iDreamPost

Indian Railways: టికెట్ లేకుండా రైలులో ప్రయాణం! కొత్త రూల్ అమల్లోకి..

చాలా మంది టికెట్ తీసుకునే టైమ్ లేక హడావుడిగా రైలు ఎక్కేస్తారు. అలాంటి సందర్భాల్లో జరిమానా చెల్లించే పరిస్థితి ఉండేది. అయితే టికెట్ లేకుండా రైలులో ప్రయాణం చేసేందుకు రైల్వే శాఖ ఓ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని సమాచారం.

చాలా మంది టికెట్ తీసుకునే టైమ్ లేక హడావుడిగా రైలు ఎక్కేస్తారు. అలాంటి సందర్భాల్లో జరిమానా చెల్లించే పరిస్థితి ఉండేది. అయితే టికెట్ లేకుండా రైలులో ప్రయాణం చేసేందుకు రైల్వే శాఖ ఓ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని సమాచారం.

Indian Railways: టికెట్ లేకుండా రైలులో ప్రయాణం! కొత్త రూల్ అమల్లోకి..

మన దేశంలో ప్రజలు ఎక్కువగా వినియోగించే రవాణ వ్యవస్థల్లో రైల్వేశాఖ ఒకటి. రైళ్ల ద్వారా నిత్యం ఎంతో మంది  తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. టికెట్ ధర కూడా తక్కువా ఉండటంతో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించేందుకే ఆసక్తి చూపిస్తుంటారు. అదే విధంగా ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ప్రయాణికుల కోసం తరచూ అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. అంతేకాక ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను అమలు చేస్తూ ప్రయాణాన్ని సుఖవంతం చేస్తుంది. అలానే రైళ్లలో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా టికెట్ లేకుండా రైల్లో ప్రయాణం చేసే విషయంపై రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

 మన దేశంలో రోజూ లక్షల మంది  రైలు ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు.  రైలులో ప్రయాణించాలంటే టికెట్ తీసుకోవడం తప్పనిసరనే విషయం మనందరికి తెలిసిందే. అందుకే రైలు బయలు దేరే చివరి క్షణం వరకు కూడా  ప్రయాణికులు టికెట్ కౌంటర్ వద్ద క్యూలైన్లో నిలబడే ఉంటారు. కొన్ని సార్లు టికెట్ తీసుకునే లోపే వారు ఎక్కాల్సిన ట్రైన్ మిస్సై  పోతుంది.

ఇలాంటి సందర్భాల్లో కొందరు టిక్కెట్లు లేకుండానే రైలు ఎక్కేస్తుంటారు. ఇలా టికెట్ లేకుండా రైలు ఎక్కిన తర్వాత పట్టుబడితే జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. తాజాగా ఇండియన్ రైల్వే ఓ కీలక నిర్ణయం తీసుకున్ననట్లు తెలుస్తోంది. ఇకపై రైలు ఎక్కేటప్పుడు చేతిలో టికెట్ లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన ఎక్స్ హ్యాండిల్‌లో  ఇండియన్ రైల్వేకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నిబంధనలను షేర్ చేసింది. ఆ బ్యూరో షేర్ చేసిన ప్రకారం.. ప్రయాణికులు టిక్కెట్లు కొనుగోలు చేయకుండా రైలు ఎక్కిన ఇబ్బంది ఉండదు.

అయితే అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొత్త రూల్స్ ప్రకారం రైలు లోపల టిక్కెట్లు జారీ చేసే సౌకర్యాన్ని కూడా రైల్వే ప్రారంభించింది. దీని ప్రకారం..టికెట్ లేని ప్రయాణికులు రైల్లో టీటీఈని సంప్రదించవచ్చు. టికెట్ లేకుండా మీరు రైలు ఎక్కిన వెంటనే టీటీఈని సంప్రదించి మీ పరిస్థితిని వారికి తెలియజేయాలి. అప్పుడు మాత్రమే ఇండియన్ రైల్వే రూల్స్  ప్రకారం మీరు టీటీఈ నుంచి టికెట్ పొందవచ్చు.

టీటీఈ వద్ద ఒక హ్యాండ్ హోల్డ్ మెషిన్‌ ఉంటుంది. దాని సాయంతో లోపల ఉన్న టికెట్ లేని ప్రయాణికులకు టీటీఈ  టికెట్ జారీ చేస్తారు. టీటీఈ దగ్గర ఉన్న మిషిన్ రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ సర్వర్‌కు అనుసంధానం చేయబడి ఉంటుంది. ప్రయాణీకులు టిక్కెట్‌ను పొందడానికి మెషిన్‌లో పేరు, వారు దిగాల్సిన స్టేషన్‌ నమోదు చేసిన వెంటనే టికెట్‌ను ఇస్తారు. అదే విధంగా రైలులో అందుబాటులో ఉన్న బెర్త్‌ల గురించిన సమాచారాన్ని ఈ యంత్రం ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.

ఇన్ని అవకాశాలు ఉండి కూడా ఎవరైనా టిక్కెట్లు కొనకపోతే 250 రూపాయల జరిమానా తో పాటు  ప్రయాణికులు రైలు ఎక్కిన ప్రదేశం నుండి దిగే ప్రదేశం వరకు ఉంటే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా యూటీఎస్,  భారతీయ రైల్వే అధికారిక టికెటింగ్ యాప్,  ప్రయాణికుల ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు అవకాశం కూడా ఉంది. మరి.. ఇండియన్ రైల్వే తెచ్చిన ఈ కొత్త రూల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి