OTT Suggestions- Best Crime Thriller: OTTలో లవర్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఒక్కో ట్విస్టుకి బుర్ర గిర్రున తిరుగుతుంది!

OTTలో లవర్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఒక్కో ట్విస్టుకి బుర్ర గిర్రున తిరుగుతుంది!

OTT Suggestions- Best Couple Crime Thriller: ఓటీటీలో మీరు చాలా క్రైమ్ థ్రిల్లర్ చూసే ఉంటారు. అయితే ఇది మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా కూడా ఉంటుంది. ఇద్దరు లవర్స్ చేసే ఒక క్రైమ్ అడ్వంచర్ ఇది.

OTT Suggestions- Best Couple Crime Thriller: ఓటీటీలో మీరు చాలా క్రైమ్ థ్రిల్లర్ చూసే ఉంటారు. అయితే ఇది మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా కూడా ఉంటుంది. ఇద్దరు లవర్స్ చేసే ఒక క్రైమ్ అడ్వంచర్ ఇది.

మీరు ఇప్పటివరకు చాలా అంటే చాలా క్రైమ్ సినిమాలు చూసుంటారు. వాటిలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఉండి ఉంటాయి. కానీ, ఇది మాత్రం కచ్చితంగా చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది నిజంగానే స్పెషల్ కాబట్టి. మీరు క్రైమ్ లో కూడా సినిమాలు చూసుంటారు. దొంగతనం, హైజాక్ బ్యాగ్రౌండ్ లో కూడా సినిమాలు చూసుంటారు. అయితే ఈ మూవీ మాత్రం క్రైమ్ మూవీస్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఎందుకంటే ఈ మూవీలో అలాంటి ఒక స్టోరీ లైన్, అలాంటి ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి కాబట్టి. ఇది క్రైమ్ సినిమాల కేటగిరీలో ఒక డిఫరెంట్ ఫీల్ ని ఇస్తుంది. అలాగే ఇందులో నెక్ట్స్ లెవల్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది.

మీరు ఇప్పటివరకు తెలుగులో చూసిన ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఏమైనా ఉన్నాయా అంటే చాలా తక్కువ పేర్లు చెప్తారు. కానీ, ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం మీరు ఈ సినిమా పేరు కచ్చితంగా చెప్తారు. ఇందులో కొత్త కొత్త పాయింట్లు, భారీ ట్విస్టులు ఉంటాయి. ముఖ్యంగా ఇద్దరు లవర్స్ కలిసి ప్లాన్ చేసిన ఒక భారీ దొంగతనం మిమ్మల్ని మంత్రముగ్దులను చేస్తుంది. నిజానికి ఇలాంటి ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ని మీరు చూసి చాలా రోజులు అయ్యి ఉంటుంది. పైగా ఇది బాలీవుడ్ మూవీ కాబట్టి మీకు ఇంకా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా ఇందులో చేసిన నటీనటుల యాక్టింగ్ కి మీరు ఫిదా అయిపోతారు.

ఈ మూవీ కథ ఏంటంటే.. యామీ గౌతమ్- సన్నీ కౌశల్ ప్రేమలో పడతారు. వాళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటారు. కానీ, అనుకోని సంఘటన వల్ల యామీ గౌతమ్ కు పుట్టబోయే బిడ్డ చనిపోతుంది. ఆ తర్వాత కౌశల్ కు అప్పుల బాధ పెరుగుతుంది. ఒక్క దొంగతనంతో లైఫ్ సెట్ చేసుకోవాలి అనుకుంటారు. అందుకోసం రూ.20 కోట్ల విలువైన వజ్రాలు కొట్టేయాలని స్కెచ్ వేస్తారు. అందుకు విమానంలో ఒక భారీ స్కెచ్ ప్రిపేర్ చేస్తారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతోంది అనుకునే సమయంలో ఊహించని ట్విస్ట్ ఒకటి ఎదురవుతుంది. వాళ్లు ట్రావెల్ చేస్తున్న విమానాన్ని హైజాక్ చేస్తారు. కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. సన్నీ కౌశల్ పై దాడి చేస్తారు.

సన్నీ కౌశల్ పోలీసులకు కూడా చిక్కుతాడు. కథ వెనుక కథ ఉందని పోలీలులు తెలుసుకుంటారు. కానీ, ఆ కథ ఏంటో తెలుసుకోలేరు. కథ మొత్తం చెప్పేశాను అని కంగారు పడకండి. ఇప్పటివరకు మీకు చెప్పింది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు కథ ఇంకా మిగిలే ఉంది. భారీ నుంచి అతి భారీ ట్విస్టులు, సీన్ సీన్ కి ఆడియన్స్ బుర్ర గిర్రున తిరుగుతుంది. అంతేకాకుండా పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా ఆసక్తిగా సాగుతుంది. మొత్తానికి క్రైమ్ చేయాలి అని స్టార్ట్ చేసిన వారి ప్రయత్నం వారి జీవితాలను ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఈ మూవీ పేరు ‘చోర్ నికాల్ కే భాగా’. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పాన్ ఇండియా లెవల్లో ఎంతో మందికి ఈ మూవీ విపరీతంగా నచ్చింది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి.

Show comments