IPL ఫైనల్లో SRH ఓటమికి కమిన్స్‌ చేసిన తప్పే కారణమా? నిపుణులు ఏమంటున్నారంటే?

IPL ఫైనల్లో SRH ఓటమికి కమిన్స్‌ చేసిన తప్పే కారణమా? నిపుణులు ఏమంటున్నారంటే?

Pat Cummins, IPL 2024, SRH vs KKR: కోల్‌కత్తా నైట్‌ రైడర్సతో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి కమిన్స్‌ చేసిన ఒక్క తప్పు కారణం అంటూ వాదనలు వినిపిస్తున్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

Pat Cummins, IPL 2024, SRH vs KKR: కోల్‌కత్తా నైట్‌ రైడర్సతో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి కమిన్స్‌ చేసిన ఒక్క తప్పు కారణం అంటూ వాదనలు వినిపిస్తున్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

తెలుగు క్రికెట్‌ అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి.. కావ్య పాప కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. చివరికి నిరాశే మిగిలింది. సీజన్‌ ఆరంభం నుంచి దుమ్మురేపుతూ వచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు.. ఫైనల్లో మాత్రం పసికూన జట్టు కంటే దారుణంగా ఆడింది. బ్యాటింగ్‌ చేయడం ఇదే ఫస్ట్‌ టైమ్‌ అన్నట్లు.. బౌలింగ్‌ ఎలా చేయాలో కూడా తెలియదన్నట్లు ఆడింది. చెన్నైలోని చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో వేదికగా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన ప్రతిష్టాత్మక ఫైనల్‌ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఏకంగా 8 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. అయితే.. ఈ ఓటమికి ఆ జట్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ తీసుకున్న ఒక్క నిర్ణయం వల్లే సన్‌రైజర్స్‌కు కప్పు దూరమై​ందని కొంతమంది క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి వారి వాదన ఏంటో? దానిపై క్రికెట్‌ పండితులు, నిపుణులు ఎలా రియాక్ట్‌ అవుతున్నారో ఇప్పుడు చూద్దాం..

ఫైనల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి కొంతమంది క్రికెట్‌ అభిమానులు చెబుతున్న కారణం ఏంటంటే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ తీసుకోవడమే అని అంటున్నారు. కమిన్స్‌ చేసిన ఈ తప్పు వల్లే సన్‌రైజర్స్‌ ఓడిపోయిందని అంటున్నారు. ఇదే పిచ్‌పై సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ మధ్య క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్లో ఆర్‌ఆర్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ టాస్‌ గెలిచి.. తొలుత బౌలింగ్‌ తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌ సమయంలో డ్యూ(తేమ) వస్తుందని అంచనా వేశాడు. లక్కీగా ఆ రోజు డ్యూ రాకపోవడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి.. 174 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోవగలిగింది. ఇప్పుడు కూడా అదే సీన్‌ రిపీట్‌ చేద్దాం అనుకున్నాడు కమిన్స్‌. అదే అతను చేసిన తప్పు అయిపోయింది.

శుక్రవారం ఇదే పిచ్‌, ఇదే గ్రౌండ్‌లో రెండో ఇన్నింగ్స్‌ సమయంలో డ్యూ రాలేదు. కానీ, ఆదివారం మాత్రం డ్యూ వచ్చింది. పైగా సన్‌రైజర్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి దారుణంగా విఫలమైంది. కేవలం 113 పరుగులు చేసింది. ఈ స్వల్ప టార్గెట్‌ను డ్యూ ఉండటంతో కేకేఆర్‌ మరింత ఈజీగా ఊదిపారేసిందని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. అయితే.. కమిన్స్‌ తీసుకున్న నిర్ణయాన్ని క్రికెట్‌ నిపుణులు సమర్థిస్తున్నారు. ఎందుకంటే.. చెన్నై పిచ్‌పై ఛేజింగ్‌ అంత ఈజీ కాదని, కానీ, సన్‌రైజర్స్‌ బ్యాటర్ల విఫలమై.. మరీ చాలా తక్కువ స్కోర్‌ చేయడంతోనే ఎస్‌ఆర్‌హెచ్‌ ఓడిపోయిందని స్పష్టం చేశారు. ఈ మ్యాచ్‌లో ఓటమికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్ల వైఫల్యం కారణం అని.. అంతేకానీ, కమిన్స్‌ తీసుకున్న నిర్ణయం సరైందే అని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments