OTT Suggestions- Best SCi-Fi Film: చేతిలో మనుషుల ప్రాణాలు.. OTTలో ఈ మూవీకి టెక్నాలజీ అంటే బెదిరిపోతారు!

AI చేతిలో మనుషుల ప్రాణాలు.. OTTలో ఈ మూవీకి టెక్నాలజీ అంటే బెదిరిపోతారు!

OTT Suggestions- Best SCi-Fi Film: ఓటీటీలో మీరు సైంటిఫిక్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్స్ చూస్తూ ఉంటారా? అయితే ఈ మూవీని ఒకసారి చూసేయండి. ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటే కాస్త కంగారు కూడా పుడుతుంది.

OTT Suggestions- Best SCi-Fi Film: ఓటీటీలో మీరు సైంటిఫిక్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్స్ చూస్తూ ఉంటారా? అయితే ఈ మూవీని ఒకసారి చూసేయండి. ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటే కాస్త కంగారు కూడా పుడుతుంది.

చాలామందికి సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్స్ చూడాలి అంటే ఆసక్తిగా ఉంటుంది. అయితే ఇలాంటి సినిమాలు దాదాపుగా హాలీవుడ్ నుంచే వస్తూ ఉంటాయి. అలాంటి ఒక అలవాటు మీకుంటే మీకోసం ఒక ది బెస్ట్ సైంటిఫిక్ ఫిల్మ్ తీసుకొచ్చాం. ఇది మొత్తం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మీదే ఉంటుంది. నిజానికి ఇప్పుడు ఏఐ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. కానీ, ఎప్పుడో ఈ టెక్నాలజీకి సంబంధించి అదిరిపోయే ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. కాకపోతే ఇంగ్లీష్ కదా అని చాలా మంది దీనిని పట్టించుకోవలేదు. ఇప్పుడు సైంటిఫిక్ ఫిక్షన్స్ అంటా డిమాండ్ పెరగడంతో ఈ మూవీ పేరు కూడా చాలామందికి సజీషన్ వస్తోంది.

మీకు నిజంగా సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టమైతే మాత్రం ఈ మూవీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ ప్రోగ్రామ్ గురించి జరుగుతూ ఉంటుంది. ఒక బెస్ట్ సైంటిస్ట్ ఒక ది బెస్ట్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రోగ్రామ్ ను తయారు చేస్తాడు. దానికి మనుషులు ఎలా ఉంటారు? ఎలా ఆలోచిస్తారు? ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలకు సంబంధించి నేర్పించాలి అనుకుంటాడు. అందుకోసం ఎవరినీ వాలంటీర్ గా కాకుండా.. కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు. అలా కొంతమంది అమ్మాయిలను తీసుకొస్తాడు. వారిలో హీరోయిన్ కూడా ఉంటుంది.

బతుకు తెరువు కోసం హీరోయిన్ తన వేషం మార్చుకుని పడు*పు వృత్తిలో ఉంటూ ఉంటుంది. అలాంటి ఆమెను ఒకరోజు రాత్రి ఎత్తుకుపోతారు. ఆమెకు మొత్తం విషయం చెప్తాడు. కానీ, అందుకు ఆమె అంగీకరించదు. ఆ ఏఐకి నేర్పించడం కోసం ఈమె కొన్ని టాస్కులు చేయాల్సి ఉంటుంది. కానీ, అందుకు అంగీకరించకపోవడంతో.. ఒక స్మార్ట్ హౌస్ లో బందిస్తాడు. ఆ ఇల్లు మొత్తం ఆ బెస్ట్ ఏఐ సిస్టమ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ యువతి గనుక ఇంట్లో నుంచి తప్పించుకోవాలి అని ప్రయత్నిస్తే మాత్రం ఆమెను పనిష్ చేయాలి అని కమాండ్స్ ఇచ్చి సైంటిస్ట్ వెళ్లిపోతాడు.

ఆ యువతిని ఇంట్లో బందించిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఆ యువతి తప్పించుకోవాలి అని ప్రయత్నించిన ప్రతిసారి ఆ ఏఐ ప్రోగ్రామ్ హింసిస్తూనే ఉంటుంది. వీళ్లను చూసి ఆ ప్రోగ్రామ్ కూడా కోపం అనే ఎమోషన్ ను నేర్చుకుంటుంది. ఈ మూవీలో ప్రతి సీన్ మీకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఎందుకంటే 2018లోనే ఈ రేంజ్ మూవీ తీశారా అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అప్పటికి ఇంకా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అంటే ప్రపంచానికి పూర్తిగా తెలియదు. మరి.. ఈ సినిమా ఏదో తెలుసుకోవాలి అని ఉందా? ఈ మూవీ పేరు ‘TAU’. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ మీరు చూసింటే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments