విశ్వక్ సేన్ కోసం వచ్చిన పవర్ స్టార్

విశ్వక్ సేన్ కోసం వచ్చిన పవర్ స్టార్

యువ హీరో విశ్వక్ సేన్ వరుస హిట్స్ తో మంచి జోష్ లో ఉన్నాడు. ఓ పక్క వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ మరో పక్క వరుస సినిమాలని ఓకే చేస్తున్నాడు. ఇటీవలే అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. ఇన్నాళ్లు మాస్ ని మెప్పించి ఈ సినిమాతో క్లాస్ ఆడియన్స్ ని కూడా మెప్పించాడు. ప్రస్తుతం విశ్వక్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకుడిగా, ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా విశ్వక్ హీరోగా ఓ సినిమాని ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోస్ లో నిర్వహించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిధిగా విచ్చేశారు. హీరో విశ్వక్, హీరోయిన్ ఐశ్వర్య మీద పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సినిమాకి ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ ఈవెంట్ లో ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ కాసేపు రహస్యంగా మంతనాలు జరిపారు. అలాగే మా ఎలక్షన్ టైంలో విరోధులుగా ఉన్న విష్ణు, ప్రకాష్ రాజ్ కలిసి మాట్లాడుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఇలా చిన్న హీరోల సినిమా ఫంక్షన్లు, చిత్ర కార్యక్రమాలకు హాజరవుతూ సపోర్ట్ చేస్తున్నారు.

 

Show comments