OTT Suggestions- Best Colleage Drama: OTTలో క్రేజీ కాలేజ్ డ్రామా.. ప్రియుడు మోసం చేస్తే.. మరొకరి లైఫ్ తో ఆడేసుకుంది!

OTTలో క్రేజీ కాలేజ్ డ్రామా.. ప్రియుడు మోసం చేస్తే.. మరొకరి లైఫ్ తో ఆడేసుకుంది!

OTT Suggestions- Crazy College Drama: మీరు ఓటీటీలో ఇలాంటి సినిమా అయితే చూసుండరు. ఎంతో బుద్ధి మంతుడిని ఒక అమ్మాయి ఏకంగా అర్జున్ రెడ్డిలా మార్చేస్తుంది. అసలు ఆ కథ ఏంటి? ఎందుకు అలా జరిగింది తెలియాలి అంటే ఈ మూవీ చూడాల్సిందే.

OTT Suggestions- Crazy College Drama: మీరు ఓటీటీలో ఇలాంటి సినిమా అయితే చూసుండరు. ఎంతో బుద్ధి మంతుడిని ఒక అమ్మాయి ఏకంగా అర్జున్ రెడ్డిలా మార్చేస్తుంది. అసలు ఆ కథ ఏంటి? ఎందుకు అలా జరిగింది తెలియాలి అంటే ఈ మూవీ చూడాల్సిందే.

ఓటీటీలో మీరు ఇప్పటివరకు చాలా తెలుగు సినిమాలు చూసుంటారు. వాటిలో మీకు బాగా నచ్చినవి కూడా ఉంటాయి. కొన్ని మాత్రం అరె ఎందుకు చూశాంరా అనిపించేలా ఉంటాయి. అయితే ఈ మూవీ మాత్రం మీకు భలే నచ్చేస్తుంది. ముఖ్యంగా ఇప్పటి యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం బయట కాలేజ్ లో ఎలాంటి ప్రేమలు ఉన్నాయి. లవ్ లో ఫెయిలైతే ఏం చేస్తున్నారు? ఆ అబ్బాయిని పడేస్తాను.. ఈ అబ్బాయిని పడేస్తాను అంటూ ఎలా బెట్టులు కాస్తున్నారు. అలాంటి పాయింట్స్ ఈ మూవీలో బాగా ఉంటాయి. అందుకే ఇది హాలీవుడ్ మూవీ అయినా కూడా తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు.

మీరు చూసే సినిమాలు దాదాపుగా రియల్ లైఫ్ నుంచి ఇన్ స్పైర్ అయిన కథలే ఉంటాయి. అలాగే ఈ మూవీ కూడా దాదాపుగా రియల్ లైఫ్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు? వారు చేసే యాక్టింగ్, చేసే డేటింగ్, ఒకరితో ఒకరు పెట్టుకునే బెట్టింగ్ ఇలా చాలానే విషయాలను మోస్ట్ ఎంగేజింగ్ వేలో చూపించారు. ముఖ్యంగా అమ్మాయి- అబ్బాయి మధ్య ఉండే ప్రేమ, ఆకర్షణ, ఇన్ ఫ్యాక్చువేషన్ ను ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఒక అబ్బాయి మోసం చేస్తే.. ఎవరైనా బాధ పడతారు. కానీ, ఈ మూవీలో హీరోయిన్ మాత్రం ఇంకో బాయ్ ఫ్రెండ్ ని హీరో చేయాలి అని కంకణం కట్టుకుంటుంది. అందుకోసం తన ఫ్రెండ్ తో బెట్ కూడా వేస్తుంది.

విషయం ఏంటంటే.. హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ని ఒక పెద్ద స్టార్ సింగర్ ని చేస్తుంది. కానీ, అతను మాత్రం ఈమెను మోసం చేస్తాడు. ఆ విషయం తెలిసిన తర్వాత హీరోయిన్ చాలా బాధ పడుతుంది. అయితే తనని నేనే హీరో చేశాను.. నేను తల్చుకుంటే ఇంకొకరిని కూడా హీరోని చేస్తాను అంటుంది. అనుకున్నదే తడవుగా కాలేజ్ లో ఎంతో సింపుల్ గా.. సోషల్ లైఫ్ కి దూరంగా ఉండే ఒక కుర్రాడిని సెలక్ట్ చేసుకుంటుంది. అతడి వాలకం మొత్తం మార్చేస్తుంది. అతడిని ముందు చెప్పినట్లుగా ఒక హీరోగా తయారు చేస్తుంది. అయితే ఆ బెట్టింగ్ విషయం మాత్రం ఈ కుర్రాడికి తెలియదు. ఆ విషయం తెలిసిన తర్వాత ఆమెను ఛీ అంటాడు. అయితే ఆ బెట్టింగ్ వల్ల అతని జీవితం ఎలా మారింది? ఒక మంచి కుర్రాడు ఎలా మారిపోయాడు అనేదే కథ.

ఈ తరహా లైన్ మీకు తెలుగులో ‘బస్ స్టాప్ మూవీ’లో కనిపిస్తుంది. హీరోయిన్ ఆనంది.. క్లాస్ టాపర్ ని ప్రేమ పేరుతో పిచ్చోడిని చేస్తుంది. ఆ తర్వాత అతని జీవితమే నాశనం అవుతుంది. అయితే ఇక్కడ హీరో జీవితం నాశనం కాకపోవచ్చు. కానీ, ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని మాత్రం కాస్త వైలెంట్ గానే మార్చేస్తుంది. ఈ మూవీ పేరు ‘హీ ఈజ్ ఆల్ అబౌట్’. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. నిజానికి ఈ మూవీ రెండేళ్ల క్రితం నుంచే అందుబాటులో ఉంది. కానీ, చాలా మందికి ఈ మూవీ గురించి తెలియదు. కానీ, ఒక మంచి పాయింట్ తో తెరకెక్కించిన చిత్రం. కాలేజ్ విదేశాల్లో ఉండేది అయినా కూడా.. ఇక్కడి వాళ్లు కూడా బాగా కనెక్ట్ అవుతారు.

Show comments