కెజిఎఫ్ 2 పేరు మీద హయ్యెస్ట్ రికార్డు ఉంది. 1200 కోట్ల మార్కుతో రాఖీ భాయ్ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆర్ఆర్ఆర్ జపాన్ కు వెళ్ళడానికి ముందు వరకు 1150 దగ్గరే ఆగిపోయింది. యాభై కోట్ల దూరంలో సెకండ్ ప్లేస్ తో సర్దుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడా సమస్య లేదు. ఈజీగా టేకోవర్ చేసి నెక్స్ట్ పదహేను వందల కోట్లను టార్గెట్ చేసుకోబోతోంది. ఇంకా చైనా విడుదల బాకీ ఉంది. కెజిఎఫ్ 2 ఇక్కడ, ఓవర్సీస్ లో కొన్ని ప్రధాన దేశాల్లో తప్ప వరల్డ్ వైడ్ దానికి గొప్ప సినిమానే ప్రశంసలు దక్కలేదు. కానీ ఆర్ఆర్ఆర్ కేసు అలా కాదు. ఇప్పటికీ యుఎస్ లో ఎన్కోర్ పేరుతో వేస్తున్న ఐమాక్స్ స్పెషల్ ప్రీమియర్లు హౌస్ ఫుల్స్ తో నడుస్తున్నాయి.

RRR: జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద “ఆర్ఆర్ఆర్” రికార్డులు మోత.. - 10TV Telugu

 

ఒక థియేటర్ మూవీ మహా అయితే నెల రోజుల కంటే ఎక్కువగా బ్రతకలేని పరిస్థితిలో ఆర్ఆర్ఆర్ ఇంత దూరం ప్రయాణించడం గొప్ప విశేషం. ఇక కలలు కంటున్న ఆ ఆస్కార్ అవార్డు కూడా వచ్చేస్తే జక్కన్న కల నెరవేరినట్టే. ఇదంతా మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు చాలా పెద్ద ప్లస్ కానుంది. ఎందుకంటే ఫారినర్స్ ప్రస్తుతం జక్కన్న గత చిత్రాలను వెతికి మరీ చూసే పనిలో పడ్డారు. బాహుబలి, ఈగ, మగధీరలు చూసి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అలాంటిది రాజమౌళి కొత్త చిత్రం ఫలానాది అని తెలియడం ఆలస్యంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు మనలాగే ఎగబడతారు. ఓటిటి శాటిలైట్ ఇలా అన్ని రూపాల్లో ఉన్న ఆర్ఆర్ఆర్ కు ఇప్పటిలో బ్రేకులు పడేలా కనిపించడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి