క్వాలిఫైయర్‌-1లో SRH చిత్తుగా ఓడినా.. ఫుల్‌ హ్యాపీగా ఉన్న కమిన్స్‌! ఎందుకో తెలుసా?

క్వాలిఫైయర్‌-1లో SRH చిత్తుగా ఓడినా.. ఫుల్‌ హ్యాపీగా ఉన్న కమిన్స్‌! ఎందుకో తెలుసా?

KKR vs SRH, IPL 2024, Pat Cummins: తొలి క్వాలిఫైయర్‌లో కేకేఆర్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడిపోయినా.. ఆ జట్టు కెప్టెన్‌ కమిన్స్‌ పిచ్చ హ్యాపీగా ఉన్నట్లు ఫ్యాన్స్‌ అంటున్నారు. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

KKR vs SRH, IPL 2024, Pat Cummins: తొలి క్వాలిఫైయర్‌లో కేకేఆర్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడిపోయినా.. ఆ జట్టు కెప్టెన్‌ కమిన్స్‌ పిచ్చ హ్యాపీగా ఉన్నట్లు ఫ్యాన్స్‌ అంటున్నారు. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన తొలి క్వాలిఫైయర్‌లో సన్‌రైజర్స్‌ ఓటమి పాలైంది. మంగళవారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో ఎస్‌ఆర్‌హెచ్‌ క్వాలిఫైయర్‌-2 ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్సీబీ, ఆర్‌ఆర్‌ మధ్య జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ నెల 24న క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌ ఆడనుంది. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయం సాధించిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఫైనల్స్‌కు చేరిపోయింది. అయితే.. క్వాలిఫైయర్‌-1లో కేకేఆర్‌తో చిత్తుగా ఓడిపోయినా కూడా సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఫుల్‌ హ్యాపీగానే ఉన్నాడంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి.

తన టీమ్‌ ఓడిపోతే.. కమిన్స్‌ ఎందుకు హ్యాపీగా ఉంటాడని మీకు డౌట్‌ రావొచ్చు కానీ, దానికి రీజన్‌ వేరే ఉంది. అదేంటంటే.. కేకేఆర్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో కేకేఆర్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ సూపర్‌ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి.. ఎస్‌ఆర్‌హెచ్‌ను చావుదెబ్బ కొట్టాడు. ముఖ్యంగా ట్రావిస్‌ హెడ్‌ను డకౌట్‌ చేసి.. సన్‌రైజర్స్‌ను కొలుకోలేని విధంగా చేశాడు. ఆ తర్వాత మరో రెండు వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై, బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించే సన్‌రైజర్స్‌ను కేవలం 159 పరుగులకే పరిమితం అయిందంటే.. అందుకు మిచెల్‌ స్టార్క్‌ ప్రధాన కారణం. ఈ సీజన్‌లో స్టార్క్‌ పెద్దగా ఫామ్‌లో లేడు.

ప్లే ఆఫ్స్‌కి ముందు కేవలం ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో చెలరేగాడు. అంతకు ముందు భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఎక్స్‌పెన్సీవ్‌ బౌలర్‌గా మారాడు. దీంతో.. ఇతనికి 24.75 కోట్ల భారీ ధర దండగ అంటూ దారుణమైన ట్రోల్స్‌ వచ్చాయి. అయితే.. కేకేఆర్‌ జట్టు స్టార్క్‌పై గట్టి నమ్మకం ఉంచింది. ఆ నమ్మకాన్ని క్వాలిఫైయర్‌-1లో నిలబెట్టుకున్నాడు స్టార్క్‌. ఎస్‌ఆర్‌హెచ్‌పై 3 వికెట్లతో చెలరేగాడు. ఇలా స్టార్క్‌ ఫామ్‌లోకి రావడంతో కేకేఆర్‌తో పాటు ప్యాట్‌ కమిన్స్‌ కూడా సూపర్‌ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే.. ఈ ఐపీఎల్‌ ముగిసిన తర్వాత జూన్‌ 2ను ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ప్రారంభం కానుంది. స్టార్క్‌ ఆస్ట్రేలియాకు ఎంతో కీలకమైన బౌలర్‌. ఎన్ని ఫ్రాంచైజ్‌ టీమ్‌లకు ఆడినా.. కమిన్స్‌ దృష్టి ఆసీస్‌కు కప్పులు అందించడంపైనే ఉంటుంది. అందుకే ఆసీస్‌కు ఎంతో ముఖ్యమైన బౌలర్‌ ఫామ్‌లోకి రావడంతో.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓడిపోయినా హ్యాపీగా ఉన్నాడని కొంత మంది క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. పైగా క్వాలిఫైయర్-2తో ఎస్‌ఆర్‌హెచ్‌కు మరో ఛాన్స్‌ ఉంది ఫైనల్స్‌ చేరేందుకు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments