OTT Suggestions- Do Aur Do Pyaar Movie On Hotstar: భర్తను భార్య చీటింగ్.. భార్యను భర్త చీటింగ్.. OTTలో ఈ మూవీకి నోరెళ్లబెడతారు!

భర్తను భార్య చీటింగ్.. భార్యను భర్త చీటింగ్.. OTTలో ఈ మూవీకి నోరెళ్లబెడతారు!

OTT Suggestions- Best Couple Drama: ఓటీటీల్లో కొన్ని మూవీస్ మాత్రం తప్పకుండా చూడాల్సినవి ఉంటాయి. వాటిలో ఈ మూవీ కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పెళ్లైన జంటలు, ఎప్పుడూ గిల్లిగజ్జాలు ఆడుకునే జంటలు కచ్చితంగా ఈ సినిమాని చూడాల్సిందే.

OTT Suggestions- Best Couple Drama: ఓటీటీల్లో కొన్ని మూవీస్ మాత్రం తప్పకుండా చూడాల్సినవి ఉంటాయి. వాటిలో ఈ మూవీ కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పెళ్లైన జంటలు, ఎప్పుడూ గిల్లిగజ్జాలు ఆడుకునే జంటలు కచ్చితంగా ఈ సినిమాని చూడాల్సిందే.

ప్రస్తుతం సమాజంలో కొన్ని వార్తలు కాస్త కంగారు పెట్టిస్తూ ఉంటాయి. అదేంటంటే.. సక్రమం కాని సంబంధాలు. అంటే ఒకరిని వివాహం చేసుకుని పరాయి వారితో పరాచకాలు ఆడటం అనమాట. ఆ పరాచకాలు కాస్త హద్దులు దాటి హత్యలు దాకా వెళ్తున్నాయి. ఇవన్నీ మనం నేటి సమాజంలో చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న గొడవల కారణంగా కట్టుకున్న వారిని కాదని.. పరాయి వారితో ప*క్క పంచుకోవడానికి రెడీ అయిపోతున్నారు. అలాంటి పరిస్థితులను ఎత్తి చూపుతూ బాలీవుడ్ నుంచి ఒక క్రేజీ సినిమా విడుదలైంది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో హల్చల్ చేస్తోంది. అసలు ఆ మూవీ ఏంటి? ఆ కథ ఏంటో చూద్దాం.

కాపురం అన్న తర్వాత చిన్న చిన్న కలతలు, గొడవలు ఉండటం సర్వ సాధారణం. అయితే వాటిని ఎంత త్వరగా తీర్చుకుంటే అంత మంచి. కానీ, కొంతమంది మాత్రం ఈగోకి పోయి పార్టనర్ ని దూరంపెడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలోనే పరాయి వారిపైకి చూపు వెళ్తూ ఉంటుంది. అదే ఈ సినిమాలో కూడా జరుగుతుంది. విద్యా బాలన్- ప్రతీక్ గాంధీ భార్యాభర్తలుగా ఉంటారు. అయితే వారి కాపురంలో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలోనే వారి ఇద్దరి లైఫ్ లోకి మరో ఇద్దరు వస్తారు. విద్యా బాలన్ కు సెంధిల్ రామమూర్తితో సంబంధం స్టార్ట్ అవుతుంది.

మరోవైపు ప్రతీక్ గాంధీ- ఇలియానాకు సంబంధం స్టార్ట్ అవుతుంది. ఇంకేముంది.. ఇద్దరూ ఇద్దరితో రిలేషన్ లోకి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఆ కథ చాలా దూరం వెళ్తుంది. ఈ భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్లుగానే ఉంటారు. వారి మధ్య కనీసం మాటలు కూడా ఉండవు. కానీ, కొత్తగా వచ్చిన పార్టనర్స్ తో మాత్రం తెగ పులిహోర కలిపేస్తూ ఉంటారు. ప్రతీక్ గాంధీ అయితే నాలుగు అడుగులు స్పీడ్ గా వేసేసి తల్లిని కూడా చేస్తాడు. అలా సాగుతున్న వారి జీవితంలో విద్యా బాలన్- ప్రతీక్ గాంధీ ఒకరోజు డేట్ నైట్ కి వెళ్తారు. ఆ తర్వతా వారి మధ్య కొత్త బంధం మొదలవుతుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను బయటపెడతారు.

అప్పటి నుంచే వారికి అసలు కష్టాలు మొదలవుతాయి. అదేంటంటే.. కొత్తగా వచ్చిన రిలేషన్ ని తెంచేసుకోవాలి. అది సాధ్యమైందా? ఇలియానా, రామ్మూర్తిలను వదిలించుకున్నారా? తిరిగి వారి కాపురాన్ని సరిచేసుకున్నారా? అనేదే కథ. ఈ సినిమా మీకు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అలాగే ఎప్పుడూ గిల్లి గజ్జాలు ఆడుకునే జంటకు ఇది మంచి మెసేజ్ కూడా అవుతుంది. ఈ సినిమా పేరు ‘దో అవుర్ దో ప్యార్‘. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Show comments