iDreamPost
android-app
ios-app

క్షీణించిన పవిత్రగౌడ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు!

Pavitra Gowda Health: కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి హత్య కేసు కన్నడ ఇండస్ట్రీతో పాటు యావత్ దేశం మొత్తం సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు.

Pavitra Gowda Health: కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి హత్య కేసు కన్నడ ఇండస్ట్రీతో పాటు యావత్ దేశం మొత్తం సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు.

క్షీణించిన పవిత్రగౌడ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు!

పవిత్ర గౌడ..గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పేరు.  అందుకు కారణంగా.. కర్ణాటకలో జరిగిన ఓ దారుణమైన హత్య. ఆ హత్య కేసులో ఆమె ప్రధాన నిందితురాలు అని పోలీసులు అదుపులోకి తీసుకున్నరా. కన్నడ స్టార్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. రేణుకా స్వామి అనే తన అభిమానిని దర్శన్ హత్య చేయించాడు. ఈ కేసులో ఇప్పటికే అనేక విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అలానే దర్శన్, పవిత్రగౌడ్ లతో సహా దాదాపు 16 మందిని పోలీసులు అరెస్టు చేసి..విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే పవిత్ర గౌడ గురించి కీలక సమాచారం బయటకు వచ్చింది. పోలీస్ కస్టడిలో ఉన్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి హత్య కేసు కన్నడ ఇండస్ట్రీతో పాటు యావత్ దేశం మొత్తం సంచలనంగా మారింది. ఓ అభిమాని దారుణంగా హత్య చేయడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక రీల్ హీరో కాస్తా రియల్ టైమ్ లో విలన్ గా మారాడు. పవిత్ర గౌడ్ కోసం చేసిన ఈ దారుణానికి దర్శన కెరీర్ ప్రశ్నర్థాకంగా మారిందని పలువురు మేధావులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాక కన్నడ ఇండటస్ట్రీకి చెందిన వారు ఎవ్వరు దర్శన్ కి మద్దతుగా మాట్లాడలేదు. ఇది ఇలా ఉంటే.. ఈ కేసులో దాదాపు 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఏ1గా పవిత్రా గౌడ్ ను, ఏ2గా హీరో దర్శన్ ను పోలీసు కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరు పోలీసుల కస్టడిలో ఉన్నారు. వీరిని కొన్ని రోజుల నుంచి పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడ ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లు సమాచారం. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. కామాక్షిపాళ్య పోలీసుల అదుపులో ఉన్న పవిత్ర గౌడ అస్వస్థతకు గురికావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌కు వైద్యులు వచ్చారు. పవిత్ర గౌడ అస్వస్థతకు గురికావడంతో వైద్యుడిని పోలీసుల పిలిపించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పవిత్రగౌడను మల్లత్తహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. ఇక రేణుకా స్వామి హత్య ఉదంతం వెలుగులోకి రావడంతో పవిత్రగౌడ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో దాదాపు 15కోట్ల విలువైన ఆస్తిపత్రం లభించాయని తెలిసింది. దీంతో పోలీసులు ఆస్తుల కొనుగోలుపై విచారణలో వెనక్కు తగ్గి.. డబ్బు ఎక్కడిది అని ఆరా తీయడం మొదలుపెట్టారని తెలుస్తోంది.