OTT Suggestions- Best Watch Alone Movie Sharp Stick: పెళ్లైన మగాడితో ప్రేమ.. అతను మోసం చేశాడు అని.. OTTలో ఓ రేంజ్ మూవీ!

పెళ్లైన మగాడితో ప్రేమ.. అతను మోసం చేశాడు అని.. OTTలో ఓ రేంజ్ మూవీ!

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీలో మీరు చాలానే సినిమాలు చూస్తు ఉంటారు. కానీ, కొన్ని సినిమాల్లో మాత్రం మంచి మెసేజ్ ఉంటుంది. ఈ సినిమా కూడా అలాంటిదే. అయితే ఈ సినిమాని ఒంటరిగా మాత్రమే చూడాలి మరి.

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీలో మీరు చాలానే సినిమాలు చూస్తు ఉంటారు. కానీ, కొన్ని సినిమాల్లో మాత్రం మంచి మెసేజ్ ఉంటుంది. ఈ సినిమా కూడా అలాంటిదే. అయితే ఈ సినిమాని ఒంటరిగా మాత్రమే చూడాలి మరి.

ఈ మధ్యకాలంలో మీరు చాలా అంటే చాలా ఎక్కువగా అక్రమ సంబంధాల గురించి వింటూనే ఉండి ఉంటారు. పెళ్లైన తర్వాత భర్త మరొక మహిళతో సంబంధం పెట్టుకోవడం. అటు భార్య ఇంకో మగాడితో ఉండటం. ఇలాంటి సంబంధాల కారణంగా పచ్చని కాపురాలు బుగ్గిపాలు కావడం చూస్తూనే ఉన్నాం. అలాగే తమని నమ్మి వచ్చిన వారికి ద్రోహం చేయడం కూడా చూసే ఉంటారు. ఇవన్నీ జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం వ్యామోహం, కోరికల కారణంగానే ఇలాంటి పనులు చేస్తున్నారు. అలాంటి ఒక సాలిడ్ పాయింట్ తో ఓటీటీలో ఒక సినిమా ఉంది.

ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ చిత్రం కచ్చితంగా ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉంటుంది. భార్యలను మోసం చేసే భర్తలు.. కాపురాల్లో చిచ్చు పెట్టే యువతులు ఇప్పుడు బాగా పెరిగిపోయారు. అయితే అలాంటి రిలేషన్స్ వల్ల కచ్చితంగా లేని పోని కష్టాలు వస్తాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి ఒక చట్రంలోకి ఒక యువతి అడుగు పెడుతుంది. ఎప్పటి నుంచో తనలో ఉన్న కా*మ వాంఛలను తీర్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. అయితే ఆమె వేసిన గాలానికి యువకుడు కాకుండా పెళ్లైన మగాడు దొరుకుతాడు. అతను కూడా కట్టుకున్న భార్యను.. అది కూడా గర్భవతిని కాదని ఈ యువతి చుట్టూ తిరుగుతూ ఉంటాడు.

కొన్నాళ్లు వీళ్ల మధ్య బంధం బాగానే సాగుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత అసలు విషయం భార్యకు తెలియడంతో వారి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. నిండు గర్భిణి కావడంతో ఆ భర్త కూడా ప్రియురాలిని కాదని.. భార్యతోనే ఉంటానని మాటిస్తాడు. పైగా ఆ యువతిని తన జీవితం లోనుంచి వెళ్లిపోవాలని కోరతాడు. ఇంకేముంది.. ఆ యువతి జీవితం మళ్లీ మొదటికి వస్తుంది. అయితే ఈసారి తనకు, తనలో దాగి ఉన్న వాంఛలకు ఇలాంటి పరాభవం ఎదురుకాకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటుంది. పొట్టి బట్టలు వేసుకుని ఫొటో షూట్లు చేసి తన ఫొటోలను ఆన్ లైన్ లో పెట్టడం స్టార్ట్ చేస్తుంది.

అక్కడి నుంచి తన కోరికలు తీరడం మాత్రమే కాకుండా.. తనకి కొత్త కష్టాలు కూడా వస్తాయి. ఆ తర్వాత ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అసలు ఆమె తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? తెలిసీ తెలియని వయసులో తీసుకునే నిర్ణయాలు మన జీవితం మీద ఎంత ప్రభావం చూపుతాయి అనే విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ మూవీలో కాస్త ఘాటు సన్నివేశాలు ఉన్నా కూడా.. మంచి మెసేజ్ ఉంటుంది. ఎంత మంచి మెసేజ్ ఉన్నా కూడా ఈ మూవీని ఇంటిల్లిపాది కలిసి కూర్చుని మాత్రం చూడలేరు. అందుకే కాస్త ఒంటరిగా చూస్తే బాగుంటుంది. ఈ చిత్రం పేరు ‘షార్ప్ స్టిక్’. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని చూడాలి అంటే రూ.69 చెల్లించాల్సి ఉంటుంది.

Show comments