Pavitra Gowda On Darshan Arrest: ఆ విషయం దర్శన్‌కు చెప్పి తప్పు చేశాను.. కన్నీరు పెట్టుకున్న పవిత్ర గౌడ

ఆ విషయం దర్శన్‌కు చెప్పి తప్పు చేశాను.. కన్నీరు పెట్టుకున్న పవిత్ర గౌడ

Darshan: కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అభిమానిని హత్య చేయించాడనే ఆరోపణలపై అరెస్ట్‌ అయ్యాడు. దీనిపై ఆయన ప్రియురాలు పవిత్ర స్పందిస్తూ.. కన్నీరు పెట్టుకుంది. ఆ వివరాలు.

Darshan: కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అభిమానిని హత్య చేయించాడనే ఆరోపణలపై అరెస్ట్‌ అయ్యాడు. దీనిపై ఆయన ప్రియురాలు పవిత్ర స్పందిస్తూ.. కన్నీరు పెట్టుకుంది. ఆ వివరాలు.

అభిమానిని హత్య చేయించాడనే ఆరోపణలపై కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలసిఇందే. ఈ కేసులో ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ దారుణానికి మూల కారకురాలైన నటి, దర్శన్‌ ప్రియురాలు పవిత్ర గౌడ్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. హత్యకు గురైన రేణుకాస్వామి.. పవిత్ర గౌడ మీద సోషల్‌ మీడియా వేదికగా అసభ్యకర కామెంట్స్‌ చేయడంతోనే.. ఈ దారుణం చోటు చేసుకుంది అని పోలీసులు తెలిపారు. తమ అభిమాన హీరో అయిన దర్శన్‌.. పవిత్ర వల్లే భార్యకు, కుటుంబానికి దూరం అయ్యాడని భావించాడు. హీరో మీద అభిమానం కొద్ది.. పవిత్రకు వార్నింగ్‌ మెసేజ్‌లు పెట్టాడు రేణుకాస్వామి. దాంతో ఆగ్రహించిన దర్శన్‌.. రేణుకాస్వామిని కిడ్నాప్‌ చేయించి.. తీవ్రంగా దాడి చేసి హత్య చేయించాడు.

ఇక ఈ ఘటనపై దర్శన్‌ ప్రియురాలు పవిత్ర గౌడ స్పందిస్తూ.. కన్నీరు పెట్టుకుంది. తాను చేసిన పొరపాటు వల్లే ఇంత దారుణం జరిగిందని చెప్పుకొచ్చింది. దీనిపై స్పందిస్తూ పవిత్ర గౌడ ఇలా చెప్పింది ‘‘చిత్రదుర్గకు చెందిన రేణుకస్వామి అనే వ్యక్తి నాకు అసభ్య సందేశాలతో పాటు.. అశ్లీల ఫొటోలను పంపేవాడు. కొన్నాళ్ల పాటు నేను మౌనంగానే ఉన్నాను. వేధింపులు ఎక్కువ కావడంతో.. వీటి గురించి నేను దర్శన్‌కు చెప్పాను. అదే నేను చేసిన తప్పు. రేణుకాస్వామి విషయాన్ని దర్శన్‌కు కాకుండా.. పోలీసులకు చెప్పి ఉంటే ఈ హత్య జరిగేది కాదు.. ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఏం లాభం.. ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో మూడు జీవితాలు నాశనం అయ్యాయి.. అంటున్నారు నెటిజనులు.

దర్శన్‌పై ఆరోపణలు, అరెస్ట్‌ నేపథ్యంలో అతడి కుమారుడు చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. హత్య కేసు ఆరోపణలపై అరెస్టైన తన తండ్రి దర్శన్‌ గురించి ఆయన 15 ఏళ్ల కుమారుడు వినీశా తూగుదీ చేసిన పోస్ట్‌ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ‘‘నా తండ్రిని విమర్శిస్తూ, బూతులు తిడుతున్న వారందరికి ధన్యవాదాలు. నా వయసు కేవలం 15 సంవత్సరాలు.. నేను చాలా చిన్న పిల్లాడిని.. నాకు మనసుంటుంది.. అనే కనికరం కూడా లేకుండా దూషిస్తున్నందుకు మీకు చాలా థాంక్స్‌. ఇలాంటి కష్ట సమయంలో మా అమ్మ విజయలక్ష్మి, నాన్న దర్శన్‌లకు మద్దతు చాలా అవసరం. కానీ మీరు మమల్ని శపిస్తున్నారు. పర్లేదు పోలీసులు దర్యాప్తు పూర్తైతే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండండి’’ అంటూ ఎద్దేవా చేస్తూ ఓ పోస్ట్‌ చేశాడు.

Show comments