OTT Suggestions- Best Revenge Love Story: ప్రియుడిపై పగతో.. మరొకడితో పడక పంచుకుని.. OTTలో ఓ రేంజ్ థ్రిల్లర్!

ప్రియుడిపై పగతో.. మరొకడితో పడక పంచుకుని.. OTTలో ఓ రేంజ్ థ్రిల్లర్!

OTT Suggestions- Best Revenge Love Story: మీరు బెస్ట్ ప్రేమ కథలు చూసుంటారు. కానీ, ఇది ఒక వింత ప్రేమ కథ. కాదు కాదు ఒక వింత రివేంజ్ ప్రేమకథ. ఈ వింత కథ ఓటీటీలోనే ఉంది.

OTT Suggestions- Best Revenge Love Story: మీరు బెస్ట్ ప్రేమ కథలు చూసుంటారు. కానీ, ఇది ఒక వింత ప్రేమ కథ. కాదు కాదు ఒక వింత రివేంజ్ ప్రేమకథ. ఈ వింత కథ ఓటీటీలోనే ఉంది.

ఓటీటీలో అన్ని రకాల మూవీస్ ఉంటాయి. అన్నీ రకాలు అంటే వాటిలో బో*ల్డ్ మూవీస్ కూడా ఉంటాయి. ఆ కేటగిరీ ఉందని దాదాపుగా అందరికీ తెలుసు. కానీ, చాలా మంది దాని జోలికి పోరు. ఎందుకంటే ఆ కేటగిరీలో ఏ మూవీ ఎలా ఉంటుందో? అసలు ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకోవడం అనే కోణంలో లైట్ తీసుకుంటారు. కానీ, అలాంటి మూవీస్ లో కూడా మంచి స్టోరీ ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. కాకపోతే అవి తెలియక చూడటం లేదు. ఇప్పుడు మేము చెప్పబోయే సినిమా ఒక మంచి లవ్ స్టోరీ. కాకపోతే వన్ సైడ్ లైవ్. ఆ అమ్మాయి ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ, అతను మాత్రం మోసం చేస్తాడు. అసలు ఆ సినిమా ఏది? అది ఎందుకు అంత స్పెషలో చూద్దాం.

ఏ సినిమాని తక్కువ అంచనా వేయకూడదు. ఏ కేటగిరీని తీసిపారేయకూడదు. ఎందుకంటే ఎలాంటి సినిమా తీసినా.. వాళ్లు క్రియేటివ్ పీపుల్, బెస్ట్ టెక్నీషియన్స్. అలాంటి సినిమాల్లో కూడా ది బెస్ట్ స్టోరీ, నరేషన్ ఉన్న మూవీస్ చాలానే ఉన్నాయి. అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిందే ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ. ఇదొక రివేంజ్ లవ్ స్టోరీ. అంటే హీరోయిన్ ఒక వ్యక్తిని లవ్ చేస్తుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. కానీ, అతని అసలు రూపం చాలా లేటుగా తెలుస్తుంది. సరిగ్గా పెళ్లిరోజు అందరి సమక్షంలో ఆ ప్రియుడి నిజ స్వరూపం బయటపడుతుంది. గుండె బద్దలు అయిన ఆ యువతి సంచలన నిర్ణయం తీసుకుంటుంది.

ప్రేమలో విఫలమైతే ఎవరైనా సరే డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. లైఫ్ అంతా కోల్పోయాం అన్నట్లు కూర్చుంటారు. కానీ, ఆ యువతి మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తుంది. తన లైఫ్ లో ఒక కొత్త అడ్వెంచర్ కొనసాగించాలని నిర్ణయానికి వస్తుంది. అలాంటి సమయంలో ఆమెకు మరొక వ్యక్తి పరిచయం అవుతాడు. అతనితో తన లైఫ్ ని కొంతకాలం లీడ్ చేస్తుంది. ఒక కొత్త పాత్ లోకి తాను అడుగుపెడుతుంది. వాళ్లిద్దరు శారీ*రకంగా కూడా దగ్గరవుతారు. అలాంటి సమయంలో ఆమెను మోసం చేసిన వ్యక్తి మళ్లీ లైఫ్ లో తారస పడతాడు.

అలాంటి సమయంలో ఆమె లైఫ్ ఎన్ని మలుపులు తిరిగింది? మొదటి ప్రియుడు ఎందుకు అసలు ఆమెను మోసం చేశాడు? రెండోసారి ఇష్టపడిన వాడు నిజంగానే ఆమెను ప్రేమించాడా? లేక ఆమె మీద మోహంతోనే దగ్గరయ్యాడా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ పేరు ‘బర్నింగ్ బిట్రేయల్’. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కొంచం బో*ల్డ్ గా ఉంటుంది. ఒంటరిగా చూసే ప్రయత్నం చేస్తే బెటర్.

Show comments