Post Office Recurring: పోస్టాఫీస్ నుంచి మరో సూపర్ స్కీమ్.. వందల్లో పెట్టుబడితో లక్షల్లోఆదాయం!

పోస్టాఫీస్ నుంచి మరో సూపర్ స్కీమ్.. వందల్లో పెట్టుబడితో లక్షల్లోఆదాయం!

Post Office Recurring: కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల్లో తపాల వ్యవస్థ ఒకటి. దీని ద్వారా కేవలం సమాచారం మాత్రమే కాకుండా ప్రజలకు అనేక సేవలను అందిస్తుంది. తాజాగా పోస్టాఫీస్ ఓ అద్ఫుతమైన స్కీమ్ ను అందిస్తుంది.

Post Office Recurring: కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల్లో తపాల వ్యవస్థ ఒకటి. దీని ద్వారా కేవలం సమాచారం మాత్రమే కాకుండా ప్రజలకు అనేక సేవలను అందిస్తుంది. తాజాగా పోస్టాఫీస్ ఓ అద్ఫుతమైన స్కీమ్ ను అందిస్తుంది.

ప్రజలకు ఆర్థిక భరోసా అనేది ముఖ్యం. కొందరు ఆస్తులు ఉంటాయి కాబట్టి ఆర్థిక పరమైన సమస్యలు వస్తే.. కాస్త తట్టుకోలగలరు. అయితే చాలా మందికి ఉద్యోగం చేస్తేనే కుటుంబ పోషణ సాగుతుంది. ఈక్రమంలోనే వచ్చిన సంపాదనలోనే కాస్తా ప్రభుత్వ అందించే ఆర్థిక స్కీమ్స్ లో పెట్టుబడి పెడితే..మంచి లాభాలు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వంతో పాటు, పోస్టాఫీస్ వ్యవస్థ కూడా ప్రజలకు ఎన్నో ఆర్థికంగా లాభం చేకూర్చే పథకాలను అందిస్తున్నాయి. ఇప్పటికే పోస్టాఫీస్ నుంచి అనే పథకాలు అందుబాటులో ఉండగా.. మరో సూపర్ స్కీమ్ ఉంది. వందల పెట్టుబడితే లక్షల్లో రిటర్న్స్ పొందవచ్చు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల్లో తపాల వ్యవస్థ ఒకటి. దీని ద్వారా కేవలం సమాచారం మాత్రమే కాకుండా ప్రజలకు అనేక సేవలను అందిస్తుంది. అందుకే చిన్న చిన్న గ్రామాల ప్రజలు కూడా ఈ పోస్టాఫీస్ పథకాల్లో ఎక్కువగా డబ్బుల్ని డిపాజిట్ చేస్తుంటారు. అలానే చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టి మంచి రిటర్న్స్ అందించే పోస్టాఫీస్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం లేదా నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ అనే స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.

గ్రామాల్లోని ప్రజలు పెట్టుబడులపై ఆసక్తి కలిగించాలనే లక్ష్యంతో సెంట్రల్ గవర్నమెంట్ అనేక పొదుపు స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాంటిదే ఈ నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ అనేది. ఈ స్కీమ్ ద్వారా ఏడాది ప్రాతిపదికన 6.7 శాతం స్థిరంగా వడ్డీ లభిస్తుంది. ఇక ఈపథకంలో కనిష్టంగా నెలకు రూ. 100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు.  అలానే దానికి గరిష్ట పరిమితి అంటూ ఏం లేదు. మనకు ఎంత సామర్థ్యం ఉంటే అంత పెట్టుబడిని పెట్టుకోవచ్చు. అలానే సింగిల్ ఖాతా లేదా ఉమ్మడి ఖాతా కింద గరిష్టంగా ముగ్గురు కలిసి ఈ స్కీమ్ లో పొదుపు చేయవచ్చు. ఈ స్కీమ్ పరిమితి 5  ఏళ్లు ఉంటుంది.  ఇంకా అవసరం అనుకుంటే మరో ఐదేళ్లు అంటే.. 10 ఏళ్ల వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అలానే ఏడాది పాటు కట్టిన తర్వాత రుణం కూడా తీసుకునే అవకాశం ఉంది.

ఖాతాను ముందుగా కూడా క్లోజ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. నెలకు 5 వేలు, 10 వేలు, 20 వేలు ఇలా ఎంతైనా డిపాజిట్లు చేసుకునేందుకు సౌకర్యం ఉంది. ఇక ఒక ఉదాహరణ చూసినట్లు అయితే.. ఈ స్కీమ్ కింద నెలవారీగా రూ.5 వేల డిపాజిట్  చేసినారు అనుకుంటే.. దీనికి ఐదేళ్లకు మొత్తం పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. ఇక దీనిపై 6.70 శాతం వడ్డీ వస్తుంది. ఈ పెట్టుబడికి వడ్డీ రూపంలోనే రూ.56,830 వస్తుంది. మెచ్యూరిటీ సమయంకి మన చేతికి మొత్తం రూ.3.56 లక్షలు వస్తాయి. అదే విధంగా 10 వేలు పెట్టుబడి పెడితే.. పై విధంగానే  ఐదేళ్ల నాటికి రూ.7.13 లక్షలు పొందవచ్చు. ఇక్కడ వడ్డీ కింద రూ.1.13 లక్షలు వస్తాయి. ఇలా మనం పెట్టుబడి పెట్టే కొద్ది రిటర్న్స్ కూడా భారీగా ఉంటాయి.

Show comments